తెలంగాణ

మహా ఘట్టానికి నేటితో తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, ఫిబ్రవరి 19: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ కుంభమేళా మేడారం జాతర మహాఘట్టానికి శనివారంతో తెరపడనుంది. గత నాలుగు రోజులుగా జనారణ్యంగా మారిన మేడారం.. తల్లుల వనప్రవేశంతో బోసిపోనుంది. సుమారు కోటికి పైగా భక్త జనం తల్లులను దర్శించుకుని పరవశించిపోయారని అధికార యంత్రాంగం లెక్కలు చెపుతుండగా అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చునని మరో అంచనా. కేవలం బస్సుల ప్రయాణం, కొద్దిపాటి ప్రైవేట్ వాహనాల లెక్కలతో సరిచూసుకుంటేనే కోటి మంది భక్తులు అనుకుంటే...ఇక మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తజనం తల్లులను దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. 17న కనె్నపల్లి నుండి సారలమ్మ, 18న సమ్మక్క తల్లులు గద్దెలను అధిష్టించడంతో శుక్రవారం భక్తజనం తమ మొక్కులు చెల్లించుకునేందుకు పోటీపడ్డారు. దేవాలయ క్యూలైన్‌లన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ అపశ్రుతులు, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ఒక పక్క శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వస్తున్నారనే ప్రచారం జరగడంతో వేకువజామునుండే భక్తులు మొక్కులు చెల్లించుకుని త్వరితగతిన మేడారం వదిలి ఇంటిముఖం పట్టాలని ఆరాటపడ్డారు. కాని చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రావడం లేదని తెలవడంతో భక్తజనం ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జాతరలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిందనే చెప్పవచ్చు. జాతరలో వనప్రవేశం అనంతరం చేపట్టాల్సిన పారిశుద్ధ్యపు పనులను ఏరోజుకారోజు రాత్రి సమయాలలో చేపట్టడం గమనార్హం.