మీకు మీరే డాక్టర్

ఆహార ఔషధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: ఆహార ఔషధాల గురించి మీరు ప్రతీ వారం చెప్తున్న విశేషాలు మాకు ఆసక్తిదాయకంగానూ, ఉపయోగకరంగానూ ఉన్నాయి. ఏయే ఆహార పదార్థాలను ఏయే వ్యాధుల్లో తినాలో వివరంగా తెలుపగలరు.

-స్వర్ణాంబ గాజులపల్లి (ఖమ్మం)

జ: పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పూలు.. వీటిలో దేని ఔషధ విలువలు దానికుంటాయి. ఉదాహరణకు గలిజేరు తీగ, ఆకు రసాలను కామెర్ల వ్యాధిలో ఔషధంగా ప్రయోగిస్తారు. ఈ తీగ స్పర్శామాత్రంగానే పని చేస్తుందని కామెర్ల రోగులు మెడలో దాన్ని దండలా ధరిస్తారు కూడా! లేత గలిజేరు ఆకుని తోటకూర మాదిరిగా కూర, పప్పు, పచ్చడి, పులుసు కూరల్లా వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. లివరు, స్ప్లీను, మూత్రపిండాలు, పాంక్రియాజ్ మొదలైన అవయవాలలో వాపుని తగ్గించి ఆయా అవయవాలను బలసంపన్నం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
అలాగే, బూడిద గుమ్మడిని అదొక కూరగాయ అనే సంగతి మరిచిపోయాం మనం. దాన్ని కేవలం గుమ్మాలకు వ్రేలాడదీసే దిష్టిబొమ్మగా మాత్రమే ఎక్కువమంది వాడుతున్నారు. తమిళులు బూడిద గుమ్మడి లేకపోతే ఆహారం అసంపూర్ణం అనుకుంటారు. ఆయుర్వేద శాస్త్రంలో బూడిద గుమ్మడికి ఔషధ ద్రవ్యంగా గొప్ప ప్రసిద్ధి ఉంది. ‘కూష్మాండ రసాయనం’ అనే ఔషధం బూడిద గుమ్మడికాయతో చేసినదే! ఇది రక్తస్రావాలను అరికడుతుంది. టీబీ లాంటి వ్యాధుల్లో రక్తం కక్కుకోవటం లాంటి పరిస్థితుల్ని తగ్గిస్తుంది. ఉబ్బసం, ఇతర ఎలర్జీ వ్యాధులు, కళ్లు చీకట్లు కమ్మటం, తలతిరుగుడు, వాంతి, వికారం, జ్వరాలు ఇవి ఉన్నప్పుడు ఈ ఔషధం బాగా పని చేస్తుంది. శరీరానికి పుష్టినిస్తుంది. చిక్కిపోతున్న పిల్లలకు దీన్నిస్తే, నూతనత్వం కలుగుతుంది. ఏపుగా ఎదుగుతారు. కంఠానికి మంచి స్వరాన్నిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇంత శక్తిమంతమైన ఔషధంగా పనిచేసే బూడిద గుమ్మడికాయని ఆహార పదార్థంగా వండుకోవటం మానేశాం. ఏ మాత్రం ఔషధ విలువలు లేని జంక్ ఫుడ్స్ మీద ఆధారపడేకన్నా ఇలా ఔషధ విలువలున్న వాటిని ఆహార పదార్థాలుగా మలచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ఉత్తమం కదా!
ఇలా వివిధ వ్యాధుల్లో తినవలసిందిగా వైద్యులు సూచించే కూరగాయల్ని ‘ప్రిస్క్రిప్షన్ కూరగాయలు’ అంటారు. ‘అన్నీ తినండి - ఈ మందులు వేసుకోండి’ అనే పద్ధతికి కాలం చెల్లింది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. పూర్తిగా ఆచరణలోకి తేవటానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, వ్యాధులు తగ్గాలంటే మార్చాల్సింది డాక్టర్లను, మందుల్ని కాదు, మారాల్సింది మనమేననే భావన ప్రజల్లో కలుగుతూ వస్తోంది. ఇది ఆహ్వానించదగిన ఒక మంచి మార్పు.
ఔషధాహారం కొనేవారి సంఖ్య 30% పెరిగిందని అమెరికాలో సర్వే తెలుపుతోంది. మన తెలుగు సమాజానికి పరిమితంగా ఆలోచిస్తే పండ్లు అమ్మేవారి సంఖ్య, కొనేవారి సంఖ్య ఒకప్పటికన్నా పెరిగాయి. గుంటగలగరాకు, పావిలి ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, మునగాకు వంటివి ఇళ్లకు తెచ్చి అమ్ముతున్నారు. కొనే వాళ్లు బాగానే కొంటున్నారు. తెలుగు నేల మీద కూడా పండ్లు కొనేవారి సంఖ్య గతంలోకన్నా 20% వరకూ పెరిగి ఉంటుంది. కానీ, మన అధికార వ్యవస్థ నిర్లక్ష్యం వలన కార్బన్ వేసి బలవంతంగా పండించే పండ్లు మాత్రమే మార్కెట్‌లో దొరకటం వలన ఎక్కువమంది పండ్లు కొనటానికి, తినటానికీ భయపడ్తున్నారు. ఈ భయం కూడా ఆరోగ్య స్పృహలో ఒక భాగమే!
‘ఔషధాహారం (ప్రిస్క్రిప్షన్ ఫుడ్) గురించిన శాస్ర్తియ అవగాహన పైన ఇప్పుడు అనేక పరిశోధనలు సాగుతున్నాయి. గుండె జబ్బులు, షుగరు వ్యాధి, బీపీ వ్యాధి, కీళ్ల నొప్పుల రోగులు ఎక్కువగా ఔషధాహారం వైపు మొగ్గు చూపు తున్నారు. దంపుడు బియ్యం, చిరుధాన్యాలు, జీడిపప్పు లాంటి గింజలు, అవిశ గింజల్లాంటి విత్తనాలను తినేవారి సంఖ్య పెరిగింది. ప్రజల్ని ఆ విధంగా ప్రోత్సహించటంలో మీడియా ద్వారా అనేక మంది సమాజ హితం కోరే మేధావులు విశేష కృషి చేస్తున్నారు. య్యజూ జఒ ళజూజషజశళ అనేది నేటి తాజా నినాదం.
ఆకలిని పెంచే కొన్ని ఔషధ ఆహార ద్రవ్యాలను పరిశీలిద్దాం.
అల్లం = సైంధవ లవణం మొదటి ముద్దగా తినటం.
అవిసి లేత ఆకులు, లేత సొర ఆకులు, లేత గుమ్మడి ఆకులు, గజపల్లేరు ఆకులు, గలిజేరు ఆకులు, చింతచిగురు, చింత పూలు, చిర్రికూర, పులిచెంచలి కూర - వీటితో కూర పప్పు, పులుసు, పచ్చడి వగైరా.
ఆగాకర కాయల కూర; ఆమలకి ఉసిరికాయల పచ్చడి; ఆవ పిండిని చేర్చి కూరలు వగైరా వండుకోవటం.
ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు (పరిమితంగా తినాలి)
కందకూర;
కరివేపాకు పొడ;
కుందేలు మాంసం;
కొత్తిమీర;
కొబ్బరి నీళ్లు;
జాజికాయ + జాపత్రి కలిపిన మసాలా పొడి;
జీలకర్ర కారప్పొడి;
తమలపాకులతో తోచిన వంటకం;
దానిమ్మ గింజలు;
ధనియాల పొడి వేసి కాచిన నీరు;
నల్ల తులసి ఆకులతో టీ;
పుదీనా;
బిరియానీ ఆకులు వేసిన మసాలా పొడి;
లేత నల్లేరు కాడల వడియాలను చాదు వడియాలంటారు. ఇవి కొన్ని రకాల ఎముకల వ్యాధుల్లో మేలు చేస్తాయి.
పసుపు: లివర్ వ్యాధులు, కేన్సర్ లాంటి జబ్బులు
వాము ఆకులతో కూర, బజ్జీల్లాంటి వంటకాలు;
వాము వేసిన కాచిన నీళ్లు;
వెలగపండు/ కాయ గుజ్జు;
శొంఠి + పిప్పళ్లు + మిరియాల పొడి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com