మీకు మీరే డాక్టర్

కందిపప్పుపై అర్థం లేని అపోహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: కందిపప్పు తింటే గ్యాసు వస్తుందా? పప్పు తినేవాళ్లని పప్పు సుద్ద అని హేళన చేస్తుంటారు. పప్పు శరీరంలో చురుకుదనాన్ని తగ్గిస్తుందా? ఇది బలానికి చాలదా? కందిపప్పు పైన అపోహల గురించి వివరించండి.
-లక్ష్మణరావు జాస్తి (తిరువూరు)

జ: మొక్కల ఆధారిత ఆహారాన్ని ‘వేగాన్ డైట్’ అంటారు. పూర్తి శాకాహారం అని దీని భావం. గుడ్డు, మాంసం, చేపలు లేని పోషకాహారం ఇది. వేగాన్ ఆహారం గురించి ఇప్పుడు విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి.
జంతువుల్లో అత్యంత శక్తిమంతమైన ఎద్దు, గుర్రం, ఏనుగు లాంటి జంతువులు నూరు శాతం శాకాహారులే! కాబట్టి కేవలం బలం కోసం బలవంతంగా మనుషులు మాంసాహారులు కానవసరం లేదు. వైద్యపరంగా మాంసాన్ని నిషేధించటం సాధ్యం కాకపోవచ్చు. కానీ, మానవతా దృష్టితో మాంసాహారాన్ని వదులుకోవడం అవసరమే! మాంసాహారానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. కందిపప్పు వాటిలో ముఖ్యమైంది.
ఒక విధంగా భారతీయులు ముఖ్యంగా తెలుగువారు అదృష్టవంతులు. ఎందుకంటే, విలువైన ప్రొటీన్లను తినాలంటే మనకు కందిపప్పు ప్రధాన ఆహార ద్రవ్యంగా ఉంది. కానీ, చాలా దేశాల వారికి కందిపప్పు ప్రధాన ఆహార ద్రవ్యం కాదు. అందువల్ల ప్రొటీన్లు కోసం వాళ్లు జంతువుల్ని చంపుకుని తినాల్సి వస్తోంది. కందిపప్పును నిత్యం వాడుకునే వారికి మాంసంతో పనిలేదు. వ్యామోహం కొద్దీ తినటమే గానీ, మన నిత్య భోజనంలో కందిపప్పు (లేదా పెసరపప్పు) ఉన్నంతకాలం మనకు మాంసంతో పనిలేదు.
మాంసం రూపంలో ప్రొటీన్లు తీసుకుంటే, జంతు ప్రొటీన్లు మానవ ప్రొటీన్లుగా త్వరగా మారతాయనీ, అదే మొక్కలకు సంబంధించిన ప్రొటీన్లను తీసుకుంటే అవి జంతు ప్రొటీన్లుగా మారి మనిషికి వొంటబట్టడానికి చాలా సమయం తీసుకుంటుందనీ వైద్యశాస్త్రం చెప్తోంది. అయితే, రోజు రెండు పూటలా పప్పన్నం తినేవాళ్లకు ఈ ప్రొటీన్ల ఆలస్యం అనే పదం వర్తించదు. అవి నిరంతరంగా అందుతూనే ఉంటాయి కాబట్టి.
ప్రపంచం దృష్టి ఇప్పుడు మెడిటేరియన్ డైట్, వేగాన్ డైట్ల మీద నడుస్తోంది. మెడిటరేనియన్ డైట్ అంటే శాకాహారం, మాంసాహారం రెండూ కలిసిన ఆహారం. మాంసాన్ని కొంత మానుకుని, ఆ మేరకు శాకపాకాలు తినటం మెడిటరేనియన్ డైట్ లక్ష్యం. కానీ, వేగాన్ డైట్ అనేది శుద్ధ శాకాహారంతో కూడుకున్నది. పూర్తి మాంసాహారం నుండి మెడిటరేనియన్ ఆహారంలోకి ఆ తరువాత పూర్తి శాకాహారమైన వేగాన్ డైట్‌లోకి మనుషుల్ని నెమ్మదిగా పరివర్తింప చేయాలని, ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అనీ వైద్య శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
మనిషి వౌలికంగా మాంసాహారి. జైన బౌద్ధాల ప్రభావాన శాకాహారిగా పరివర్తన పొందాడు. ఈ పరివర్తన అవసరం కూడా! మాంసపాకాల సేవనని కొంత మేర తగ్గించుకుని, శాకపాకాల వైపు మళ్లటం అవసరం అని ఇప్పుడు శాస్తవ్రేత్తలు గట్టిగా సూచిస్తున్నారు.
పప్పు్ధన్యాలలో కందుల వాడకమే ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద పండుతున్న కందులలో 85% కేవలం మన దేశంలోనే పండుతున్నాయి. కేవలం కందులను పండించి ఎగుమతి చేసుకొంటే చాలు మన దేశ దారిద్య్రం తీరిపోయి ఉండేది. అంత డిమాండు కందిపప్పునకు ఉంది. మనం కందిచేలు వేయటం మానేసి, ఇతర దేశాల నుండి కందిపప్పును దిగుమతి చేసుకొంటున్నాం. ఒక విధంగా ఇది దౌర్భాగ్యమేననాలి.
ప్రతి కంది మొక్కా ఒక ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ లాంటిది. కందిమొక్క పెరిగిన నేలలో నత్రజని శాతం పెరుగుతుందట. ఆ విధంగా ఒకసారి కంది, ఒకసారి వరి.. ఇలా అంతర్ పంటగా కందిని మధ్యమధ్య పండిస్తూ వుంటే కంది కరువు తీరుతుంది. ఎరువుల వాడకమూ తగ్గుతుంది.
కందులలో 85% ప్రొటీన్లున్నాయి. కాల్షియం, ఇనుము కూడా దండిగా వున్నాయి. పీచుపదార్థం కూడా ఉండటం వలన కందిపప్పు తింటే మలబద్దత రాకుండా ఉంటుంది. పెసలూ మినుములకన్నా కందులు తేలికగా అరుగుతాయి. తింటే ఉబ్బరం కలుగదు. దోరగా వేయించి వండుకుంటే తేలికగా అరుగుతాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. పప్పుగా వండుకోవటానికి అనువుగా ఉంటాయి. నీళ్ల విరేచనాలు, కలరా లాంటి వ్యాధుల్లోనూ, జీర్ణకోశ వ్యాధులన్నింటిలోనూ కందిపప్పుని కమ్మగా వండి పెట్టవచ్చు.
రోగి బలాన్ని కాపాడితే రోగ బలం తగ్గుతుందనేది ఆయుర్వేద శాస్త్ర సిద్ధాంతం. రోజుల తరబడి లంఖణాలు కట్టాల్సిన వ్యాధుల్లో కందిపప్పు కట్టు, జావ లాంటివి ఇస్తుంటే రోగి బలహీనపడకుండా ఉంటాడు. రోగం త్వరగా తగ్గుతుంది. అమీబియాసిస్ లాంటి వ్యాధుల్లో మాంసాహారాన్ని వదిలి కందిపప్పు మీద ఆధారపడటం వలన వ్యాధి త్వరగా అదుపులోకి వస్తుంది. కంది జావ లేదా కందికట్టులో దానిమ్మ గింజలు చేర్చి తాలింపు పెట్టుకొని తింటే రుచికరంగా ఉంటాయి. పేగుపూతకు ఇది మంచి ఔషధం. శరీర తత్వాన్ని మృదువు పరుస్తుంది. రక్తస్రావాన్ని ఆపుతుంది. గుండె జబ్బులున్న వారికి నిర్భయంగా పెట్టదగిన ఆహార పదార్థం ఇది. ఇది తినకూడని వ్యాధి లేదు. వేయించి వండుకుంటే మంచిది. ఆపరేషన్లు అయిన వారికి కూడా తప్పకుండా పెట్టవలసిన ద్రవ్యం. కందిపప్పును ఉడికించి తాలింపు పెట్టిన గుగ్గిళ్లలో కొద్దిగా మిరియాల పొడిగానీ, ధనియాల పొడిగానీ కలుపుకొని తింటే మంచి ఉపాహారంగా ఉపయోగపడుతుంది. కామెర్ల వ్యాధిలో కందిపప్పు మంచి చేస్తుంది. రక్తశుద్ధిని కలిగిస్తుంది.
సాంబారుకు అలవాటు పడి తెలుగువాళ్లు అమ్మమ్మల కాలంనాటి పప్పుచారుని మరిచిపోకూడదు. చింతపండు వెయ్యని పప్పుచారుని కట్టు అంటారు. కందికట్టు చాలా బలసంపన్నమైన ఆహార పదార్థం. కందిపప్పుని దోరగా వేయించి వండుకుంటే తేలికగా అరుగుతుంది. గ్యాసు పుట్టకుండా ఉంటుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com