మీకు తెలుసా ?

ఈ కుక్క మొరగదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలో అందరూ ప్రేమగా పెంచుకునే ‘డింగో’ డాగ్స్ మిగతా కుక్కలకు భిన్నంగా ఉంటాయి. ఇవి వేటకు ఉపయోగించే రకం. ఇవి మిగతా కుక్కల్లా అరవడం, మొరగడం చేయవు. తోడేళ్లలా ఇవి ఊళపెడతాయి. కుందేళ్లు, కంగారూలవంటి జంతువులను ఇవి వేటాడి చంపుతాయి. చాలామంది అందుకోసమే వీటిని పెంచుతారు. అయితే వీటి విశృంఖల వైఖరివల్ల చాలా జీవజాతులు అంతరించిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఇవి ఈ దేశపు జంతువులు కావు. వేరేప్రాంతంనుంచి తెచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా పేరు చెబితే డింగోవైల్డ్ డాగ్ గుర్తుకువస్తుంది. వారి సంస్కృతిలో అవి ఓ విడదీయరాని భాగంగా మారిపోయాయి. ఆహారంకోసం ఓ రాత్రంతా అలుపెరగుండా, అవసరమైతే 37 మైళ్ల దూరం ప్రయాణించగలిగే సత్తా వీటికుంది. వీటి సమూహంలో శక్తిలేని, వయసుమీరిన కుక్కలకు ఆహారం అందకుండా చేసి, అవి మరణించేలా చేయడం లేదా వదిలించుకోవడం ఈ జాతి ప్రత్యేకత.

ఎస్.కె.కె.రవళి