మీకు తెలుసా ?

బంతికాదు.. ఆల్గే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంతిలా గుండ్రంగా, అందంగా వందల సంఖ్యలో ఒకచోట ఎదిగే ఇవి నిజమైన బంతులు కావు. బంతుల ఆకారంలో ఉండే మొక్కజాతి జీవులు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే ఇవి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరోరకంగా చెప్పాలంటే ఇవి నాచుబంతులన్న మాట. అలల తాకిడి వల్ల ఆ నాచు ఇలా ఉండచుట్టుకుపోయి బంతుల్లా తయారవుతుంది. ఒకవేళ ఆ ఆకారంలో తయారయ్యాక ఎక్కడైనా దెబ్బతింటే క్షణాల్లో మరమ్మతు చేసుకోవడం ప్రారంభిస్తాయి. ఈ బంతుల్లాంటి ఆల్గేకు జపాన్‌కు చెందిన వృక్షశాస్తవ్రేత్త టకియ కవాకమి జపనీస్‌లో ‘మారిమొ’ అని పేరుపెట్టాడు. వారి భాషలో మారి అంటే నేలమీదగు కొడితే ఎగిరే ప్లే బాల్ అని అర్థం. మొ అంటే నీళ్లలో పెరిగే ప్రాణి అని భావం. ఆ రెండు పదాలను కలపి మారిమొ అని పెట్టారు. కొన్నిచోట్ల పదుల సంఖ్యలో ఉండే ఇవి మరికొన్ని చోట్ల వేలసంఖ్యలో రెండుమూడు వరుసల్లో తయారవుతూంటాయి. జపాన్, ఐస్‌లాండ్, స్కాట్‌లాండ్, ఎస్టోనియా విస్తృతంగా ఇవి కనిపిస్తాయి. ఈ మధ్య ఆస్ట్రేలియాలోను ఇవి ప్రత్యక్షమయ్యాయి.

- ఎస్.కె.కె. రవళి