మీకు తెలుసా ?

ఈ నత్త విషానికి విరుగుడే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖం ఆకారంలో షెల్‌లో (కోన్ స్నెయిల్స్) పెరిగే నత్తలు అత్యంత విషపూరితమైనవని అందరికీ తెలిసిందే. వాటిలో అన్నింటికన్నా జియోగ్రాఫిక్ కోన్ స్నెయిల్ అత్యంత విషపూరితమైనది. వీటిని సిగరెట్ స్నెయిల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి కాటువేసిన తరువాత బాధితుడు కేవలం సిగరెట్ కాల్చడానికి పట్టినంత సమయంలో ప్రాణాలు కోల్పోతాడు. అందుకనే వీటిని అలా పిలుస్తారు. ఈ భూమీద అత్యంత విషపూరితమైన జీవి ఇదే. వంద రకాల విషతుల్య రసాయనాల కలయికతో దీని విషం తయారవుతుంది. దీని నోటిప్కకనుంచి వచ్చే ఓ ప్రత్యేకమైన టెంటకిల్‌లా పెరిగే భాగంతో ఇది దాడి చేస్తుంది. దీని విషానికి ఇంతవరకు విరుగుడు కనిపెట్టలేకపోయారు. హిందూ పసిఫిక్ సముద్రాల్లో ఇది కనిపిస్తుంది. ఆరు అంగుళాల వరకు పెరిగే ఈ శంఖునత్తలు చూడటానికి అందంగా ఉన్నా ప్రాణాంతకమైనవి. అయితే దీని విషంలో కొన్ని రసాయనాలను తొలగిస్తే నొప్పుల నివారణకు అద్భుతమైన ఔషధంగా మార్చవచ్చు. అలా తయారైన ఔషధాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. తీవ్రమైన నొప్పుల నివారణకు వాడే మార్ఫిన్ వంటి ఔషధాలకన్నా వెయ్యిరెట్లు ప్రభావవంతంగాను, సైడ్ ఎఫెక్ట్ లేకుండాను ఇవి పనిచేస్తాయి.

- ఎస్.కె.కె. రవళి