రంగారెడ్డి

మూఢవిశ్వాసాల బారినపడి మోసపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 26: ఆధునిక యుగంలోనూ ప్రజలు.. మూఢవిశ్వాసాల భారిన పడి నిలువుగా మోసపోతున్నారని జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదిర్శి రమేష్ సూచించారు.
నగరపంచాయతీ పరిధిలోని ముదిరాజ్ బస్తీలో దెయ్యాలున్నాయనే ప్రచారంతో కొన్ని రోజులుగా కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ఏవేవో పెద్ద శబ్ధాలు, ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వస్తున్నాయని పుకార్లు వ్యాపించాయి. కాలనీలో గతంలో మృతిచెందిన ఇరువురు దెయ్యాలుగా మారి తిరుగుతున్నాయని ప్రచారం చేయడంతో కాలనీవాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కాలనీవాసుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కాలనీలో అవగాహన సదస్సు నిర్వహించారు. జనవిజ్ఞాన వేదిక నేతలు పలు ప్రదర్శనలు నిర్వహించి, దెయ్యాలున్నాయని భ్రమపడుతున్న పలువురు కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం జనవిజ్ఞాన వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా కార్యదర్శి పురుషోత్తం, ప్రజాల సంఘాల నాయకులు సామేల్, జంగయ్య, జగన్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పును చోటు చేసుకుంటున్నప్పటికీ గ్రామాల్లో సామాజిక రుగ్మతలు పెరిగిపోతున్నాయని అన్నారు. మూఢవిశ్వాసాల భారిన పడి ఎంతో మంది తమ విలువైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాల ప్రభావంతో ఎంతో మంది దెయ్యాలున్నాయని భ్రమపడుతూ అనవసర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలాంటివి కేవలం కల్పితాలు మాత్రమేనని వాస్తవానికి నిజదూరంగా ఉన్న వాటిని నమ్మకూడదని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం సిఐ జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రజలలో భయాన్ని ప్రేరేపిస్తూ, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటో కొంత మంది దోపిడీ చేయాలనే ఉద్ధేశ్యంతో ఇలాంటి కల్పితాలను ప్రేరేపిస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు అనవసరంగా నమ్మి భయాందోళనలకు గురికావద్దని సూచించారు. ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ప్రకాశ్‌కారత్, చెనమోని శంకర్, శంకర్, బండి నర్సింహా, వెంకటేష్, ఉన్నిసా బేగం పాల్గొన్నారు.