మీకు తెలుసా ?

ముల్లును తొలగించి తేనెటీగల్ని తింటాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేనెటీగలు, కందిరీగలే ప్రధాన ఆహారంగా తీసుకునే ‘బీ ఈటర్’ పక్షులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ పక్షులు చాలా అందంగా కనిపిస్తాయి. పాలపిట్టలు, చెకుముకి, లకుముకి పిట్టల జాతికి చెందినదిగా భావిస్తున్న ఈ పక్షి పది లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఉందన్న వాదన ఉంది. గాలిలో ఎగురుతూ తేనెటీగలు, కందిరీగలను పట్టుకోవడం వీటి ప్రత్యేకత. 200 అడుగుల దూరంలో ఉండగానే ఆహారాన్ని గుర్తించగలిగే ఇవి కోరిబస్టర్డ్ పక్షుల వీపుపై తిరగడానికి ఇష్టపడతాయి. తేనెటీగలు, కందిరీగలను పట్టుకున్న తరువాత వాటి తోకవద్ద ఉన్న ముళ్లు గుచ్చుకోకుండా కొమ్మలు లేదా నేలకేసి కొట్టి, వాటిని తొలగించాకే ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని రకాల విష కీటకాలను పట్టుకున్నా ఆ విషం ఉన్న భాగం పడిపోయేదాకా వాటిని నేలకేసి బాది తినడం వీటి ప్రత్యేకత. ఆడపక్షిని మచ్చిక చేసుకునేందుకు మగపక్షులు కందిరీగల్ని బహుమతిగా ఇవ్వడం ఓ విశేషం. ఆడ,మగ పక్షుల జంట ఒకదానిని ఒకటి తాకుతూ ఉండటాన్ని ఇష్టపడతాయి.

- ఎస్.కె.కె. రవళి