కృష్ణ

జనతా కర్ఫ్యూ పాటిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. సీఎం జగన్మోహనరెడ్డి నేతృత్వంలో జిల్లాలో ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటలకు వరకు నిర్వహించే జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజానీకం సంఘీభావం తెలిపి కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు మినహా ఇతర సేవలన్నింటినీ జిల్లాలో నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలంతా నిత్యావసర వస్తువులను ముందుగానే తెచ్చుకోవాలని కోరారు.

సమూహాలను నియంత్రించకుంటే కరోనాని ఆపేదెలా!
జగ్గయ్యపేట, మార్చి 21: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వాలు, నేతలు, అధికారులు పలు సూచనలు చేస్తున్నా జనాలలో మాత్రం వాటిని పాటిస్తున్న సూచనలు కనబడటం లేదు. సమూహాలుగా ఏర్పడవద్దని, దగ్గర దగ్గరగా ఉండవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ని సూచనలు చేస్తున్నా పట్టణంలో శనివారం పలు ప్రాంతాల్లో జనసమూహాలు కనిపించాయి. తిరుమలగిరి క్షేత్రానికి భారీగా భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు ఆటోలు, కార్లు, ట్రాక్టర్‌లు, ద్విచక్ర వాహనాలతో క్షేత్రానికి తరలివచ్చారు. రైతుబజారులో వందలాది మంది కూరగాయలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. రైతు బజారు సిబ్బంది మైక్‌లో హెచ్చరికలు జారీ చేస్తున్నా చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్‌లు ఏర్పాటు చేసినా వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అలానే పట్టణంలో పలు కిరాణా షాపుల వద్ద, బ్యాంకుల సేవా కేంద్రాల వద్ద కొన్ని బంగారు షాపుల వద్ద కూడా గుంపులు గుంపులుగా జనాలు చేరి ఉన్నారు. అలానే ఆర్‌టిసి బస్సుల్లో సైతం దూరంగా కూర్చుని ప్రయాణాలు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా కొన్ని కీలక సమయాల్లో నిల్చోని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక ఆటోల సంగతి ఒక ఆటోలో ఎందరు ఎక్కేది తెలిసిన విషయమే. ప్రభుత్వం, అధికారులు ఈ కీలక ప్రదేశాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.