మీకు తెలుసా ?

మెంతులతో స్వీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈజిప్టు, మధ్యప్రాచ్యంలో పుట్టి ఆసియాకు వ్యాపించిన మెంతులు రెండువేల ఏల క్రితమే సాగుచేశారు. ఈజిప్టులో మమీల తయారీలో మెంతులను ఉపయోగించేవారట. ఇక భారతీయ వైద్యం, వంటకాలు, సౌందర్య సాధనాల్లో మెంతులకు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇవి కాకుండా మెంతులతో స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు తయారు చేస్తారని తెలుసా. బాలింతలకు వీటితో తయారు చేసిన స్వీట్లు ఇస్తే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయని చెబుతారు. ఇండియా, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ దేశాలు ఇప్పుడు వీటి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఇవి మింగలేక మరణిస్తాయి...
ఓ రకం కొంగ ఇది. నిజానికి ఇది ‘క్రేన్’ జాతికి చెందినది కాదు. అంటే నేరుగా కొంగ అని చెప్పలేమన్నమాట. కొంగలా కన్పించే పక్షిగా చెప్పుకోవచ్చు. అమెరికాలో కన్పించే ఈ ‘గ్రేట్ బ్లూ హెరన్’ భారీ పక్షి. అలా అని అన్ని ‘హెరన్’లూ భారీగానే ఉండవు. ఈ నీలిపక్షి మాత్రం రెక్కలు విప్పితే కనీసం ఆరడుగులు వెడల్పు ఉంటుంది. చూడటానికి పెద్దగానే కన్పించినా బరువు మాత్రం తక్కువే. దీని ఎముకలన్నీ గుల్లగా ఉండటంవల్ల ఇలా ఉంటుంది. అన్నట్లు ఇవి కేవలం చేపలు, పీతలు, రొయ్యలు ఇలా సముద్రజీవులను మాత్రమే తిని ఊరుకోవు. అవసరమైతే కుందేళ్లు, చిన్నచిన్న జంతువులనూ తినేస్తాయి. చివరకు చనిపోయిన జంతువుల మాంసాన్నీ తినేస్తాయి. దీని మెడ ‘ఎస్’ ఆకారంలో ఉంటుంది. చేపల వేటకు సులువుగా ఉండే ఈ మెడ ఒక్కోసారి దాని ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ పక్షికి ఆబ ఎక్కువ. మింగగలనా లేదా అన్నది చూసుకోకుండా పెద్దపెద్ద చేపలను మింగే ప్రయత్నం చేస్తుంది. ఈ ఎస్ ఆకారపు గొంతులో చిక్కుకుని, మింగలేక మరణిస్తుంది. ఈ పక్షుల్లో శత్రువులనుంచి కన్నా ఇలాంటి ప్రమాదాలవల్లే ఇవి మరణిస్తాయ. ఇవి గంటకు ముప్ఫై మైళ్ల వేగంతో ఎగరగలవు. వీటికి ఇంకో ప్రత్యేకత ఉంది. వీటిలో ఆడపక్షులు జతకట్టే మగపక్షిని ప్రతి ఏడు మార్చేస్తూంటాయి. కానీ కొంగలు అలా కాదు. ఒకసారి జత కలిస్తే జీవితాంతం అవే పక్షులు కలసి జీవిస్తాయి.

వాము...రాజస్థాన్ ప్రత్యేకత..
ఈజిప్టులో పుట్టి ఇరాన్ చేరి, ఇండియాకు పరిచయమైన వాము పంట ఎక్కువగా సాగేది మనదగ్గరే. మనదేశంలో వాము ఉత్పత్తిలో రాజస్థాన్‌దే అగ్రస్థానం. వీటి ఆకులు, గింజలు ఆహారంగాను, ఔషధంగానూ పనికొస్తాయని చాలామందికి తెలుసు. ఈ గింజల్లో ఉండే థైమాల్ రసాయనం వల్ల వాటికి ఘాటు వచ్చింది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు చిట్కావైద్యంగా వామును వినియోగిస్తారని కూడా చాలామందికి తెలుసు. మనం కొన్ని పిండివంటల్లో వీటిని వాడినట్లే ఆఫ్గానిస్తాన్‌లో బ్రెడ్‌లు, బిస్కట్లలో వీటిని వాడతారు. వామును ఇంగ్లీషులో అజోవాన్, కెరొమ్, బిషప్‌వీడ్ అనికూడా పిలుస్తారు.

ఓడ్కా మద్యం కాదు..ఔషధం కూడా..

రష్యాలో ప్రసిద్ధిగాంచిన ఓడ్కా ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన పానీయం (ప్యూరెస్ట్ డ్రింక్). గోధుమలు, తృణధాన్యాలు, బంగాళ దుంపలు, వాటర్ ఇథనాల్‌తో పులియబెట్టి ఓడ్కాను తయారు చేస్తారు తెలుసా. కొన్నిదేశాల్లో కొన్నిరకాల పళ్లనూ వినియోగిస్తారు. నిజానికి ఓడ్కాకు రంగు, వాసన ఉండవు. అయితే వాటికి కొన్ని రకాల ఫ్లేవర్లు జతచేసి కొత్త బ్రాండ్లను తయారు చేస్తున్నారు. ఓడ్కా ఒకరకమైన మద్యంగా అంతా భావిస్తారు. అది నిజమే. కానీ ఓడ్కాను మంచి ఔషధంగాకూడా వాడతారు. గాయాలు మానేందుకు, శుభ్రం చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. గాజు వస్తువులు, పింగాణీ వస్తువులను, చివరకు బాత్‌రూమ్‌లు, టాయిలెట్లను శుభ్రం చేసేందుకు వాడతారు. నిజానికి హార్పిక్ వంటి ద్రావకాలకన్నా ఇది బాగా పనిచేస్తుందని చెబుతారు. ఒకప్పుడు పేలుడు పదార్థంగాకూడా దీనిని వాడేవారు. ఇతర ద్రవపదార్థాలేవైనా లీటరు అంటే వెయ్యి మిల్లీలీటర్లతో సమానం కదా. కానీ లీటరు ఓడ్కా తీసుకుంటే...953 మిల్లీలీటర్లే ఉంటుంది. 40శాతం ఆల్కహాల్ ఉండే ఓడ్కాను నాణ్యమైనదిగా ఎక్కువ దేశాలు భావిస్తాయి.

ఎస్.కె.కె.రవళి