మనలో - మనం

మనలో మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, శ్రీకాకుళం జిల్లా
ఒక నాయకుడు కాని నాయకురాలు కాని ఏ పదవీ రాలేదని మరొక పార్టీలోకి గెంతడం నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట! చేసిన అవినీతి పని చేసి ఊరుకోకుండా... వదిలివేసిన పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టటాన్ని ఏమనాలి?
కుసంస్కారం - భ్రష్ట రాజకీయం.

పి.రామకృష్ణ, రాజమండ్రి
మేము (కేంద్రం) ఇచ్చే గ్రాంటు, సాయం డబ్బులకు ఆంధ్ర రాష్ట్రం సరైన లెక్కలు సమర్పించటంలేదని బిజెపి వారు తరచూ పత్రికా ప్రకటనలు ఇస్తుంటారు. ఇదే నిజమైతే ఆ సొమ్మంతా ఏమవుతున్నట్టు?
లోగుట్టు పొత్తు పెరుమాళ్ల కెరుక. ఓపిక పడితే అన్నీ బయటపడతాయి.

తన్నీరు సీతారామాంజనేయులు, జగ్గయ్యపేట
ది.23.7.2016 శనివారం, ఆంధ్రభూమి దినపత్రిక, భూమికలో చిన్నారి మీరా వశిష్ఠ్ గురించి, చిరుప్రాయంలోనే సేవాతత్పరత, వ్యాసం మొదటి లైను ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అన్న మహాకవి గురజాడ అప్పారావుగారు అని రాశారు వ్యాసకర్త పి.హైమావతిగారు. ఆ పలుకులను వొలికించింది భావకవితా రూపశిల్పి కీ.శే.రాయప్రోలు సుబ్బారావుగారు. విషయం సరిచేసుకోగలరని ప్రార్థన.
ఔను. పొరపాటుకు చింతిస్తున్నాం.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
కాశ్మీర్ చొరబాట్లకు అంతం లేదా?
మనకు దమ్ము లేనంతవరకూ అది అంతులేని కథ.

తెలంగాణలో టి.డి.పి. పార్టీకి మనుగడ ఉందా?
నాయకత్వం మారితే - ఏమో!

రాజనాల లక్ష్మీనారాయణ, దమ్మాయిగూడ, రంగారెడ్డి జిల్లా
ఏ దేశంలోనైనా న్యాయమూర్తులలో ‘పార్టీ పక్షపాతం’ ‘అవినీతి’ ‘మతతత్వం’ ‘కులతత్వం’ వంటి జాఢ్యాలుంటే ఆ దేశం బాగుపడ్తుందా?
పడదు.

ఏ దేశంలోనైనా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులపై అవినీతి నిరోధక శాఖ గానీ, ఇ.డి. లాంటి సంస్థలు గానీ, వారి పదవీ కాలంలోని అవినీతిపై విచారణ జరిపి శిక్షించాయా?
నాకు తెలిసినంతలో లేదు.

కె.సుజాత నాగరాజారావు, కావలి
నిర్మాణంలో ఉన్న సిమెంటు స్తంభాలు కూలిపోయి మానవ నష్టం జరిగితే, లక్షలు ఇస్తామంటారు అధికార నేతలు. ఆ లక్షలు ప్రజలు పన్నుగా చెల్లించినవే కదా? మరి నిర్మాణాన్ని సరిగా పర్యవేక్షించని శాఖీయులపై టౌన్ ప్లానింగ్ వారిది బాధ్యత లేదా?
ఆ సంగతి నిలదీయాల్సింది పత్రికలు; ప్రతిపక్ష పార్టీలు; మేధావులు. దుస్సంఘటన జరిగిన రోజు ఆవేశపడటం, మూడో నాటికి ఆ సంగతి అందరూ మరచిపోవటం అలవాటైంది. అందుకే ఎవరికీ భయం లేకుండా పోయింది.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
రంజాన్ మరునాడు, క్రిస్మస్ మరునాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాత్రంతా జాగారం చేసే మహాశివరాత్రి మరునాడు సెలవు ప్రకటించలేదేమి?
హిందువులకు నోరు లేదు; దిక్కులేదు కనుక!

హైకోర్టు విభజన అంత అత్యవసరమా? చాలా రాష్ట్రాలకు ఒకటే హైకోర్టులున్నాయి. అక్కడేమీ ఆందోళనలు చేయటం లేదే.
ఇక్కడి చారిత్రక నేపథ్యం వేరు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
తన ఆలోచనా విధానానికి, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చెయ్యకపోతే సన్నిహితులు, సీనియర్లకు కూడా ఉద్వాసన తప్పదని ప్రధాని ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో స్పష్టంగా తెలియజేశారు. సామర్థ్యమే కొలమానంగా పదవులు ఇస్తే ప్రజా సంక్షేమం కోసం మరింత బాగా ఆమాత్యులు కృషి చేయగలరని, దేశవ్యాప్తంగా ఇదే విధానం అవలంబిస్తే మంచిదని నా అభిప్రాయం. మీరేమంటారు?
కేంద్రంలో అలా జరిగిందా?

బి.ఆర్.సి.మూర్తి, సూర్యారావుపేట
ఆర్టీసీ బస్సుల్లో ‘దయ్యం’ సిన్మాలెందుకు?
జనాలు నిద్రపోకుండా చెయ్యడానికి.

కె.దుర్గ్భావాని, హైదరాబాద్
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మహాసభ వారు తీర్మానించుట సబబంటారా? భారతరత్న ఇచ్చేటంత ఘన కార్యాలు ఆయన చేశారంటారా?
ఎంజీఆర్‌కి ఇవ్వగా లేనిది ఎన్టీఆర్‌కు ఎందుకు కూడదు? పక్కా కమర్షియల్ క్రికెట్ ఆటగాడి పాటి చెయ్యదా రామారావు ప్రజాసేవ?

అ.్భరతి, సూర్యాపేట
మన ముఖ్యమంత్రి పేదింటి హిందూ ఆడపిల్లల వివాహ ఖర్చులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే పథకానికి ‘కళ్యాణ లక్ష్మి’ అనీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మతస్థుల ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందించే పథకానికి ‘షాదీ ముబారక్’ అని పేరు పెట్టారు. ఒకే పథకానికి రెండు పేర్లు పెట్టి హిందూ మతస్థులను, హిందూయేతర మతస్థులను విభజించటంలో ఏమి రాజనీతి?
జనరంజక రాజనీతి. దాన్ని మరీ అంత తప్పు పట్టక్కర్లేదు.

డి.ఎస్.శంకర్, వక్కలంక
స్ర్తి పురుషులిద్దరికీ వివాహం అయ్యేదాకా కామవాంఛలు కలుగకుండా ఉండేటట్లుగానూ, వివాహం అయ్యాక పరస్ర్తి, పురుషుల పట్ల కామవాంఛ కలుగకుండా ఉండేటట్లుగానూ భగవంతుడు సంకల్పిస్తే?
గృహ హింస ఎక్కువవుతుంది. పెళ్లికాని వాళ్లు గోలెడతారు. కొత్త సమస్యలు వస్తాయి. దేవుడు మనకన్నా తెలివైనవాడు. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com