మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
మొదటి తరైన్ యుద్ధం క్రీ.శ.1191 ప్రాంతంలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే భారతీయ రాజు మన దేశం మీద దండయాత్ర, దోపిడీ, హత్యలు వగైరా చేసిన విదేశీ జిహాదీ మహమ్మద్ ఘోరీని జయించి కూడా చంపకుండా మూర్ఖంగా వదిలిపెట్టాడు. మళ్లీ మళ్లీ వాడు దండెత్తడం, జనాన్ని చంపడం మనవాడు జయించి వదిలిపెట్టడం! దానివల్ల అప్పటి సైనికులకి ఇప్పటి హిందువులకి జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత పృథ్వీరాజుదే కదా! చైనా విషయంలో, కాశ్మీర్ విషయంలో బలిదానం అయిన సైనికులకి నెహ్రూ బాధ్యుడు కదా!
ఔను. యధార్థ చరిత్రను సరిగా అర్థం చేసుకుని, పూర్వుల తప్పిదాల నుంచి పాఠాలు నేర్వకపోతే మనమూ వారి దారిలోనే వెళతాం. వెళుతున్నాం.

వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు, రాజమహేంద్రవరము
ప్రస్తుత సమాజం అనుసరిస్తున్న భక్తి మార్గము ధర్మాచరణకు దోహదపడుచున్నదా?
అది స్వార్థపూరిత భక్తి. ఎంతసేపూ తన గురించే తప్ప దేశం గురించి, సమాజం గురించి పట్టించుకోనిది. కొద్దిమంది భుక్తికి బాగా ఉపయోగపడుతుంది.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి ఖాతాదార్లకు శఠగోపం పెట్టిన మోసపూరిత ఫైనాన్స్ కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన న్యాయస్థానం పుష్కర కాలం గడిచినా తీర్పు వెలువరించకపోతే జనానికి న్యాయ వ్యవస్థ పట్ల ఆశ సన్నగిల్లదా?
ఇటువంటి పెండింగు కేసులు లక్షల్లో ఉన్నాయి. అందుకే న్యాయప్రవీణులకు ఆందోళన.

పూర్వకాలం మునీశ్వరులు ఒంటికాలితో తపస్సు చేసేవారని, కందమూలాలు భుజించేవారని చదివాం. హిమాలయ పర్వతాల్లో ఇప్పటికీ వెనకటి మాదిరి ఋషీశ్వరులున్నారా?
ఉన్నారు. వారికి ప్రచారం అక్కర్లేదు. కాబట్టి కష్టపడి వెతికితే తప్ప మనకు కనపడరు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికెవరూ పారితోషికాలు ప్రకటించలేదేమిటండి?
వారికి స్టార్ వాల్యూ లేదనేమో.

పాకిస్తాన్‌పై ఎవరైనా బయటివారు దాడి చేస్తే చైనా అండగా ఉంటానంటోంది. చైనా వారికి వాస్తవాలు తెలియవా?
వాస్తవాలు ఎవరికి కావాలి? రాజ్యాలు చూసేది స్వప్రయోజనాలని.

babukoilada@india.com
తెలుగు రచనా లోకంలో అపారమైన సాహితీ సంపద ఉంది. ఎందరో మేటి రచయితలు ఉన్నారు. అయినప్పటికీ కొన్ని పుస్తకాలు పునర్ముద్రణకు నోచుకోవడం లేదు. కొత్త రచయితల రచనలు కూడా కొన్ని అమ్మకాలు లేకపోవడం వల్ల మరుగున పడిపోతున్నాయి. ఏవో కొన్ని గ్రంథాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మన సాహిత్యాన్ని కాపాడడానికి అడుగు ముందుకు ఎలా వేయాలి?
చేయాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోవలె రచయితలు, చిన్న పబ్లిషర్లు వేసుకునే పుస్తకాల అమ్మకాలకు మినిమం గ్యారంటీ ఉండేలా ఏర్పాట్లు జరగాలి. వివిధ పథకాల కింద ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే పుస్తకాల ఎంపికలో అవినీతి, అక్రమాలను అరికట్టగలిగితే, పారదర్శకత నెలకొల్పగలిగితే యోగ్యులైన రచయితలు, ప్రచురణకర్తలు బతుకుతారు.

manikumar.kunala@gmail.com
ఫ్రత్యేక హోదా పేరుతో జనాలని ఎన్నాళ్లు మోసం చేస్తారు?
ఇంకెక్కడి హోదా?
బోస్‌గారి చరిత్రని కూడా తెలియజేస్తా అన్నారు. దాని కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడో సెలవు ఇవ్వండి?
విషయ సేకరణ ఇప్పుడే మొదలైంది. కొన్ని నెలలు పడుతుంది.

రావు నాగరాజ, హైదరాబాద్
పోలీసు శాఖలో సైకాలజిస్టుల, సైకియాట్రిస్టుల నియామకం అవసరమేమో అనిపిస్తుంది నా బోటి సామాన్యునికి. శాంతిభద్రతలు రక్షించాల్సిన శాఖీయులలో కొందరు ఆత్మహత్యలు చేసికొన్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి.
ఔను. కౌన్సిలింగు అవసరమే. కింది సిబ్బందిని పీడించి ఆత్మహత్యలకు పురికొల్పే శాల్తీలకు.

అడ్డగట్ల శివప్రసాద్, సంగారెడ్డి
ఇటీవల భారత్ జరిపిన లక్షిత దాడులు ఒక నాటకమని పాక్ ప్రభుత్వం, ఆ దేశపు మీడియా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం మాట అటుంచి కనీసం అక్కడి మీడియా అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించి అసలు నిజమేంటో ఎందుకు చెప్పడంలేదు? ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ఇవ్వొద్దని అక్కడి మీడియాపైన ఏమైనా ఆంక్షలున్నాయా? లేక వీళ్లు కూడా పరోక్షంగా ఉగ్రవాదాన్ని వెనకేసుకొస్తున్నారా?
ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఇచ్చే సమాచారమే పత్రికలకు ఆధారం. దేశ రక్షణ, ఇతర దేశాలతో సంబంధాల దగ్గరికి వచ్చేసరికి సాధారణంగా ఏ దేశంలోని పత్రికలైనా తమ ప్రభుత్వాలనే సమర్థిస్తాయి. పాకిస్తాన్ పుట్టుకకు, మనుగడకు భారత్ పట్ల, భారతీయుల పట్ల శత్రువైఖరి పునాది. అక్కడి పత్రికలు కూడా ఆ గూటి పలుకులే పలుకుతుంటాయి.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
మన దేశంలోని చచ్చు పుచ్చు ‘మేధావు’లు, సెక్యులర్ మీడియా మహాపండితులు ఉగ్రవాదానికి ‘మతం లేదు’ అనే డైలాగ్ ఎప్పుడూ చెబుతుంటారు. జిహాదీ అంటేనే ఇస్లామిక్ కదా! అది మతం కాదా? సెక్యులరా? మరి, మన సైన్యం చేతిలో చచ్చిన ఉగ్రవాద జిహాదీగాళ్లకి పెంటకుప్ప తగలేసినట్లు తగలేయకుండా, వౌల్వీల ద్వారా ‘శాస్త్రోక్తం’గా అంత్యక్రియలు చేయించడం ఎందుకు?
వారికే తెలియాలి.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com