మంచి మాట

తృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యాశకు పోకుండా తనకు కావలసింది లభించలేదే అని బాధపడకుండా ప్రాప్తమయిన కొంచమునే పదివేలనుకుంటూ తృప్తిపడాలి మానవుడు. అలా తృప్తిపడని వాడు ఎక్కడ ఉన్నా చక్కబడపోడని బమ్మెరపోతన భాగవతంలో వివరించాడు. అలాగే జీవితంలో భగవంతుడిచ్చిన దానితో పరితృప్తుడై భగవద్భక్తి కలిగి మానవుడు జన్మను ధన్యం చేసుకోవాలి.
మానవుడు తన ఆశలకు కళ్ళెం వేసి కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ఉన్న మార్గాల్లో ఆధ్యాత్మిక చింతన ఒక్కటే సరైంది. ఎందుకంటే భగవచ్చింతనలో నిరంతరం మునిగివుంటే భక్తునికి ప్రాపంచిక సుఖాలపై వాంఛ సన్నగిల్లుతుంది. మానవుని పతనం వైపుకు ఆకర్షించే విషయాలు ఆధ్యాత్మిక చింతనగలవానిని ఏ మాత్రం లొంగదీసుకోలేవు. తన జీవిత పరమావధి భగవరాధానగా గల్గిన భక్తుడు ఇహలోక వాంఛల్ని ఏనాడూ తన మనుసులోనికి రానీయడు. వాటిపై ఆసక్తి కనబరచడు. తనకు తన ఆరాధ్య దైవం తప్ప అన్య విషయాలు ఏవీ అవసరం ఉండదు. తనకు ఉన్నదానితోనే తృప్తిపడి భగవంతుని కరుణా కటాక్ష వీక్షణాలకై సదా పరితపిస్తూ కాలం గడుపుతాడు. అదే తనకు అసలైన తృప్తిని ఇస్తుంది. అన్యత్రా తన మనస్సును పరిభ్రమించకుండా కట్టడి చేస్తాడు.
పరమపద ప్రాప్తి కలిగినపుడే భక్తుడు నిజమైన తృప్తిని పొందగలడు. పరమపద ప్రాప్తి పొందదలచిన మానవుడు దురభిమానాన్ని విసర్జించాలి. మోహాన్ని విడనాడాలి. ఇహలోక సుఖాలయందు ఆసక్తిలేనివాడై ఉండాలి. దోషరహితుడై మెలగాలి. ప్రాపంచిక వాంఛలనుండి పూర్తిగా వైదొలగినవాడై ఉండాలి. పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితుడై ఉండాలి. సుఖ దుఃఖాలు ద్వంద్వాల నుండి విముక్తుడై జ్ఞానిగా మారాలి. స్వయం ప్రకాశ రూపుడగు పరంధాముని చేర్చగల ఆధ్యాత్మ చింతనలో నిరంతరం నిమగ్నం కావాలి. అంతఃకరణ శుద్ధిని పొంది యోగిగా మారి తన హృదయమందున్న ఆత్మతత్త్వాన్ని ప్రయత్న శీలుడై గ్రహించగలగాలి. అంతఃకరణ శుద్ధిలేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినా ఆత్మతత్త్వాన్ని తెలిసికోజాలరు. సమస్త జగత్తును ప్రకాశింపచేయగల శక్తియే భగవంతుడని తెలుసుకోవాలి. అట్టి పరంధామమును చేరగల మానవుడు ముక్తుడై పునర్జన్మ రహితుడై జన్మ ధన్యతను గాంచగలగాలి. అంతఃకరణమునందు రాగద్వేషాలను చేరనీయరాదు. సుఖదుఃఖాలు, మమతాహంకారాలు, మోహమాత్సర్యాలు మొదలైన వికారాలకు దూరంగా ఉండాలి. పరమాత్మ స్వరూప అనే్వషణయందే నిరంతరం ప్రయత్నపరుడై ఉండాలి.
నిష్కామ భావంతో తనకు ఉన్న అన్న, వస్త్ర, విద్య, ఔషధాలు మొదలైన వస్తువుల్ని కర్తవ్యబుద్ధితో ఇతరులకు వితరణ చేసే దాన గుణం కలిగి ఉండాలి. దానం చేయుటలోనే తృప్తి పొందగలగాలి. బాహ్య విషయాలనుండి ఇంద్రియాలను మరల్చగలగాలి. అభ్యాసం ద్వారా ఇంద్రియ నిగ్రహం సాధించగలగాలి.
వివేక వైరాగ్యాలు కల్గించగలిగేవి, భగవంతుని గుణగణాల్ని వివరిస్తూ అతని ప్రభావ తత్త్వ విశేష స్వరూప స్వభావాల్ని వర్ణించగలిగేవి, అతని దివ్య లీలల్ని తెలిపే గ్రంథాలయిన వేద వేదాంత ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయడంలో తృప్తి పొందగలగాలి. ఇతిహాస పురాణాదుల పఠన, పాఠన వల్ల, భగవంతుని నామ గుణ కీర్తనలతో తృప్తి లభిస్తుందని తెలుసుకోవాలి. స్వధర్మ పరిపాలనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహిస్తూ శారీరక, వాచక, మానసిక తపస్సుల ద్వారా భగవత్ప్రాత్తి పొందుటయే నిజమైన, అసలైన తృప్తిగా భావించాలి. అటువంటి తృప్తినే మానవుడు కోరుకోవాలి.

====================
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.