కృష్ణ

కృష్ణలంకలో దొంగబాబా బడా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , డిసెంబర్ 3: సినీ ఫక్కీలో ఓ దొంగ స్వామీజీ మహిళలకు టోకరా వేశాడు. నమ్మి వచ్చిన మహిళల విశ్వాసాన్ని ఆసరా చేసుకుని జ్యోతిష్యం పేరుతో పూజలు నిర్వహించి భారీ ఎత్తున బంగారం కాజేసి జారుకున్నాడు. ఈ దొంగబాబా బారిన పడి పెద్ద మొత్తంలో బంగారు నగలు పొగొట్టుకుని మోసపోయిన జాబితాలో సుమారు పది మంది వరకు మహిళలు ఉన్నారు. వీరితోపాటు బాబా వద్ద పని చేసి రెండు మాసాలుగా జీతం లేక అవస్థలు పడిన ఇద్దరు యువతులూ బాధితుల జాబితాలో ఉన్నారు. కేవలం హిందీ, ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే ఈదొంగబాబా వయస్సు ఏ అరవై ఏళ్లో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మూడు పదులు కూడా నిండని యువకుడు ఈస్వామీజీ. బంగారం ప్రియులైన మహిళల బలహీనతే కేవలం ఇతగాడి పెట్టుబడి. ఈ బురిడీ బాబా బారిన పడిన బాధితులు వదిలించుకున్న బంగారం వదిలించుకున్నవారు సుమారు పది మంది వరకు ఉండగా.. ఎంతకాదన్నా.. ఈ దొంగ స్వామీజీ మహిళలకు టోకరా వేసి చెక్కేసిన బంగారం సుమారు 50కాసుల వరకు ఉంటుందని అంచనా. మోసపోయిన బాధితులు ఒక్కొక్కరిగా కృష్ణలంక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మొత్తం ఈఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెండు, మూడు నెలల క్రితం రిసెప్షనిస్టు, ట్రాన్స్‌లేటర్స్ కావాలంటూ పత్రికల్లో వెలువడిన ప్రకటనలు చూసి కొందరు యువతులు కృష్ణలంక పోలీస్టేషన్ పరిధిలోని ఫకీరుగూడెంలో ఉన్న బాబా ముసాఖాన్ జ్యోతిషాలయం కార్యాలయానికి వెళ్లారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతుల్లో కంకిపాడు, కృష్ణలంక ప్రాంతాలకు చెందిన సహిదా, శరణ్య అనే ఇద్దరు యువతులు ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. ఇక అప్పటి నుంచి వీరిలో ఒకరు ముసాఖాన్ బాబా కార్యాలయంలో రిసెప్షనిస్టుగా, మరొకరు ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తూ వచ్చారు. కేవలం హిందీ, ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే ముసాఖాన్ బాబా అలియాస్ మల్లిక్‌కు తెలుగు రాదు. అవసరాల్లో ఉన్నవారి కష్టాలు కడతేరిపోతాయని, భవిష్యత్తు చెప్పబడుతుందని, చెప్పినట్లు పూజలు చేస్తే జీవితంలో భోగభాగ్యాలు దక్కుతాయనే విధంగా వెలువడిన ప్రకటనలు చూసి ఆకర్షణకు గురైన నగరానికి చెందిన మహిళలు బురిడీ బాబా కార్యాలయానికి క్యూ కట్టారు. ఈయన వద్దకు వచ్చేవారికి జ్యోతిషం చెప్పడం, వారి సమస్యలు వినడం అందుకు తగిన రీతిలో పూజలు నిర్వహించడం ఈతతంగం మొత్తం మహిళలకు అర్థమయ్యేలా ట్రాన్స్‌లేటర్ అనువాదం చేసి చెప్పడం బాబా విడిదిలో నిత్యకృత్యం. అయితే ముసాఖాన్ బాబా ఒక్కసారిగా మాయమయ్యాడు. అప్పుడుగాని తెలిసింది సదరు మహిళలకు అసలు విషయం. బాబా తమను బురిడీ కొట్టించి బంగారంతో పరారయ్యాడని. దీంతో మోసపోయిన లంక ఝాన్సీలక్ష్మీ (35) అనే మహిళ గురువారం కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. సూర్యారావుపేట జగదాంబ వారి వీధికి చెందిన ఝాన్సీలక్ష్మీ లక్ష్మీ లామినేషన్స్ పేరుతో యూనిట్ నిర్వహిస్తున్నారు. ఈమె 20రోజుల క్రితం బాబాను కలిసి బాధలు చెప్పుకున్నారు. సంప్రదించేందుకు 151 రూపాయలు ఫీజు చెల్లించింది. ఇంకేముంది బాబా పూజలు నిర్వహించాడు. 3,600 రూపాయలు చెల్లిస్తే గట్టి పూజ చేస్తానని చెప్పడంతో ఆ మొత్తాన్ని కట్టింది. దీంతో ఏవో కొన్ని పూజలు చేసిన బాబా బంగారం తీసుకురావాల్సిందిగా ఆఙ్ఞపించాడు. అంతే ఝాన్సీలక్ష్మీ తన వద్ద ఉన్న సుమారు ఐదు కాసుల బంగారం తీసుకువచ్చి ఇవ్వగా వాటిని కుండలో పెట్టి పూజలు చేసి ఇంటికి తీసుకెళ్లి మూడు రోజుల తర్వాత తెరచి చూస్తే ఇల్లంతా బంగారమయమవుతుందని చెప్పాడు. అలా చేసిన సదరు మహిళ మూడో రోజు కుండ తెరచి చూడగా అందులో రూపాయి కాయిన్స్, పసుపు, కుంకు మ మినహా ఇంకేమీ లేదు. ఇలా బాబా జీ బారిన పడి ఇదే తరహాలో మోసపోయిన మాచవరానికి చెందిన సీతాదేవి, సరిత అనే మహిళలతో కలిసి సుమా రు పది మంది వరకూ పోలీస్టేషన్ దారి పట్టారు. వీరంతా ఒక్కొక్కరు మూడున్నర, ఎనిమిదిన్నర, ఐదు కాసులు, నాలుగు కాసులు ఇలా సగటున ఐదు కాసుల చొప్పున వేసుకున్నా సుమారు 50కాసుల వరకు బాబాకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఇక బాబా వద్ద పని చేసిన సహిదా, శరణ్యలకు రెండు నెలల జీతం బకాయి ఉంది. ఇలా నకిలీ బాబా బారిన పడి బంగారం పోగొట్టుకున్న బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. బురిడీ బాబా మోసంపై కృష్ణలంక సిఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.