మీకు మీరే డాక్టర్

ముద్ద కర్పూరంతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత వారం తరువాయి)
16.తలలో పేలు, ఈపి పోవటానికి: కర్పూరం కలిసిన కొబ్బరినూనె రాసుకుంటూ ఉంటే తలలో పేలు, ఈపి తట్టుకోలేక జుట్టు వదిలి బయటకు వచ్చేస్తాయి. కర్పూర పరిమళం ఉన్న తలలోకి పేలు తిరిగి చేరకుండా ఉంటాయి.
17.విష దోషాలను పోగొట్టేందుకు: పచ్చకర్పూరం కలిసిన నీళ్లు లేదా పాలు రోజూ తీసుకుంటూ ఉంటే శరీరంలో విష దోషాలు పోతాయి. విష దోషాల వలన కలిగే అనేక వ్యాధుల్లో ఉపవమనం కలుగుతుంది. ముఖం నల్లగా కావటం, జిడ్డు కారటం, ఇంకా అనేక ఎలర్జీ లక్షణాలకు ఆహార పానీయాల ద్వారా మనం తీసుకునే ఈ విష దోషాలే కారణం అవుతాయి. కర్పూరం కలిసిన నీళ్లు లేదా పాలు విష దోషాలను హరిస్తాయి.
18.కఫ దోషాలకు: కర్పూరం తులసాకులు వేసి కొద్దిసేపు ఉంచిన నీటిని పావుగ్లాసు మోతాదులో అంటే కొద్ది మోతాదులో రోజూ రెండు మూడుసార్లు తాగుతూ ఉంటే కఫం తగ్గిపోతుంది. జలుబు భారం వదుల్తుంది. గుండె పడిశం తగ్గుతుంది.
19.ముక్కు దిబ్బడ: జలుబు ముంచుకొచ్చినప్పుడు ముక్కు దిబ్బడ వేసి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు పలుచని తెల్ల జేబురూమాలులో రెండు చెంచాల బియ్యం వేసి, ముద్ద కర్పూరం కొద్దిగా కలపండి. ఈ బియ్యాన్ని చిన్న మూటగా కట్టి వాసన చూస్తుంటే కర్పూరం వెంటనే కఫాన్ని తొలగించి గాలి ధారాళంగా అందేలా చేస్తుంది.
20.రక్త ప్రసారాన్ని పెంచటానికి: కర్పూరానికున్న ఉత్తేజకరం అనే గుణం వలన ఇది రక్తనాళాలను, నాడీ వ్యవస్థను అంటే షజూషఖ్ఘఆ్యక ఘశజూ శళ్ప్యూఖఒ ఒకఒఆళౄఒ మీద అద్భుత ఔషధ గుణాలను చూపిస్తుంది. ముద్ద కర్పూరం కలిసిన నూనె గాని, నెయ్యి గానీ, లేదా నీటితో తడిపి గానీ కాళ్లకు ముఖ్యంగా అరికాళ్లకు రాసుకుంటూంటే కాళ్ల తిమ్మిర్లు, కండరాలు పట్టేయటం, మడమశూల లాంటివి త్వరగా తగ్గుతాయి. రక్తప్రసారం సరిగాలేక వచ్చే ఇంటర్ మిట్టెంట్ క్లాడికేషన్ (పిక్కలు పట్టేయటం) లాంటి వ్యాధుల్లో మోకాలు నుండి కింది భాగం మీద కర్పూరం కలిసిన నూనెను లేదా కర్పూరాన్ని పేస్టులాగా చేసి దాన్ని గానీ పట్టిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
21.గ్యాస్ తగ్గటానికి: తులసాకులు, కర్పూరం కొద్దికొద్దిగా కలిపిన నీళ్లను పావుగ్లాసు మోతాదులో తాగితే గ్యాస్ త్వరగా తగ్గుతుంది.
22.మానసిక సంతోషానికి: మనసులో ఏదో తెలీని విచారం, భయం, ఆందోళనలు ఉన్నప్పుడు పరిమళ భరితంగా పచ్చకర్పూరం లేదా ముద్దకర్పూరం కొద్దిగా కలిపిన నీళ్లను పావుగ్లాసు మోతాదులో తాగితే మనసు సంతోషభరితం అవుతుంది. సంతృప్తి కలుగుతుంది. ఏకాగ్రత కలుగుతుంది. వైష్ణవాలయాలలో కర్పూరం నీళ్లు తీర్థంగా ఇవ్వటానికి ఇదే కారణం. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి కలిసిన తాంబూలం వేసుకుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. లైంగిక శక్తి పెరుగుతుంది.
23.సెక్సు సమర్థత పెరగటానికి: ముద్ద కర్పూరానికి, పచ్చకర్పూరానికి రెండింటికీ స్తంభన శక్తి ఉంది. త్వరగా జననాంగం స్తంభించటానికీ, సెక్స్ కార్యంలో శీఘ్రస్కలనం జరక్కుండా మరికొంతసేపు రతిని కొనసాగించటానికి ముఖ్యంగా పురుషులకు ఇది బాగా తోడ్పడుతుంది. 5 గ్రాములు జాజికాయ, 5 గ్రాములు జాపత్రి, 2-3 గ్రాముల పచ్చకర్పూరం ఈ మూడింటినీ తీసుకుని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఒక గ్లాసు వేడి పాలలో పావుచెంచాకన్నా తక్కువగా ఈ పొడిని కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు తాగితే కమ్మని నిద్రపడ్తుంది. దీర్ఘకాలంపాటు ఇలా రోజూ తాగవచ్చు కూడా! పావుచెంచా మోతాదు మించి ఈ పొడిని తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే జలుబు చేస్తుంది.
24.నిద్ర పట్టటానికి: ఇదే ఫార్ములా రాత్రిపూట నిద్రపట్టటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడిని గ్లాసు పాలలో పావుచెంచా కన్నా తక్కువగా కలిపి రోజూ పడుకోబోయే ముందు తాగుతుంటే క్రమేణా కమ్మగా నిద్రపట్టడం మొదలౌతుంది. ఇది అనేక మంది నిద్రపట్టని రోగుల మీద విజయవంతంగా ప్రయోగించిన అనుభవంతో చెప్తున్న విషయం.
25.కలరా, నీళ్ల విరేచనాలు: కలరా లాంటి భయంకర విరేచనాల వ్యాధులు వచ్చినప్పుడు చిటికెడంత ముద్దకర్పూరం కలిసిన నీళ్లు పావుగ్లాసు మోతాదులో రోజూ రెండు లేక మూడుసార్లు తాగుతూ ఉంటే విరేచనాలలో నీటి శాతం తగ్గుతుంది. మందులు బాగా పని చేస్తాయి.
26.కీళ్లవాతానికి: కర్పూర తైలం ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. వాచిపోయిన జాయింట్ల మీద ఈ తైలాన్ని మృదువుగా మర్దన చేసుకుని కాపు పెట్టుకోవడం గానీ, ఇన్ఫ్రారెడ్ ల్యాంపు పెట్టుకోవటం గానీ రోజూ చేస్తూ వుంటే కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, సయాటికా, స్పాండైలోసిస్ లాంటి వ్యాధులు త్వరగా ఉపశమిస్తాయి.
27.ఉబ్బసం: మంచి ఇంగువ దొరికితే తీసుకుని దానిలో సగం ముద్దకర్పూరం కలిపి తేనెతో చిక్కగా కలిపి కంది గింజంత మాత్రలు చేసుకోండి. పూటకు ఒకటి చొప్పున రెండు పూటలూ తీసుకుంటూ ఉంటే ఉబ్బసం, దగ్గు, జలుబు వ్యాధులు ఉపశమిస్తాయి. మంచి నాణ్యమైన ఇంగువ దొరకటం కష్టసాధ్యమే! నాణ్యమైన ముద్దకర్పూరం కూడా దొరకటం కష్టసాధ్యమే. అందుకే గట్టిగా కొన్ని చికిత్సా సూత్రాలను చెప్పాలంటే సందేహించాల్సి వస్తుంది.
28.ఊపిరి గుట్టు నొప్పి, కడుపు నొప్పి: తరచూ వచ్చే చెస్ట్ పెయిన్, కడుపులో నొప్పి లాంటివి పచ్చకర్పూరం నీళ్లతో తగ్గుతాయి. పావు గ్లాసు మించకుండా తేలికగా తీసుకోండి.
29.్ఫ్ల జ్వరం: ఫ్లూ జ్వరానికి నీళ్లలో పచ్చకర్పూరం కలిపిన తీర్థం ఉత్తమ ఔషధం.
30.్ఫడ్ పాయిజనింగ్: దోషాలున్న ఆహారం తీసుకున్నట్టు అనిపించినప్పుడు పచ్చకర్పూర తీర్థం తీసుకుంటే పొట్ట చెడకుండా ఉంటుంది.

*

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com