Others

రైళ్ల జోలికెళ్లొద్దురో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌లో విద్య, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కనివ్వలేదు. బంద్ కారణంగా ఆర్టీసీ దాదాపు 7కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే, బంద్ సందర్భంగా ఆందోళనకారులు రైల్వే స్టేషన్ల దరిదాపులకే పోలేదు. రైల్‌రోకో అన్న మాటే వారి నోట వినిపించలేదు. గతంలో ఏ చిన్న ఆందోళన చేపట్టినా రైళ్లను నిలిపి వేసి, బోగీలపైకెక్కి విపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు ఫొటోలు దిగేవారు. ఆమధ్య ఓ సామాజికవర్గం వారు చేపట్టిన ఆందోళనలో ‘రత్నాచల్ ఎక్స్‌ప్రెస్’ను తగులబెట్టిన నిందితులను ఇప్పటికీ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. రైల్వేకు నష్టం కలిగించేవారిపై ఇటీవల నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుండటంతో నిరసనకారులు రైళ్ల వైపు కనె్నత్తి చూస్తే ఒట్టు!
- నిమ్మరాజు చలపతిరావు

వార్తలన్నీ నిజాలు కావు..
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి శస్తచ్రికిత్స చేయించుకున్న విషయం ఆమె కుమారుడు రాహుల్ చెప్పేంత వరకూ భారతీయ మీడియాకు తెలియనే తెలీదు. చాలా వార్తల్లో తెలిసీ తెలియని మసాలా మోతాదు ఎక్కుగానే ఉంటుంది. ఇటీవల ఓ వ్యక్తి రైలు వెళ్తున్నపుడు సెల్ఫీకి ప్రయత్నించి గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడని సామాజిక మాధ్యమంలో వార్త రాగానే పేరు మోసిన పత్రికలు సైతం దాన్ని కాపీ కొట్టాయి. ఆ తర్వాత అది తప్పుడు వార్త అని తేలింది. ఏపీకి చెందిన భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి ‘వార్నింగ్’ ఇచ్చారనే వార్తను ఓ పత్రిక తన వెబ్ పోర్టల్‌లో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. ఈ సంగతి తెలిసి వీర్రాజు నిర్ఘాంతపోయి, అమిత్ షా తనకు ఫోన్ చేయలేదంటూ ‘కాల్ డేటా’ను సన్నిహితులకు చూపి వాపోయారు. అమిత్ షా నిజంగా ఫోన్ చేస్తే తనకు అంతకుమించిన ఆనందం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
-బీవీ ప్రసాద్

జెండాలు వేరు.. ఎజెండా ఒకటే
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ పార్లమెంటులో తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా ఆందోళనలు నిర్వహించాయి. పార్లమెంటు బయట కూడా ఈ పార్టీలు ఒకే వేదికపైకి రాలేకపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో మాదిరిగానే తెదేపా, వైకాపా నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ‘గుడ్డిలో మెల్ల’ అన్నట్లుగా నాలుగు రోజుల పాటు పార్లమెంటులో హడావుడి చేసి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేత ‘హామీల అమలుకు కట్టుబడి ఉంటామ’నే ఒక ముక్కను చెప్పించగలిగారు. హామీల అమలుకు మరో హామీ ఇచ్చారట! .. అదే సంతోషం.
- కెవీఎస్

కలుద్దామా నేస్తం..
ఎన్నికల సమయంలో అనుకోని పొత్తులు అనివార్యమవుతాయి. అప్పటి వరకూ కలహించుకొనే కొన్ని విపక్ష పార్టీలు అకస్మాత్తుగా మిత్రపక్షాలై పోతాయి. రాబోయే ఎన్నికల్లో భావ సారూప్యం గల పార్టీలను కలుపుకుని పోతామని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చెప్పగానే, హైదరాబాద్‌లో ఆ పార్టీ నేత వి.హనుమంత రావు సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలసి, ఇకపై ఐక్యంగా సాగుదాం అంటూ ప్రతిపాదించారు. దీంతో సురవరం ప్రతిస్పందిస్తూ- ‘ముందు మీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మానుకుని అందరూ కలిసి ఉండండి..’ అని హితవు చెప్పారట!
- వి.ఈశ్వర్ రెడ్డి

ఇదీ ఓ రికార్డే..
కుక్కపిల్ల, సబ్బుబిళ్ల ఏదీ కవితకు అనర్హం కాదంటూ మహాకవి శ్రీశ్రీ అన్నట్టు రికార్డులకు కూడా ఏదీ అనర్హం కాదని ఒక సంస్థ నిరూపించింది. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’ కోసం- ‘సాక్స్ తొడుక్కోవడం, బూట్లు వేసుకోవడం, లేస్ కట్టుకోవడం’ అనే మూడు పనులను చిటికెలో చేసేందుకు 300 మంది పిల్లలను ఓ సంస్థ ఒక చోటకు చేర్చింది. రెండే రెండు నిమిషాల్లో ఒకేసారి ఈ మూడు పనులనూ చేసిన ఈ విద్యార్థులంతా సరికొత్త రికార్డు సృష్టించారు.
- పీవీ రమణారావు