మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతారామరావు కొడాలి, విజయనగరం
పని లేనివాళ్లే ఇలాంటి శీర్షికలకి ప్రశ్నలు పంపిస్తారనుకుంటాను. ఏమంటారు?
మీకు తెలియాలి.

దేవరశెట్టి సాంబశివరావు, దాచేపల్లి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మహిళలు ఆర్థికంగా ఎదగాలి అని ప్రతి మహిళా సమావేశంలో పిలుపునిస్తారు. మహిళ కుటుంబంలో సభ్యురాలు కాదా? అలా అనటం ఎంతవరకు సమంజసం? విభజించు పాలించు అనే సూత్రాన్ని మహిళలపై ప్రయోగిస్తున్నారా?
దానికి అభ్యంతరం అక్కర్లేదు. వారి ఇంటి స్థాయకి ప్రతి ఇల్లూ ఎదగాలని ఆయనగారి ఉద్దేశం అయి ఉండొచ్చు.

పట్నాల రాంప్రసాద్, హరిపురం, శ్రీకాకుళం
ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు మీరు ఏ విధంగా గర్వపడుతున్నారో తెలియపరచండి. అలాగే ఏ విధంగా బాధ పడుతున్నారో తెలియపరచండి.
రెండూ లేవు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
గత మూడు దశాబ్దాలుగా పత్రికా సంపాదకులుగా, రచయితగా మీ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు సంపాదకులు లేక రచయితగా ఏ వృత్తి మీకు ఎక్కువ సంతృప్తి నిచ్చింది?
రచయితగా

ఈ ప్రస్థానంలో పత్రికా యాజమాన్యాల నుండి మీ ఆలోచనా ధోరణి, సిద్ధాంతాలకు విరుద్ధంగా వార్తలను వేయాల్సిందిగా వత్తిడులు వచ్చిన సందర్భాలు ఉన్నాయా?
లేవు.

జి.మురళీకృష్ణ, రేపల్లె
ప్రస్తుత పరిస్థితులు చూస్తూంటే సింగపూర్ వారిని, జపాన్ వారిని ‘రండి. మా మీద పెత్తనం చెయ్యండి’ అని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపిస్తూంది. విదేశీయుల పెత్తనం మళ్లీ రానున్నదా?
దేశంలో ఎప్పుడో వచ్చింది.

ఎం.కనకదుర్గ, తెనాలి
కొత్త సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయాలను వెన్నెల నుండి చిత్రకు మారిస్తే ఎక్కువ అభిప్రాయాలను ప్రచురించడానికి అవకాశం ఉంటుంది కదా! దయచేసి ఆలోచించగలరు.
అలాగే.

ఎ.ఎన్.ఆర్. కాశీబుగ్గ
మా ఇంటిపైనున్న వెంటిలేటర్స్‌లో పావురాలు నివసిస్తూ ఉన్నాయి. అవి కాపురం ఉండిపోతే తప్పా? కొందరు తప్పని అంటున్నారు. దీనికి పరిష్కార మార్గం తెలుపగలరు.
దోషం లేదు.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
మన దక్షిణాది దేవాలయాల్లో అర్చకుల వస్తధ్రారణ ఎలా ఉండాలని శాస్త్రం, సంప్రదాయం చెప్తున్నవి? వీరిలో కొందరు లుంగీల వస్తధ్రారణకు తోడు పైకి మడుచుకొని గర్భాలయం ముందు అర్చన మరియు పూజా, తీర్థ ప్రసాదాలు, చెటారీ ఇచ్చేటప్పుడు సెల్‌ఫోన్ సంభాషణ చేయవచ్చా?
తప్పు. వీటి మీద గట్టి కట్టడి ఉండాలి.

ప్రస్తుతం పత్రికలన్నీ ఏదో ఒక టీవీ చానల్‌ను మెయిన్‌టెయిన్ చేస్తున్నాయి. మరి మీరు కూడా మీ భావాలకు అనుగుణంగా నిజాయితీగా, చైతన్య స్ఫూర్తి ఇచ్చే విధంగా అభిమాన పాఠకుల కోసం ఓ చానల్‌ను ప్రారంభిస్తే బాగుంటుంది కదండి.
ముందు చూసేవాళ్లను చూసి పెట్టండి.

దుర్భా శంకర నారాయణ, విజయవాడ
అరవై అయిదేళ్లుగా కాంగ్రెస్ పాలించి దేశ ప్రజలను కులం మతం ప్రాంతం వర్గం భాష పేరుతో రకరకాలుగా విభజించి కనీస అభివృద్ధి కానరాకుండా చేసింది. మరి అయిదేళ్లలో మోదీకి అభివృద్ధి సాధ్యమేనంటారా?
ఇలా పోల్చుకుంటూ కూచుంటే ఎప్పటికీ ఇంతే.

సి.పి, శ్రీకాకుళం
ఛోటారాజన్ వంటి ఎందరో నేరస్థులు, ఉగ్రవాదులు దేశ విదేశాలలో తప్పుడు పత్రాలు, దొంగ పాస్‌పోర్టులు, వీసాలతో యధేచ్ఛగా సంచరిస్తున్నారని ఇటీవల మీడియాలో కథనాలు వస్తున్నాయి. దుబాయ్ వంటి దేశాలకు ఎందరో నకిలీ పాస్‌పోర్టులతో వెళ్తున్నారు. ఇంతటి భద్రతా మరియు నిఘా వ్యవస్థ వైఫల్యాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
పాకిస్తాన్‌తో పరాచికాలు

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
శ్రీరాముడు చెడ్డ భర్త అని, నరకాసురుడు గొప్ప చక్రవర్తని కొందరు మేధావులు అనడం విడ్డూరంగా లేదూ?
ఇది మొదలు చెడ్డకాలం.

జొన్నలగడ్డ విజయకృష్ణ, హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రిగారు ఈ మధ్యనే మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో చండీయాగం చేసితిరి. దేశ క్షేమం కొరకు అని వారి ఉవాచ. ఒకపక్క గోమాతలు ఎన్నో ఈ రాష్ట్రంలో నిరంతరం వధింపబడుతూ ఉంటే జగన్మాత అనుగ్రహం ఎట్లు కలుగును?
దేనికదే.

కామవరపు గణపతిశాస్ర్తీ, ధనుంజయ్‌రావు జె. సికిందరాబాద్
కొనే్నళ్లుగా వీరాజీగారి వ్యాఖ్యలకు రోజూ అలవాటు పడ్డాము. ఈ మధ్య ఆగిపోయాయి. ఆయన రాసే వార్తల కామెంట్లు.. ఆరోగ్యం ఆనందం వినోదం కలిగించేవి - మళ్లీ మొదలుపెట్టగల అవకాశాలు ఉన్నాయా?
ఉన్నాయి. వారానికోసారి.

అలాగే సాక్షి యొక్క వీక్ పాయింటు మానేసి - ఉన్నమాట వేస్తున్నారు. అది ఉన్నా ఇది వెయ్యొచ్చు కదా?
రెండిటినీ నడపటం కష్టం. కొంతకాలం ఇలా కానిచ్చాక ఆలోచిద్దాం.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com