మీకు తెలుసా ?

ఇష్టం లేకపోతే అడుగు కదపవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటె జాతికి చెందిన ఈ ‘యామా’లు చూడటానికి చాలా ముచ్చటగా ఉండాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఇవి బలిష్టమైన జంతువులు. మన దేశాల్లో గాడిదల్లా బరువు మోయడంలో ఇవి పేరుపొందాయి. కానీ అవి మోయలేనంత బరువు వేసినా, వాటికి నచ్చకపోయినా ఒక్క అడుగుకూడా ముందుకు వేయవు. కొంచెం అయినా వాటిమీద వేసిన వస్తువులు తొలగిస్తేనే అది అడుగుకదుపుతుందట. ఇవి ఒంటెల జాతికి చెందినవే అయినా మూపురాలు ఉండవు. వీటి ఉన్నితో బట్టలు, తాళ్లు, రగ్గులు నేస్తారు. ఒంటెల్లాగానే ఇవి కూడా భయపడ్డప్పుడు ఎదుటివారిపై ఉమ్ముతాయి. వీటికి అత్యంత సునిశితమైన చూపు, వినగలిగే, వాసన పసిగట్టే శక్తి ఉన్నాయి. అందువల్లే శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టి హెచ్చరిస్తాయి. అందుకే వీటిని గొర్రెలు, మేకల మందలకు కాపలాగా పెడతారు. ఇవి కనీసం ఆరు అడుగుల పొడవువ ఎదిగే బలమైన జంతువులు. ఇవి తెలుపు, బూడిద, జేగురు ఇలా ఆరేడు రంగుల్లో ఉంటాయి. అన్నట్లు వీటి పేడను ఎండలో ఎండాక ఇంధనంగా వాడతారు.

ఎస్.కె.కె.రవళి