మీకు తెలుసా ?

అతి ఎతె్తైన చెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి, ఎత్తు పెరిగే చెట్లు ఇవి. కాలిఫోర్నియాలోని సియర్రా నవడ పర్వతప్రాంతంలో మాత్రమే ఇవి కన్పిస్తాయి. వీటిని జెయింట్ సెక్వోయి, జనరల్ షెర్మన్, రెడ్‌వుడ్, హైపెరియాన్‌లని పిలుస్తారు. 3500 సంవత్సరాల జీవితకాలం ఉండే ఈ చెట్లు కనీసం 250 అడుగుల మేర ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లకు సగభాగం పైన మాత్రమే ఆకులు విస్తరిస్తాయి. వీటి కాండం చుట్టుకొలత (వ్యాసార్థం) కనీసం 26 అడుగులు ఉంటుంది. లోపలిభాగం డొల్లగా ఉంటుంది. ఈ చెట్ల బెరడు మందం మూడు అడుగులు. వీటి కాండం తొలచి టనె్నల్ మాదిరిగా చేసి పర్యాటకులను ఆకర్షించడం అక్కడ అలవాటు. అయిటే వీటి భారీ ఆకారం వల్ల కలపను వినియోగించేందుకు ఆ చెట్లను నరికివేసేందుకు చాలాప్రయత్నాలు చేశారు. కానీ అవి డొల్లగా ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని తేలడంతో బతికిపోయాయి. కేవలం టూత్‌పిక్స్, ఫెన్సింగ్‌కు, చిన్నచిన్న పరికరాల తయారీకి మాత్రమే అవి పనికొస్తాయి. ఈ చెట్లకు ఓ విశేషం ఉంది. వీటి బెరడు ఫైర్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. వీటికి అంత తొందరగా నిప్పంటుకోకపోవడం విశేషం. చెట్టయితే భారీగా ఉంటుంది కానీ వీటి కోన్స్ (కాయలు) రెండున్నర అంగుళాలకు మించి ఉండవు. ఒక్కోచెట్టుకు 11వేల కోన్స్ కాస్తాయి.

ఎస్.కె.కె.రవళి