మీకు తెలుసా ?

బొచ్చే శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందంగా, ఒత్తుగా పెరిగే బొచ్చు దీని ప్రాణాలకు ప్రమాదం తెస్తోంది. క్యాట్ ఫామిలీకి చెందిన ‘లిన్స్’ మిగతా పిల్లులకు భిన్నంగా బాగా దట్టంగా ఉన్న బొచ్చుతో బలిష్టంగా కనిపిస్తాయి. వీటి పాదాలు మిగతా పిల్లులకన్నా భిన్నంగా ఉండటం వల్ల అవి మంచులో కూరుకుపోకుండా నడవగలుగుతాయి. ఫ్యాషన్ రంగంలో వీటి బొచ్చుతో చేసిన వస్తువులకు విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల వేటకు గురవుతున్నాయి. వాటి బొచ్చే వాటి ప్రాణాలు తీస్తోందన్నమాట. నాలుగు రకాల ‘లిన్స్’ పిల్లుల్లో స్పానిష్ లిన్స్ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇవి కేవలం యూరోపియన్ ర్యాబిట్‌లనే ఆహారంగా తీసుకుంటాయి. ఆ కుందేళ్ల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండటంతో ఆహార కొరత కారణంగా స్పానిష్ లిన్స్ పిల్లులు జాతి అవసాన దశకు చేరుకుంటోంది. వీటికి వినికిడి శక్తి చాలా ఎక్కువ. 250 అడుగుల దూరంలో తిరుగుతున్న ఎలుకల అలికిడిని కూడా ఇవి గుర్తించి పట్టుకుంటాయి. శరీరంపై మచ్చలతో, పెద్దచెవుల పైన కొనల్లా ఉండే కేశాల సమూహం వీటికి సెన్సార్లుగా పనిచేస్తాయి. అందంగానూ ఉంటాయి.

- ఎస్.కె.కె. రవళి