స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
లోకంలోని ప్రతి వస్తువును అగ్ని తన దాహకశక్తికి ఇంధనంగా చేసకొని ఎండించి మండింపజేస్తుంది. అదేరీతిగా శరీరంలో వుండే ప్రాణమనే అగ్నికి కూడా తగినంత ఇంధనం లభించనప్పుడు శరీరంలోని మాంస రక్తాలను దహింపజేస్తుంది. ఇదే జీవనాధారమైన ప్రాణాలలో ఉండే దాహకత్వ లక్షణంగల అగ్నిస్వభావం. ఇది జీవులకు మరణ సమయంలో స్పష్టంగా అనుభవంలోనికి వస్తుంది. కాలమనే అగ్ని ఎములగూడు అయిన శరీరంలో గల పంచ ప్రాణాలను బయటకు లాగేందుకు రాగానే అవి బయటకు పోయేందుకు మార్గాలన్నీ మూసుకుపోతాయి. దారి తెలియక బలహీనపడి వ్యాకులతకు గురి అవుతాయి. మరణిస్తూ ఉన్న ఇట్టి మనిషి దుస్థితిని చూచి మోక్షాన్ని కోరుకొనే యోగి ఇట్టి బాధాకరమైన ప్రాణాలను ముందుగానే తనకు వశం చేసుకొంటాడు. ఆ విధంగా తనకు మృత్యు సమయం సమీపించగానే తన ప్రాణాలను ముందుగానే బయటకు లాగి విడిచిపెడతాడు.
ఆ విధంగా ఆ యోగి తన ప్రాణాలను దహింపచేయలేనట్టి ఆ అగ్నిని తిరిగి ఆ ప్రాణాలనే వహించి తీసుకొని వెళ్లే భటుడిగా చేస్తాడు. అలా ప్రాణ సంచారం స్తంభించిపోతుంది. ఫలితంగా ప్రాణాలు కూడా వహ్నినే వహిస్తాయి. ఆ స్థితిలో ప్రాణాలు వానిలో వుండే అగ్నికి గల దాహకశక్తతో ఏకీకృతమైపోతాయి. ఫలితంగా నశింపచేస్తే ప్రాణాలు నశిస్తాయి. సంరక్షిస్తే ప్రాణాలను సంరక్షిస్తాయి. అగ్నిగా రూపాంతరం చెందినపుడు ప్రాణాలు ప్రాణాగ్నియై జీవుణ్ణి జీవింపజేస్తుంది. కాబట్టి ఓ జీవుడా! జీవిస్తావో మరణిస్తావో నిర్ణయించుకో! ప్రాణాలు అగ్నిగా రూపాంతరం చెంది అనగా ప్రాణాగ్నిగా మారినా కూడా అవి జీవుణ్ణి బాధించేవిగానే ఉంటాయి. ఈ బాధ కేవలం శరీరాంగాలకో లేదా శరీరానికో కాదు. ఎందుకంటే ప్రాణాలలోని క్రియాశక్తివలన జీవాత్మకు ఆశ్రయమైన శరీరాన్ని ఆవరించియుండే దేహమే నేనను భ్రాంతిపూర్వకమైన అవిద్యామలాన్ని (దోషాన్ని) తొలగించి జీవుణ్ణి పరిశుద్ధుణ్ణి చేస్తుంది. దానితో ఆత్మ నావరించిన అజ్ఞానపు తెర చిరిగిపోతుంది. అందుచేతనే వేదమంత్రం అవింద ఉస్రియా అను = ఓ జీవాత్మా! జ్ఞానజ్యోతులను నీవే సానుకూలంగా పొందగలవు అని నిర్దిష్టంగా చెప్పింది.
యోగిరాజయిన పతంజలి మహర్షి కూడా స్వానుభవంతో తతః క్షీయతే ప్రకాశావరణమ్- యోగ సిద్ధి ద్వారా బుద్ధి ప్రకాశంపైన పడిన ఆవరణ (తెర) తొలగిపోతుంది అని వేదం చెప్పిన ఈ సత్యానే్న బలపరచాడు. ఋగ్వేదం దీనికంటె విపులంగా ‘యదా గచ్ఛాత్య సునీతిమేతా మథాదేవానాం వశనీర్భవాతి’ = సాధకుడు ప్రాణచాలన విద్యను పొందినంతనే ఇంద్రియాలను కూడా తన వశంలోనికి తెచ్చుకోగలడు అని వివరించింది. ఇంద్రియాలు వశం కావాలంటే ప్రాణాలను వశం చేసుకోవాలనే మాట చాలా నిగూఢమైనది. ఇంద్రియాలు మనసునకు అధీనం. కాని మనస్సు చాలా బలమైనది. అన్నింటికన్నా వేగంగా వెళ్లగలది కూడా. మనస్సు ఎటువెళితే ఇంద్రియాలు కూడా అటే పోతాయి. ప్రాణచాలన విద్యతో ఇంద్రియాలను వశం చేసకోవడమంటే మనస్సును వశం చేసుకోవడమే.
‘‘యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ
బుద్ధిశ్చ న విచేష్టతి తామాహః పరమాం గతిమ్
తాం యోగమితి మన్యంతే స్థిరామిద్రియధారణామ్
మనస్సుతోబాటు జ్ఞానేంద్రియ పంచకం కూడ తన వ్యాపారాలను ఎప్పుడు విరమిస్తుందో అప్పుడే బుద్ధి నిశ్చలమవుతుంది. ఈ స్థితినే పరమాగతి అని అంటారు. అలా ఇంద్రియాలను నిర్వాయపారంగా చేయడమే యోగంగా చెప్పబడుతూ ఉంది. ఇంద్రియాలను వశపరచుకోవడమంటే వాటి శక్తిని తగిన విధంగా వినియోగపరచుకోవడమే. దానికి ప్రాణాయామాన్ని అభ్యసించి దానిలో సిద్ధిని పొందాలి.
..........................ఇంకావుంది