మీకు తెలుసా ?

స్కిమ్మర్ పక్షి కింది దవడ పొడుగు ఎక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటిపై ఎగురుతూ ముక్కును నీళ్లలో ముంచి, నోరు తెరిచి దూసుకువెళుతూ ఆహారం దొరికినప్పుడు చటుక్కున నోటిని మూసి ఆహారాన్ని గుటుక్కున మింగడం ఈ ‘స్కిమ్మర్’ పక్షుల ప్రత్యేకత. వీటి ముక్కులో పై దవడ చిన్నదిగా ఉంటుంది. కింది దవడ పైదానికన్నా పొడవుగా, కాస్త వంకీ తిరిగి ఉంటుంది. నీళ్లలో ముక్కు దూర్చి వెతకడానికి వీలుగా ఈ ఏర్పాటన్నమాట. ఆ ముక్కుకు ఆహారం తగిలినప్పుడు చటుక్కున పై దవడ, కింది దవడ మూసుకుపోతాయన్నమాట. అయితే పుట్టినప్పుడు వీటి ముక్కు దవడలు సమానంగానే ఉంటాయి. వేటాడే వయసు వచ్చేసరికి ఈ తేడా వస్తుంది. ప్రపంచంలో మూడు జాతుల స్కిమ్మర్ పక్షులున్నాయి. వాటిలో బ్లాక్‌స్కిమ్మర్ పక్షులు అమెరికాలో కన్పిస్తాయి. ఆఫ్రికాలో కన్పించేవాటిని ఆఫ్రికన్ స్కిమ్మర్‌గా పిలుస్తారు. ఇక ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోను, ఇండియాలో కన్పించేవాటిని ఇండియన్ స్కిమ్మర్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఇండియన్ స్కిమ్మర్ పక్షులు అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అన్నట్లు ఈ స్కిమ్మర్ పక్షులను కట్‌వాటర్ బర్డ్స్ అని, సిజర్‌బిల్ క్రేన్స్ అని కూడా పిలుస్తారు.

వీటి నృత్యం చూస్తే బుట్టలో పడాల్సిందే...
ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కన్పించే ‘క్రోన్డ్ క్రేన్స్’ చూడటానికి ఎంత అందంగా ఉంటాయో జతకట్టడానికి ముందు ఆడమగ పక్షులు కలసి చేసే నృత్యం అంతకంటే అందంగా ఉంటుంది. ఒకదాని చుట్టూ మరొకటి తిరగడం, తలలు ఆన్చి గిర్రున నృత్యం చేయడం. ఒకదానిపైనుంచి మరొకటి గెంతడం, రెక్కలార్చి లయబద్దంగా రెండు పక్షులూ పాదాలు కదుపుతూ చేసే విన్యాసాలు చూసేవారిని అబ్బురపరుస్తాయి. సాధారణంగా సంపర్కానికి ముందు ఒకదానిని మరొకటి ఆకర్షించేందుకు ఇలా చేస్తాయి. ఒక్కోసారి మామూలుగానూ ఈ విన్యాసాలు చేస్తూంటాయి. అలాంటప్పుడు వాటి పిల్లలు (చిన్నపక్షులు)కూడా వాటితో జతగలసి నృత్యం చేస్తాయి. నమీబియా, ఉగాండా, బోత్స్వానా, జింబాబ్వే, సబ్‌సహారా ప్రాంతాల్లో మాత్రమే కన్పించే ఈ క్రోన్డ్ క్రేన్స్‌లో రెండుమూడు రకాలున్నాయి. చక్కటి రంగులు, తలపై ఫించం, మెడకింద ఎర్రటి తిత్తి వీటి ప్రత్యేకతలు.

చెట్టంత గూడు!
పిచ్చుకల్లా కన్పించే ‘వీవర్’ పక్షులు గూళ్లు అల్లుకోవడం మనకు తెలుసు. చెట్లకు వేళ్లాడుతూ ఉండే పిచ్చుకగూళ్లు చూడ్డానికి ఎంతో బాగుంటాయి. వీటి అల్లికలో ఆ పక్షుల నైపుణ్యం, జాగ్రత్త చూస్తే ఆశ్చర్యపోతాం. కానీ ఆఫ్రికా దేశాలైన నమీబియా, ఉగాండా, బోత్స్వానా వంటి కొన్ని ప్రాంతాల్లో కన్పించే ‘సోషియబుల్ వీవర్ బర్డ్స్’ అల్లుకునే సామూహిక గూళ్లు చూస్తే ఏ ఇంజనీరూ వాటిముందు పనికిరాడని అంటారు ఎవరైనా. దాదాపు ఐదు వందల జతల పక్షులు కలసికట్టుగా ఉండటానికి వీలుగా మన అపార్టుమెంట్లలా కామన్ గూడు కట్టుకోవడం వాటి ప్రత్యేకత. ఒక భారీ వృక్షమంతా కలిపేసి మల్టీస్టోరీడ్ భవనంలా గూడుకట్టుకోవడం వాటికి అలవాటు. కొన్ని తరాలపాటు వాటిని వినియోగించుకుంటాయికూడా. కొన్ని గూళ్లను పరిశోధించినప్పుడు అవి కనీసం వందేళ్లనాటివని నిర్ధారించారుకూడా. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలను పూర్తిగా కమ్మేసి గూళ్లు కట్టిన సందర్భాలూ ఉన్నాయి. విభిన్న తరాల పక్షులు కలసికట్టుగా వాటిలో జీవిస్తాయి. వేసవిలో బయట 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే ఆ గూళ్లలలోని గదుల్లో ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుందంటే వాటి నిర్మాణ కుశలత ఏంటో తెలుస్తుంది. ప్రత్యేకమైన గడ్డి, తీగలు, ఆకుల పీచు సేకరించి పక్షులన్నీ కలిసి వీటిని నిర్మిస్తాయి. ఈ గూళ్లను చూడటానికి పర్యాటకులు వస్తూంటారు. అప్పుడప్పుడు ప్రమాదాలు జరగడానికి కూడా ఈ గూళ్లు కారణమవుతూంటాయి.

ఎస్.కె.కె.రవళి