లోకాభిరామం

ఇంటిపేరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం అంటే స్థలానికి మెదడు. స్థలం అన్నది కాలానికి శరీరం - అలెగ్జాండర్ సాముయెల్
* * *
నా పేరు పూర్తిగా చెప్పాలంటే కారంచేడు బుచ్చిగోపాలం. ఇందులోని మొదటి మాట మా ఇంటిపేరు అన్నారు. మాకు పల్లెలో ఒక ఇల్లు వున్నది నిజమేకనా, ఆ ఇంటికి ఈ పేరు మాత్రం లేదు. ఈ పేరు తమ పేర్ల ముందుగల వాళ్లు చాలామంది ఉన్నారు. అంటే గింటే, ఈ కారంచేడు అన్నది మా వంశానికి పేరుగానీ మా ఇంటి పేరు కాదు. ఇంతకూ ఈ కారం చేడు అన్న గ్రామం ఒంగోలు జిల్లాలో వుందని చెప్పగా వినడమే గానీ, నాకు ఇవాళటివరకు ఆ ఊరిని చూసే అదృష్టం కలగలేదు. అంతకన్నా ముందు, మా వంశానికి మా ఊరికిగల సంబంధం గురించి కూడా నాకు గట్టి అనుమానాలు ఉన్నాయి. మేము తమిళ సంప్రదాయము వాళ్ళము. నిజానికి ఒక నాలుగైదు వంశాలవారు నగవద్రామానుల ఆదేశం మేరకు ఆయనకన్నా ముందే తెలుగుదేశానికి వచ్చినట్టు చెబుతున్నారు. అందులో మా వంవం కూడా ఒకటి అన్నారు. అట్లా వచ్చినపులడు మావాళ్లు ఏమైనా ఒంగోలు జిల్లాకు వచ్చి చేరుకున్నారా తెలియదు. ఈ వంశనామం లేదా అందరికీ తెలిసిన ఇంటిపేరు గలవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లలో ఎవరికైనా ఈ పేరు వెనుకగల రహస్యం తెలిసి ఉంటే, అది నాకు కూడా తెలిస్తే కొంత సంతృప్తిగా ఉంటుంది.
సాధారణంగా వంశనామం అంటే స్వంత ఊరుమీదవస్తుంది. సంబంధం లేని, కనీసం సంబంధం గురించి సమాచారం లేని ఒక ఊరి పేరు మేము ఎందుకు మోస్తున్నామో నాకు అర్థం కాలేదు. మమ్మల్ని మార్చాల వారు అనవచ్చు. ఇమ్మాజిపేట వారు అనవచ్చు. మా అయ్యగారి అమ్మమ్మ కారణంగా ఏనుగొండ అనే పల్లెకు చేరుకున్నాము కనుక, ఏనుగొండ వారు అన్నా బాగానే ఉంటుంది. కానీ ఇంకా కారంచేడు అనే పేరు కొనసాగుతుంది.
ఊరి పేరు ఇంటిపేరు లేదా వంశ నామంగా ఉండడంలో గొప్ప ఆశ్చర్యం లేదు. అయితే ప్రపంచమంతా మాత్రం ఈ పద్ధతిలేదు. కొన్నిచోట్ల ఆ వంశం వాళ్లుచేసిన ఏదో ఒక పని కారణంగా ఒక ఇంటి పేరు వస్తుంది. ప్రత్యేకంగా గుడిలో మంగళహారతి చేసినవారిని హారతివారు అని పిలిచారు. సామవేదం ప్రత్యేకంగా చదువుకున్నవారికి ఆ వేదం పేరు ఇంటిపేరు అయింది. ఒకటికి రెండు వేదాలు చదివితే ద్వివేదుల వాళ్ళు వచ్చారు. ఉత్తర భారతదేశంలో త్రివేదీలు, చతుర్వేదీలు కూడా ఉన్నారు. పురాణం చెప్పిన వాళ్లు పురాణం అనే ఇంటిపేరుతో కొనసాగుతున్నారు. కానీ కొంతమందికి ఈ రకంగా సూచన ఏది కనిపించని ఇంటిపేరు అంటే వంశం పేరు పేరుకన్నా ముందు ఉంటుంది. చింతా వారు ఉన్నారు. చింతకింద వారు ఉన్నారు. చింతకాయలవారు ఉన్నారు. వాళ్ల ఇల్లు పెద్ద చింతచెట్టు కింద ఉంటే చింతకిందివారు అయి ఉంటారు. కానీ చింతవారు మరీ అంతగా చింతచేశారా? చెప్పడం కష్టమే. ఈ రకంగా విశే్లషిస్తూ పోతే ఇంటి పేర్లలోఎక్కడలేని వైవిధ్యం కన్పిస్తుంది. ఒక ఊరు కాక ఒక నది పేరు, ఒక కార్యక్రమం పేరు కూడా ఇంటిపేర్లుగా ఉన్నాయి.
తెలుగునాట ఇంటిపేరులో రెండు మాటలు ఉండి అందులో రెండవది రాజు అని ఉండడం చాలామందికి తెలిసే ఉంటుంది. పద్ధతికి ఉదాహరణలు చెప్పదలుచుకోలేదు.
ముక్కుతిమ్మనకు ముక్కు గురించి పద్యం చెప్పినందుకు ఆ పేరు వచ్చింది అన్నారు. నిజానికి ఆయన అసలు ఇంటిపేరు నంది. అల్లసాని వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది?
ఇంటిపేర్లను గురించి ఇప్పటివరకు ఎక్కడైనా పరిశోధన జరిగిందేమో తెలియదు. జరిగితే ఆ పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రావాలి. పరిశోధన జరగని పక్షంలో ఇక మీద ఎలా జరగాలి. ఇటువంటి మాటలు అనడంకన్నా మనమే కొంత చేసి చూపించడం బాగుంటుంది. ఈ సంగతి నాకు నేనే చెప్పుకుంటున్నాను.
కారంచేడు వెళ్లి, అక్కడ నా వేళ్ళను గురించి వెతకడానికి ప్రయత్నం మొదలుపెడితే ఎటువంటి ఆధారాలు, ఏ రకంగా దొరుకుతాయి అన్న సూచనలు కూడా ఎవరైనా ఇస్తే, నేను ఆ ప్రయత్నంలో తప్పకుండా దిగుతాను. ఇదేరకంగా ఎవరి వంశనామం గురించి వారు కొంత వెతికితే, గతం గురించి తెలుస్తుంది.
అటు గాంధీగారికి, ఇటు రాజాజీగారికి మనమడు అయిన రాజ్‌మోహన్ గాంధీ గారితో నేను మైక్రో హిస్టరీ అనే అంశాన్ని ప్రస్తావించారు. ఆయన తాతల గురించి వారి వంశాల గురించి కొంచెం సులభంగానే తెలుసుకోవచ్చు. కానీ మా తాతల గురించి నాకు ఎవరు చెప్పాలి? మైక్రో హిస్టరీ అన్న అంశానికి ఆయన చాలా బాగా స్పందించారు. పట్టించుకుంటున్నారో లేదో నాకు తెలియదు.
ఇంటి పేర్ల విషయంలో బాపన వారికి ఉన్న పట్టింపు మిగతా వారికి ఉన్నట్టు కనీసం మా ప్రాంతంలో నాకు బలంగా కనిపించలేదు. కొంతమందికి ఇంటిపేర్లు ఉన్నాయి. మరికొంతమందికి అటువంటివి ఏమీ లేనట్లు నాకు నా పల్లె జీవితంలో తోచింది. మా ఇంటి ముందర తూములవాండ్లు ఉంటారు. తూము అన్నది మా ప్రాంతంలో ధాన్యం కొలత. 100 కిలోలకు ఇంచుమించు సమానం. తూములకొద్ది పంట పండించి వాండ్లు ఆ పేరు పొంది ఉంటారు.
కన్నడ దేశంలో కూడా వంశ నామాల విషయంలో ఇంచుమించు మనవారి పద్ధతి మాత్రమే కనిపించింది. తమిళ దేశానికి వెళితే మాత్రం అది కొంత మారినట్టు నాకు కనిపించింది. తమిళులు తమ ఊరి గురించి గట్టిగా పట్టించుకుంటారు అనిపించింది. ఒక్కొక్కరికి పేరులో మూడు భాగాలు ఉంటాయి. నా పేరులోనూ మూడు భాగాలు ఉన్నాయి కానీ, అందులో చివరి రెండు నా స్వంత పేర్లు. పడమటివారు, దీన్ని పెట్టిన పేరు అంటారు. తమిళ్ వారి పేర్ల గురించి ఒక జోక్ కూడా ఉంది. అబ్బాయి ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అప్లికేషన్లో అన్ని వివరాలు ఉన్నా సరే ఇంటర్వ్యూ చేస్తున్నవారు మనిషి మనస్తత్వాన్ని తెలుసుకోవడంకోసం కొన్ని అర్థం లేని ప్రశ్నలు అడుగుతారు. అదే వరుసలో మీ పేరు ఏమిటి అని అడిగారు. మీకు తెలుసుగా అన్నాడు ఈ అబ్బాయి. మీరు చెబితే విందామని అన్నారు ఇంటర్వ్యూ పెద్దమనుషులు. ఇతను చెప్పాడు. చెప్పిన పేరులో మొదటి భాగంవారి ఊరు పేరు. రెండవది అతని నామగారి పేరు. మూడవది అతని స్వంతపేరు. మరి మీ నాన్నగారి పేరు చెప్పండి అన్నారు. ఇతను చెప్పాడు. ఊరిపరు అలాగే ఉంది. చివరి పేర్లు అటు ఇటు మారాయి. అంటే ఈ అబ్బాయిగారికి వాళ్ళ తాతగారి పేరు పెట్టారన్నమాట. మరి మీ ఊరు ఏదిఅన్నారు. ఇతను మళ్లీ పేరులని మొదటి భాగం చెప్పాడు. మొత్తానికి ఇంటర్వ్యూ చేస్తున్నవాళల్లు తికమకపడిపోయారు. ఊళ్లకు పేర్లు కొంత విచిత్రంగా ఉండడంలో ఆశ్చర్యంలేదు. హరిద్వారమంగళం అన్నది ఊరి పేరు అవును కాదు అన్నది నాకు తెలియదు.
తమిళులలో కూడా అన్ని రకాల వారికి ఈ చాదస్తం ఉన్నట్టు నాకు కనిపించలేదు. మంది పేర్లు చాలా సింపుల్‌గా ఉంటాయి. అయితే కొంతమంది పేరు అసలు సిసలు తమిళంలో ఉంటాయి. అవి పలకడానికి మనకు కొంచెం కష్టంగా కూడా ఉండవచ్చు. ఉతర భారతదేశానికి వెళితే, వారి పేర్లలో ఇణటిపేరు లేదా వంశం పేరు అన్నది అంతగా కనిపించదు. గుప్తా, గోయల్, అగర్వాల్, సింగ్ లాంటి కొన్ని మాటలు ఉంటే అవి వారి కులాన్ని సూచిస్తాయి తప్ప వంశంగురించి చెప్పవు. వాళ్ల సొంత ఊరి గురించి కూడా పేర్లలో అంతగా కనిపించినట్టు నాకు తోచలేదు.
ఇంటిపేర్ల సంగతి ప్రపంచమంతటా ఇదే పద్ధతిగాందా అన్న అనుమానం వచ్చి కొంచెం వెతికాను. ఇంగ్లాండ్‌లో వెయ్యి సంవత్సరాల కిందటి వరకు ఎవరికి వంశనామం అన్న పద్ధతి తెలియదట. ఆ తరువాత మనుషులు కనబడుతున్న తీరును బట్టి పేరుతోపాటు మరొక మాటలు జోడించే పద్ధతివచ్చింది. ఎర్రగా ఉన్న మనిషికి రెడ్ అనేమాట పేరుతో చేరింది. జాన్ అనేపేరు ఒక ఊరిలో ఒక పేటలో ఎంతోమందికి ఉండవచ్చు. కనుక జాన్ ది రెడ్ ఒకరైతే పొట్టి జాన్ అని మరొకరు. అంతేకానీ మనలాగా స్వంత ఊరు పేరు పెట్టుకోవాలని వాళ్లకు తోచినట్టు లేదు. యూరప్ మొత్తంలోనూ వారి ప్రాంతం, లేదా కొన్ని రకాల సంబంధాలు, వృత్తి, చివరికి ఆ మనిషి వర్ణన ఈ నాలుగింటి ఆధారంగా వంశనామామలు వచ్చినట్లు చెబుతున్నారు. చాలా సులభంగా గుడ్డలు కుట్టే వారి ఇంటి పేరు టైలర్ అంది. ఆ మాటను వేరు వేరు భాషలలో వాడుకుంటే అదే వృత్తిగలవారికి వేరు వేరు ఇంటిపేర్లు వచ్చాయి. మార్గరెట్ తాచర్ పూర్వీకులు ఇంటిపైకప్పులు వేసేవాళ్లు అంటే నమ్మగలరా?
అమెరికా దేశానికి అందరూ మరొకచోటనుంచి వలస వచ్చినవారే. కనుక ఆ వచ్చిన ప్రాంతాల పేర్లను తమ వంశ నామంగా పెట్టుకునేవారట. అమెరికా వారు మొదట్లో పేర్లకొరకు వెతికిన పద్ధతులను గురించి చలా ఆసక్తికరమైన సమాచారం ఉంది. ప్రస్తుత అమెరికాలో మొత్తం 13 లక్షల ఇంటి పేర్లు ఉన్నాని అక్కడివారు లెక్కవేసి తేల్చారు.
చైనా, జపాన్, కొరియా లాంటి దేశాలలో మనుషులకు ఉండే పేర్లు చాలా తక్కువ. లీ, వాంగ్, చాన్, కిమ్ లాంటి కొన్ని పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి.
ఆఫ్రికాలో వారి పేర్లను గురించి ప్రత్యేకంగా మరొక వ్యాసమే రాయవచ్చు. మొత్తానికి వంశనామం అన్నది ప్రపంచంలో అన్నిచోట్ల నిజంగా మనుషులకు గుర్తింపు ఇచ్చేదిగా ఉంటున్నది అన్న మాట వాస్తవం. ఆఫ్రికాలో ఒక బిడ్డ పుట్టినపుడు ఉండిన వాతావరణాన్ని ఆధారంగా వేరు నిర్ణయిస్తారట.
ఈ మధ్యన అమెరికాయి సామ్ బాబాయి కారణంగా పేర్లు తిరగవేసి చెప్పుకునే పద్ధతి ఒకటి బలంగా వచ్చింది. ఇపుడు నేను గోపాలం కారంచేడు అని పేరు రాసుకుంటున్నాను. జపాన్‌వారు కూడా తమ భాషలో చెప్పుకున్నపుడు ఒక పేరును చెప్పిన క్రమాన్ని, ప్రపంచం ముందు వచ్చేసరికి మాత్రం తలకిందులు చేసి చెబుతున్నారు.
పేరులోన ఏమి పెన్నిది ఉన్నది అన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ నిజంగా వెతికతే వంశనామంలో లేదా పెట్టిన పేరులో చాలా రహస్యాలు దాగి ఉంటాయని నాకు బలంగా తోచింది. ఇకమీద కొంతకాలమైనా వాటిని పరిశోధించే పనిలో ఉంటాను.

-కె.బి.గోపాలం