కృష్ణ

మచిలీపట్నం పోర్టు కోసం రైతుల అంగీకారంతో భూసమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల అంగీకారంతో భూసమీకరణ ద్వారా సేకరించటం జ రుగుతుందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి కొ ల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెం టు సభ్యులు కొనకళ్ల నారాయణరావు, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇనె్వస్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, జిల్లా కలెక్టర్ బాబు.ఎలతో మచిలీపట్నం పోర్టు భూసేకరణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు ని ర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా వున్నారన్నారు. నెల రోజుల్లోగా భూసమీకరణకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటుచేస్తామని, సిఆర్‌డిఎ తరహాలో భూములను అభివృద్ధి చేసి మెగా టౌన్‌షిప్ ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు. తొలిదశలో మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూ యజమానులకు స్థలాలు కేటాయించిన తరువాతే వారి భూములను తీసుకోవటం జరుగుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించిన రైతుల భూములను మాత్రమే భూసేకరణ ద్వారా తీసుకోవటం జరుగుతుందన్నారు. ఎంతోకాలంగా రైతు లు తమ భూములకు కొనుగోళ్లు, అ మ్మకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ల్యాండ్ పూలింగ్‌తో ఆ సమస్య పరిష్కరించవచ్చునని మంత్రి తెలిపారు. రాష్ట్ర రాజధానికి మచిలీప ట్నం పోర్టు దగ్గరగా వుండటం తద్వా రా పోర్టు అనుబంధ పరిశ్రమలు స్థా పించబడి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం వుంటుందన్నారు. బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మచిలీపట్నం ప్రజలు పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఎంతోకాలం గా ఎదురు చూస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పోర్టు నిర్మా ణం జరిగి అనుబంధ పరిశ్రమలు స్థా పిస్తే ఆ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో హడ్‌కో ఇతర బ్యాంకులు సమకూర్చే రుణం సుమా రు 1500 నుండి 2000కోట్ల రూపాయల నిధులతో అత్యాధునిక వసతులతో మెగా టౌన్‌షిప్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. మెగా టౌన్‌షిప్‌లో రోడ్లు, లైట్లు, డ్రైనేజి, తాగునీరు వంటి వౌలిక సదుపాయాలకు అంచనాలను తయారుచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పోర్టు, మెగా టౌన్‌షిప్, పరిశ్రమల స్థాపనతో జిల్లా స్వరూపమే మారుతుందని, స్కి ల్ డెవలప్‌మెంట్ అభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం వుంటుందన్నారు. రాజధానికి పోర్టు కనెక్టివిటీ వుండాలన్నారు. పోర్టు నిర్మాణం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు జరగాలని అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రోల్ కెమికల్ పరిశ్రమల స్థాపనకు విదేశీ సంస్థలు సిద్ధంగా వున్నాయన్నారు. తెలంగాణలో పవర్ ప్రాజెక్టులు నిర్మించనున్నారని, వాటికి బొగ్గు సరఫరా మచిలీపట్నం పోర్టు ద్వారా వుంది కాబట్టి పోర్టుకు మంచి డిమాండ్ వుంటుందన్నారు. మచిలీపట్నం డెవలప్‌మెంట్ అధారిటీతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటు చేసుకుంటే ఉపాధి అవకాశాలు మెండగా వుంటాయన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, ఇన్‌చార్జి డిఆర్‌ఓ పి.సాయిబాబా, ట్రైనీ కలెక్టర్ సలోని సిదాన పాల్గొన్నారు.

రియల్ సంస్థకు అదనపు చెల్లింపులు లేవు
* మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్
విజయవాడ, నవంబర్ 20: వీధీ దీపాల నిర్వహణ కాం ట్రాక్ట్ చేపట్టిన రియల్ ఎనర్జీ సంస్థకు అదనపు చెల్లింపులేవీ జరగడలేదని, అసలు అలాంటి ప్రతిపాదనలతో కూడిన ఫైల్ సిద్ధమైందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం రియల్ ఎనర్జీ సంస్థకు చెల్లించిన విధానాలు, చెల్లించబోతున్న విషయాలపై శే్వతపత్రం విడుదల చేసిన కమిషనర్ వీరపాండియన్ రెండు రోజులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2008 ఆగస్టు నుంచి జూన్ 2014 వరకూ చెల్లించిన మొత్తం 7 కోట్ల 44 లక్షలు మాత్రమేనని, 2014 జూలై నుంచి అదే సంవత్సరం నవంబర్ వరకూ చెల్లించాల్సిన 72లక్షల 14 వేల రూపాయల బిల్లు మాత్రమే విఎంసి అకౌంట్స్ సెక్షన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణల మాదిరిగా ఇప్పటి వరకూ 15 కోట్ల చెల్లింపుతోపాటు మరో 2.5 కోట్ల రూపాయల చెల్లింపుల కోసం ఫైల్ సిద్ధంగా ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఈవిషయమై ఏ అధికార ప్రతినిధి ఇంత వరకు నగర పాలక సంస్థ అధికారులపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా అటువంటి చెల్లింపుల కోసం ఎటువంటి ఫైల్ కూడా తనకు సమర్పించలేదంటూ బాబూరావు చేసిన ఆరోపణల ను విఎంసి నిర్ద్వందంగా ఖండిస్తున్నామన్నారు.