స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
(13)

వేద మీ మహత్వాన్ని ‘అధాహిన్వాన ఇంద్రియం జ్యాయో మహిత్వ మానశే’’ అని ఈ మంత్రంలో శ్లాఘించింది.
అసలు జీవులకు భగవంతుడు ఇంద్రియాలనెందుకు ఇచ్చాడు? స్వయంశక్తి లేని జీవులు కోరుకొనే అభీష్టాలను ఇంద్రియాల ద్వారా వారికి తానే కర్తయై సమకూర్చేటందుకే. అందుకే జీవులు విశే్వశ్వరుణ్ణి ఇలా ప్రార్థించాలని వేదం హెచ్చరించింది.
తథా తదస్తు సోమపాః సఖే వజ్రిస్త్థా కృణు!
యథా త ఉశ్మసీష్టయే
సోమపాః=సోమరసాన్ని సేవించేవాడా? ఓ పరమాత్మా! మా మా అభీష్టాలు మేము నిన్ను కోరుకొనే విధంగానే సిద్ధించుగాక! మా వాంఛలను నిరాటంకంగా సమకూర్చే ఓ మిత్రుడా! మేము కోరుకొన్న రీతిగానే మా కోర్కెలను సఫలం చేయి.
ఈ ప్రార్థనను బట్టి జీవుల అభీష్టప్రదాయకుడు విశ్వకర్తయైన భగవంతుడే అన్నది స్పష్టమైనది. విచర్షణిః అన్నమాట ద్వారా వేదం ఈ అంశాన్ని సమర్థిస్తూంది. విచర్షణిః అంటే సమగ్రంగా దర్శించేవాడని అర్థం. జీవుడి జ్ఞానం సామాన్యమైనదేగాని పరమాత్మునకు గల జ్ఞానం అసామాన్యమైనది. విశ్వంలో సమస్త పదార్థాల తత్త్వం- గుణం- ధర్మం- వైవిధ్యం వీనిని గూర్చిన సత్య జ్ఞానమే విశేష జ్ఞానం. దేవదేవుడు సర్వవ్యాపకుడు కావటంతో బాటు మహాచైతన్య స్వరూపుడు మరియు సర్వజ్ఞుడు కూడా. అందుకే ఏ జీవికి ఏది అవసరమో ఆయనకే బాగా తెలుసు. జీవులు చేసే పనిని బట్టి వారి కోరిక ఎట్టిదో స్పష్టపడుతుంది. ఫలితం కూడా దాని ననుసరించియే యుంటుంది. కాబట్టి జీవులు తాము కర్మనే ప్రకారంగా చేస్తూ వుంటారో వారి కోరిక కూడా అదేప్రకారంగా వుంటుందని వేరుగా చెప్పనక్కరలేదు. అందుచేత ‘‘్భక్తుడా! భగవంతున్ని హృదయపూర్వకంగా ప్రార్థించు. ఆయన నీకు పరమమిత్రుడు’’ అని ఋగ్వేదం వర్ణించింది. ఆ పరమేశ్వరుడు లోకంలో ఉండే సామాన్య మిత్రుని వంటివాడు కాడు. ఆయన అసామాన్య మిత్రుడు. మిత్రుడు మిత్రుని అభ్యర్థనను తిరస్కరిస్తాడా? కాబట్టి వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడై మిత్రుడవైన నీకు కలిగే సర్వ అనర్థాలను పారద్రోలగలడు. అట్టి విఘ్న వినాశకుడైన భగవన్మిత్రుని పొంది కూడా మనం మన అభీష్టాలను సఫలం చేసుకొనలేకపోతే అంతకంటె దౌర్భాగ్యముంటుందా?
-ప్రాణాయామం ద్వారా జ్ఞానం
వీళు చిదారుజత్నుభిర్గుహా చిదింద్ర వహ్నిభిః
అవింద ఉస్రియా అను
భావం:ఓ జీవాత్మా! జీవనాధారమైన ప్రాణాలలో బాధను కలిగించే స్వభావం కలిగియున్నా నీలోని జ్ఞానజ్యోతులు అలా బాధను కలిగింపక నీకు అనుకూలం కాగలవు.
వివరణ:ఈ మంత్రం చిన్న వాక్యంలో ప్రాణామాయ ఘనతను వివరించింది.
ఈ మంత్రం ప్రాణాన్ని ప్రాణశబ్దంతో వ్యవహరించక వహ్ని శబ్దంతో వ్యవహరించింది. లౌకిక భాషలో వహ్ని శబ్దానికర్థం నిప్పు అని. శరీరంలో ప్రాణాలున్నంతవరకు జీవనాగ్ని ఉంటుంది. శరీరాన్ని ప్రాణాలు వీడితే మాత్రం అది వెంటనే చల్లబడిపోతుంది. అందుచేతనే ప్రాణాలు అగ్నికంటె వేరైనవి కావు. అగ్నిలో సహజంగా ఉండే దాహకశక్తి (ఉష్ణశక్తి) వలన అది సుఖ సంతోషాలతో బాటు దుఃఖానికి కూడా కారణమే. అగ్ని వలన కలిగే బాధ ఏమిటో గ్రీష్మఋతువులో అందరకు అనుభవమే.
.................................ఇంకావుంది