మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బావన సీతారాం, మందసా కమలాపురం
ఆంధ్ర రాష్ట్రం + తెలంగాణ జిల్లాలు = ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రం = ఆంధ్ర రాష్ట్రం కావాలి గదా! అలా ఎందుకు చెయ్యలేదంటారు?
చెయ్యమని ఎవరు అడిగారు కనుక?

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
నేడు బిజెపి అన్ని పార్టీల కంటె సంపన్న పార్టీ అని గొప్ప న్యూస్! కాంగ్రెసు స్థానం సంపాదించినది కనుక కాంగ్రెసు లక్షణానే్న కొని తెచ్చిపెట్టుకుంటున్నది బి.జె.పి.! 50 ఏళ్ల క్రితం జనసంఘ్ అతి బీద పార్టీ అయినా, వాజ్‌పేయి లాంటి వారి వలన ప్రజలలో మంచి పేరుండేది, పార్లమెంటులో అతి తక్కువ స్థానాలు ఉన్నా! ఆనాటి బీద పార్టీ నేడు సంపన్న పార్టీ అయింది, కాని పదవి చేపట్టి 2 సం.లు దగ్గర పడ్తున్నా, బీదవారు, సామాన్యుడు అలాగే ఉన్నారు. కాంగ్రెస్‌కు బి.జె.పి.కి తేడా ఏమిటి? టి.డి.పి. సంపన్న పార్టీల లిస్టులో ఎన్నో స్థానం?
కాంగ్రెసు లక్షణాలు కొన్ని బిజెపికీ ఒంటపడుతున్న సంగతి నిజమే. అంతమాత్రాన రెండింటి ప్రభుత్వాలనూ ఒకే గాటన కట్టివేయడం తప్పు. కాంగ్రెసు మార్కు అవినీతి, నీతిబాహ్యత, విచ్చలవిడి పాపకర్మాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా మెరుగు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
నైతిక విలువలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే బి.జె.పి. నిన్న అరుణాచల్‌ప్రదేశ్, నేడు ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కూలదోసి వివాదాలు సృష్టించి, సుప్రీంకోర్టు చేత కూడా అక్షింతలు వేయించుకుంది. గతంలో ఈ విధంగా చేసి ప్రజల తిరస్కారానికి గురైన కాంగ్రెస్ పంథాలోనే బి.జె.పి. పయనించడం ఎంతవరకు సబబు?
ఎంత మాత్రం కాదు.

ప్రజా వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారు కదా! గుర్రప్పందాలు ఆడినట్లు ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలు కూల్చడం రాజ్యాంగ విరుద్ధం కాదా?
ప్రజాస్వామ్య విరుద్ధం.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
కన్నయకుమార్ అనే ఒక సాధారణ విద్యార్థి తాను పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడినో, ఒక గుర్తింపబడిన రాజకీయ పక్షపు జాతీయ అధ్యక్షుడినో అనుకొని ఇష్టం వచ్చినట్లు ప్రధాన మంత్రిని, హిందూ దేవతలను, మత విశ్వాసాలను విమర్శిస్తున్నారు. ఈ విశృంఖల స్వేచ్ఛ అతనికి ఇచ్చిన బెయిల్ షరతులలో ఉన్నదా?
కోర్టును అడగాలి.

ఎం.కనకదుర్గ, తెనాలి
తెలుగు ప్రజల కోసం తెలుగు సినిమా పరిశ్రమ నిర్మించే తెలుగు చిత్రాలలో తెలుగు భాషకు తెగులు పట్టిస్తున్నారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలను రీమిక్స్ చేసి కొత్త భాష పుట్టిస్తున్నారు. ఇంగ్లీషులో టైటిల్స్, సినిమాలకు ఇంగ్లీషు పేర్లు, ఇలా తెలుగు భాషకు భ్రష్టు పట్టిస్తున్నారు. లబ్దప్రతిష్టులైన తెలుగు సాహిత్యకారులు విశేష కృషితో ప్రపంచ ఖ్యాతి పొందిన తెలుగు సినిమాలలో అచ్చతెలుగు కానరావడం లేదు...
ఏ రంగంలో ఎక్కడ కానవస్తున్నదో చెప్పండి.

పుష్యమీసాగర్, హైదరాబాద్
మన దేశం గర్వించతగ్గ కోహినూర్ వజ్రం బ్రిటీష్ వాళ్లు దొంగతనంగా ఎత్తుకుపోలేదు అంట... స్వయంగా అది ‘బహుమతి’ గిఫ్ట్‌గా ఇవ్వబడింది అని ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానానికి ప్రభుత్వం వారు సెలవిచ్చారు... బహుమతిగా ఇచ్చినది మరల ఎలా అడుగుతాము అని ప్రశ్నించినప్పుడు బాధేసింది... వీరికి చరిత్ర తెలియదు అంటారా?
బుర్ర కూడా లేదు.

srinudr62@yahoo.com
లేడీస్‌కి ఆలయ ప్రవేశం విషయంపైన మీ అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నాను. ఎంతో ప్రోగ్రెసివ్‌గా థింక్ చేసే మీరు ఈ విషయంలో కొంచెం ఫండమెంటలిస్ట్‌గా ఆలోచిస్తున్నారా?
రాయటం వరకే నా పని. దాని మీద ఎవరి అభిప్రాయం వారిది.

sivananda.gurukulam@gmail.com
భారత స్వాతంత్య్ర చరిత్ర పై ఇప్పటికి పది రకాల పుస్తకాలు చదివా. గాంధీ లేకపోతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు - అన్న భావన కలిగిస్తాయి అన్నీ. గాంధీకి ఓవర్‌గా ప్రాచుర్యం కల్పించింది ఎవరు?
గాంధి పేరు చెప్పుకుని, అడ్డం పెట్టుకుని ఇప్పటిదాకా దేశాన్ని దోచుకుంటున్నవారు.

*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com