Others

స్ఫూర్తిదాయకం సరోజిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చెప్పేది 55 సంవత్సరాల క్రితం నాటి సంగతి. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాక, లేకలేక ఆ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి లక్ష్మి సరోజిని అనే పేరు పెట్టుకున్నారు. ఎంతో గారాభంగా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చదువంటే అమితమైన ఇష్టం ఉన్న ఆ తల్లిదండ్రులకి ఆ పాపకు చదువు నేర్పించాలని అనుకొని స్కూల్లో వేశారు. అప్పట్లో ఐదవ తరగతి వరకే చాలా ఎక్కువమంది చదువుకునేవారు.
ఆ తర్వాత ఆరో తరగతి నుంచి ఆడపిల్లల్ని పాఠశాలకు అసలు పంపేవారు కాదు. ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు. కానీ లక్ష్మి సరోజిని ఐదో తరగతి పూర్తయినా కూడా పాఠశాల మాన్పించలేదు. తన చదువును కొనసాగించారు. 10వ తరగతిలో ఫస్ట్ మార్పులతో పాస్ అయి ఆ ఊర్లో వాళ్లందరిని ఆశ్చర్యపరిచారు. ఎంతోమంది ఆడపిల్లకి చదివేందుకు? పెళ్లి చెయ్యండి అని ఉచిత సలహాలు కూడా ఇచ్చేవారు. అయినాగానీ వెనుకడుగు వేయకుండా ఆ ఊరిలో వాళ్లు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా ఏది ఏమైనా లక్ష్మి సరోజిని చదివించాలనే తపనతో సమాజం నుండి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఆడపిల్లలు చదువుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే ముందు చూపుతో ఆ పల్లెటూరులో కాలేజీలు లేకపోయినా పట్నంలో బంధువుల ఇంట్లో ఉంచి డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ చదివేటప్పుడే అన్నిట్లో బాగా చురుగ్గా పాల్గొనేవారు. కొన్ని యాక్టివిటీస్‌కి న్యాయకత్వం కూడా వహించేవారు. అలా డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయికి, డిగ్రీ పూర్తి చేసిన ఒక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేసారు.
ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేని తాను ఏం చేస్తే బావుంటుందో అని ఆలోచించి, తను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలనే ధ్యేయంతో పాఠశాలను స్థాపించాలనే ఒక నిర్ణయానికి వచ్చి తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారు. తన ఆలోచనలను వెన్ను తట్టి ప్రోత్సహించి నీ వెనుక నేనున్నాననే నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు.
అనుకున్నదే తడవుగా ఒక మంచి ముహూర్తాన ఆ పాఠశాలను ప్రారంభించి దానికి ప్రతిభ స్కూల్ అని నామకరణం చేశారు. కేవలం 17 మంది పిల్లలతో పాఠశాలను ప్రారంభించి తానే ఉపాధ్యాయురాలుగా ఉంటూ తన సక్సెస్ జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు, అవన్నీ తట్టుకుని నిలబడ్డారు. ఒక పక్క పిల్లలకు చదువు చెప్తూనే తాను విద్యార్థిగా చదువుకుంటూ పెళ్లయిన కూడా 9 డిగ్రీలు చేసి వాటి పట్టా అందుకున్నారు.
మరియు కథా రచయితగా, కవయిత్రిగా, ఎన్నో కవితలు, కథలు పత్రికలలో అచ్చయ్యాయి. భారత మహిళా శిరోమణి అవార్డు, విద్యారత్న అవార్డు, ఉగాది పురస్కారం అవార్డు, ఆంధ్రరత్న అవార్డు, ఇలాంటివి ఎన్నో అవార్డులు తన సొంతం. అంతేకాక ప్రిన్సిపాల్‌గా ఎనలేని కృషి చేస్తూ జిల్లాలోని మేటి స్కూలుగా నిలబెట్టి, ఎనె్నన్నో పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా జీవితం గడుపుతున్నారు.
అంతేకాక స్కూల్‌లో బాగా చదువుకునే నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్యను ఇప్పిస్తున్నారు. అది తన సేవ గుణానికి నిదర్శనం. మహిళా చైతన్య సమైక్యాన్ని ఏర్పరచి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతూ సమాజం పట్ల స్ర్తిల పట్ల, చక్కటి కుటుంబం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ సలహాలిస్తూ, అహర్నిశలు కృషి చేస్తున్నారు. వాళ్ల కుమారుడు సుభాష్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అయిన బిట్స్ పిలానీలో సీటు సంపాదించి విప్రో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు జాబ్ చేశారు. ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో తాను చదువుకున్న ఊరికి అక్కడ పిల్లలకి మంచి చదువు నేర్పించాలన్న తపనతో తన తల్లిదండ్రులు పెట్టిన స్కూలుకి తిరిగివచ్చి, తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుని ఆ స్కూల్‌ని ఒక మెట్టుపైకి తీసుకళ్లారు. ఈ రోజు లక్ష్మి సరోజనికి, తన కుమారుడు చేదోడువాదోడుగా ఉంటూ ఆ పాఠశాల ముందుకు తీసుకెళ్లడంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. కేవలం 17 మందితో మొదలు పెట్టిన ఆ పాఠశాల ఈ రోజు తెలుగు మీడియం లేకుండా, హాస్టల్ లేకుండా, కేవలం నాలుగు బస్సులతో 1600 మంది పిల్లలతో దిగ్విజయంగా ముందుకు కొనసాగుతుంది. ఇది లక్ష్మి సరోజినీ ఒక్క కృషి పట్టుదలకు నిదర్శనం. ఒక ఆడపిల్ల ఏదైనా సాధించగలదు అని నిరూపించారు.
ఆడపిల్లలు ఏదైనా సాధించగలరన్నా నమ్మకాన్ని ధైర్యాన్ని వాళ్లకు ఇవ్వండి మన ఇంట్లో ఆడపిల్ల ఏది సాధించాలనుకుంటే అది చేయనివ్వండి. వాళ్లని చిన్నచూపు చూసి వెనక్కి లాగకండి. ఒక్క అవకాశం వారికి ఇచ్చి చూడండి. ఆ రోజు తన నిర్ణయాన్ని గౌరవించి సపోర్ట్ చేసారు కాబట్టే రోజు ఆ ఆ పాఠశాల ఉంది. ఎంతోమందికి ఆ పాఠశాల ద్వారా జీవనోపాధి కలుగుతుంది. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి, ఎంతో మంది ఆడపిల్లకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అందుకని ఆడపిల్లను చదివిద్దాం, బతికిద్దాం, కాపాడుకుందాం.

- కాన్సర్ సింధూరెడ్డి