మాతో - మీరు

అవీ-ఇవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవాల మ్యూజియం - ప్రపంచంలో ఖరీదైన ఫలం - వెక్కిరింత లాంటి శుభాకాంక్ష, టోపీ హిస్టరీ ముచ్చటగొలిపేవిగా ఉన్నాయి. ఇప్పుడు మూడు కాదు ఒకటే కాలం. ఎండాకాలం! నీళ్లు లేని కన్నీళ్లు తెప్పించే మండేకాలం! అంటూ ‘సండే గీత’లో వ్యక్తం చేసిన ఆవేదన కలచివేసింది. తరచి చూస్తే చెట్లు నరికేసి, పర్యావరణ స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్న మన వల్లనే మనకీ దుస్థితి. ప్రజా ప్రతినిధుల జీతభత్యాల పెంపుపై ఆక్షేపించింది ఇద్దరే అని ఒక పాఠకుడు అన్న దానికి మీ సమాధానం భలేగా ఉంది. ప్రజల్లో మంచి మార్కులు కొట్టేయడానికే వద్దన్నారు. పుచ్చుకోవడం మానలేదు కదా! డబ్బు ఎవరికి చేదు?!
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)
ఓ చిన్న మాట
‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ నీతిని బోధిస్తూ.. నిజాల్ని వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే అనుకుంటారు కాని వాళ్ల బాల్యాన్ని తుంపేస్తున్నా మనుకోరు. ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు ఎండలు మండిపోతున్నై అంటూ చాలా బాగా చెప్పారు. ఏసీలు ఉన్నవారైనా ఎంతసేపు ఒకే గదిలో కూర్చుంటారు? ఇక ‘కనువిప్పు’ కథ బాగుంది. కామన్ ఫండ్ కథ చదివాక ఇలా కూడా ఉంటున్నారా ఈ తరం పిల్లలు అనిపించింది. ‘స్ఫూర్తి’లో మనిషికి ఆనందం ఎందులో ఉంటుందో చక్కగా చెప్పారు. అమెరికా పిచ్చిలో పడిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు డబ్బులోనే ఆనందం పొందుతున్నారు. ‘అవీ-ఇవీ’ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక -మంచినీటిని ఎలాగూ కొంటున్నారు. ఇంకా గాలినీ కొనాలి. మానవుడు ఎంతగా ఎదిగినా మృత్యువుకు దగ్గరవుతున్నాడన్నది నిజం.
-డి.వి.తులసి (రామవరప్పాడు)
నిజం!
ఏప్రిల్ ఒక్కటే కాదు, ఇప్పుడు సెలవులన్నీ పిల్లల పట్ల క్రూరంగానే ఉన్నాయని ‘ఓ చిన్న మాట’గా చెప్పడంలో ఎంతో నిజం ఉంది. కానీ టీవీలు, నెట్‌లు, ఫోన్లు రాక ముందు ఎంత హాయిగా ఉండేదో! అయితే కాలం మారక తప్పదు. మనం కాలానికి బానిసలం! ఇక - విమానాల భద్రత రైళ్లకూ కల్పించాలనడం కుదరదు. ఎయిర్‌పోర్టుకి గంట ముందు వెళ్లాలి. సెక్యూరిటీ చెకప్, లగేజ్ స్కానింగ్ ఉంటాయి. రైలుస్టేషన్లలో అలా చేస్తే జరిగే ఆలస్యానికి ప్రయాణీకులే మొదట తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. అలాగే - ఎండలు మండిపోతున్నాయంటూ చల్లచల్లని ఆహ్లాదం గొలిపే మామిడికాయల పసందు విశేషాలు భలేగా చెప్పారు గోపాలంగారు.
-కె.సుధీర్ (శ్రీనగర్, తూ.గో.జిల్లా)
ఈ వారం స్పెషల్
ఈ శీర్షికన అందించిన ‘ఆటవిడుపు’ చాలా బాగుంది. చదువులకు విరామం, చుట్టాలతో గడపడం, దూర ప్రదేశాలకు వెళ్లడం లాంటి హాయిగొలిపే కార్యక్రమాల గురించి చెప్పారు కానీ అయ్యో పాపం! పిల్లలకు అంత అదృష్టమా? పేరుకు సెలవులే గాని సమ్మర్‌లో కూడా కార్పొరేట్ స్కూళ్లు క్రాష్ కోర్సులంటూ ఏవేవో నిర్వహిస్తున్నారు. పిల్లల బుర్రల్లో విజ్ఞానం కూరెయ్యాలని తల్లిదండ్రులు కూడా సమ్మర్ క్లాసులను ప్రోత్సహిస్తున్నారు. పదాల పుట్టుక గురించి సన్నిధానం వారు బాగా చెప్పారు. వీలైనన్ని ఎక్కువ పదాల మూలాలను మరిన్ని ప్రచురిస్తే బాగుంటుంది. అలాగే మనం రాస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ మరో శీర్షిక నిర్వహిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
భయం
ఆ రోజుల్లో టెలిగ్రాం వచ్చిందంటే భయం వేసేది. విషాద వార్తలకు పెట్టింది పేరు టెలిగ్రాం. తరువాత్తరువాత రాకపోకలు తెలియజేయడానికి, ఇంటర్వ్యూలకు టెలిగ్రామ్‌లను పంపేవారు. టెలిగ్రఫీ శబ్దాలను భాషలోకి తర్జుమా చేసి చేతి రాతతో ఆ తరువాత ప్రింట్‌లో వచ్చేవి. స్టెనోగ్రఫీ కూడా ఇంతే. పిచ్చిగీతల్లా కనిపించినా వాటిలో ఆంగ్ల భాషంతా ఇమిడిపోయేది. ఇప్పుడీ విద్యలన్నీ కనుమరుగై పోయాయి. పట్టణం నుంచి టెలిగ్రామ్‌లు తీసుకొచ్చే ప్రత్యేక మెసెంజర్లు ఇళ్లకు తీసుకొచ్చేవారు. ఫోన్లూ అంతే. పొద్దున బుక్ చేస్తే ఏ మధ్యాహ్నానికో లైను కలిసేది. పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానానికి అందరం రుణపడి ఉన్నాం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
ఆటవిడుపు
ఈ వారం స్పెషల్ ‘ఆటవిడుపు’ చదివాకా.. ఈ కాలంలో ఎండతో మండడమే ఆటవిడుపవటం శోచనీయం. కామన్‌ఫండ్ రచయిత్రి రామలక్ష్మి గార్కి అభినందనలు. ‘మీకు తెలుసా?’లో ఖరీదైన ఫలం, టోపీ హిస్టరీ.. ఇత్యాది అంశాలు బావున్నాయి. ‘సండే గీత’ ‘ఓ చిన్న మాట’ రెండూ నేటి కాలమాన పరిస్థితులకు అద్దం పట్టాయి. ఈ పదాల పుట్టుక.. వ్యాసం బాగుంది. ‘వినదగు’ శీర్షిక అపూర్వ అంశాలను ప్రస్తావిస్తోంది.
-నేమాన సుభాష్‌చంద్రబోస్ (విశాఖ)
వేసవి వినోదం
విరామం లేని ఒత్తిడితో కూడిన బట్టీల చదువుతో కుస్తీ పడుతున్న చిన్నారులకు వేసవి సెలవులు ఎంత రిలీఫ్ నిస్తాయో ఈ వారం స్పెషల్ ద్వారా తెలియజేశారు. రొటీన్ వాతావరణానికి భిన్నంగా బంధువుల ఇళ్లకు వెళ్లడం, రకరకాల ఆటలతో ఎంజాయ్ చేయడం పిల్లలకు వేసవి అంతా పండుగే. అయితే గత కాలంనాటి మధుర ఘట్టాలు ఈనాడు లేవు. పల్లెల్లోనూ ఆధునికత చోటు చేసుకొని సెలవులను కంప్యూటర్, మొబైల్ గేమ్స్‌తోనూ, టీవీలతోనూ గడుపుతున్నారు. వెనకటి కాలంలోకి మల్లే కోతి కొమ్మచ్చి, దాగుడుమూతలు, ఈత సరదాలు, మామిడిపళ్ల వేట వంటివి చాలా తగ్గిపోయాయి.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)