మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఇంకుడు గుంతల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవి మన ఒకనాటి బావులే కదండి. బావులు తవ్వితే అవసరానికి తోడుకోవచ్చు. కరెంట్ మోటార్ల పనీ ఉండదు. ఆదాకి ఆదా. అవునంటారాండి?
వందల అడుగుల లోతుకు బోరింగులు వచ్చాక బావులు బావురుమన్నాయి. ఇంటికో బావి ఇవాళ అయ్యే పని కాదు.

... ....
24 గంటలూ సినిమా హాళ్లూ, మాల్సూ తెరచి ఉంచవచ్చని తాజా కబురు. ఈ సమయాలను (రాత్రిపూట) ఉపయోగించుకునేవారు మన దేశంలో ఉంటారా?
బోలెడు మంది.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
మన దేశంలో 10 లక్షల మందికి 18 మందే జడ్జీలున్నారని పత్రికలో చదివా. నిష్పత్తి లిటిగెంట్స్‌తో కట్టాలిగాని జనాభాతో ఏం పని? అందరూ కోర్టుకెక్కరు కదా?
పాయింటే.

చందన రవీంద్ర, రాజాం, శ్రీకాకుళం జిల్లా
కొన్ని దినపత్రికల్లో నియోజకవర్గ పేజీలు ఇస్తున్నందున పక్క గ్రామాల్లో జరుగుతున్న విశేషాలు కూడా తెలియడంలేదు. ఈ దుస్థితి మారుతుందా?
ఇప్పట్లో మారదు.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
విశాఖ గణేశుడికి పనె్నండున్నర టన్నుల లడ్డా! ఏమిటండీ విపరీతం?!
పిచ్చ్భిక్తి.

ఆంగ్లేయులు మన దేశానికి రాకుండా ఉంటే ప్రస్తుత దేశ స్థితి ఎలా ఉండేదండీ?
దివ్యంగా.

వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
పార్టీ ఫిరాయించే ఎం.పిలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పగిస్తే ఎలా ఉంటుంది?
ఎన్నికలు అయిపోయాక ప్రజా ప్రతినిధుల కప్పగంతులు ఎన్నికల కమిషన్ పరిధిలోకి రావు.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
ఒకప్పుడు మహిళా రిజర్వేషను (చట్టసభల్లో)పై వల్లమాలిన ప్రేమ వొలకబోసిన రాజకీయ నేతలు నేడు వౌనవ్రతము బూనుట భావ్యమా? బి.జె.పి. వారు ప్రతిపక్షంలో నుండగా, మహిళా రిజర్వేషనుపై పలుమార్లు పట్టుబట్టి, నేడేమో అధికారంలో నుండ, వౌనంగా నుండుటకు కారణమేమి?
ఎప్పుడూ ఉన్నదే. పురుషాహంకారం.

బావన సీతారాం, మందసా కమలాపురం
ఎన్నో దేశాల రాజ్యాంగాలు పరిశీలించి ఎన్నోమార్లు చట్ట సవరణలు గావించి పటిష్టంగా నిర్మించుకున్న మన రాజ్యాంగం పార్టీలు మారుచున్న మన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించుకోలేనంత బలహీనంగా నున్నదెందుకని?
రాజకీయ శ్రేణికి నీతి, బాధ్యత లేకపోతే రాజ్యాంగం ఏమి చేస్తుంది?

ఆర్.కె., హైదరాబాద్
ప్రభుత్వం మొక్కలను పెంచమని జనాలని కోరుతున్నారు. అంత శ్రమ, డబ్బు ఖర్చు ఎందుకు పెట్టడం? హాయిగా పక్కవారి మొక్కలను చూచి ఆనందిస్తే మేలు కదా!
మిమ్మల్ని పెంచమనేది మీ పక్కవారి ఆనందం కోసం.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ప్రధాని మోదీగారు 24 నెలల నుంచి ప్రతి నెల ఆఖరి ఆదివారం తప్పనిసరిగా ఆకాశవాణి ప్రసంగం చేస్తున్నారు. ఈ రోజుల్లో రేడియో ఎంతమంది వింటున్నారు? ఇప్పుడు ఇంటింటా టీవీలే కదా?
ఇప్పటికీ వార్తల కోసం రేడియో మీదే ఆధారపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పల్లెల్లో.

ఘౄశజరీఖ్ఘూౄ.రీఖశ్ఘ్ఘబఘౄజ.ష్యౄ
మీ భగత్‌సింగ్ వాస్తవాలకి దగ్గరగా ఉంది. నేనీ విషయాలు కొన్ని పుస్తకాలలో చదివాను. గాంధీని గొప్పవానిగా చేయటం తెల్లవాళ్ల రాజకీయమా? మన వాళ్ల కుటిలత్వమా?
దానికి మనవాళ్లని నిందించి ప్రయోజనం లేదు. గాంధిని దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి భారతదేశంలో మహాత్ముడిగా ప్రతిష్ఠించటం వెనక పెద్ద వ్యూహం ఉంది. నూరేళ్ల తరవాత కూడా మన మేధావులు పోల్చుకోలేని, కనీసం అలాంటిది జరిగిందని ఊహించనైనా లేని గొప్ప పొలిటికల్ ఆపరేషన్ పని చేసింది. దానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బ్రిటిషు వాళ్లేనని చెప్పక్కర్లేదు.

సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
కాశ్మీర్‌లో ప్రస్తుత కల్లోలం పాకిస్తాన్ కుట్ర ఫలితమేనని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. మా దేశపు అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్‌ను కలసికట్టుగా హెచ్చరించేందుకు నోరురాని విపక్షాలు, ఉద్రిక్తతను చల్చార్చేందుకు లోయలో తిష్ట వేసుకొని కూర్చున్న వేర్పాటువాద శక్తులతో చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం విడ్డూరంగా ఉంది.
నెహ్రూగారి బడిలో ఒంటపట్టిన పాఠాలనే అవి వల్లిస్తుంటాయి. మేధావులనబడే వారిదీ అదే తంతు.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com