కృష్ణ

సీఎం జగన్ రుణం తీర్చుకోలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పేరుకు జిల్లా కేంద్రమైనప్పటికీ నానాటికి కునారిల్లుతున్న బందరువాసుల చిరకాల వాంఛ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మచిలీపట్నం వాసి గా నా చర్మం వలిచి చెప్పులు కుట్టి ఇ చ్చినా రుణం తీర్చుకోలేనని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌ ర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మచిలీపట్నంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేం ద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతు లు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఎం జగన్మోహనరెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. జగన్ సీఎం అయిన నెల రోజుల్లోనే మచిలీపట్నం కు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని తాను కోరగా ఆ కోర్కెను పది నె లల్లోనే తీర్చినందుకు ఆయనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. మె డికల్ కళాశాల ఏర్పాటు మచిలీపట్నం పరిసర ప్రాంతాలైన అవనిగడ్డ, పెడన, కైకలూరు, గుడివాడ, పామర్రు ప్రజలంతా హర్షించదగ్గ విషయమన్నారు. ఇప్పటి వరకు ఏ చిన్న ఆరోగ్య సమస్య లు వచ్చినా విజయవాడ పరిగెత్తాల్సిన పరిస్థితి ఉందన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం లభించనుందన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థల పరిశీలన చేశామన్నా రు. మూడు ప్రాంతాల్లో స్థలాన్ని గు ర్తించామని, ఇందులో అనువైన స్థలా న్ని ఎంపిక చేసి యేడాది లోపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కళాశాలకు వైఎస్‌ఆర్ మెడికల్ కళాశాలగా నామకరణం చేయనున్నట్టు చెప్పారు. మెడికల్ కళాశాలతో పాటు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా మచిలీపట్నం లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై సీఎం జగన్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. 2012లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సింగ్ కళాశాలను తీసుకు వచ్చానన్నారు. గడిచిన ప్రభుత్వం నర్సింగ్ కళాశాలకు స్థలాన్ని చూపలేకపోయిందన్నారు. మళ్లీ తమ ప్రభుత్వ హయాంలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రాడార్ కేంద్రం సమీపంలోని 4.60 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. 100 సీట్లు భర్తీ చేయాల్సిన నర్సింగ్ కళాశాలలో 30 సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి ఉందన్నారు. పూర్తి స్థాయి కళాశాల నిర్మాణం పూర్తయితే 100 సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.