కృష్ణ

నిరుపేదలకు రుణాలు నిరాకరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎంపిడిఓనే కారణం
* ఉద్యమం చేపడతాం:వైసిపి
తోట్లవల్లూరు, డిసెంబర్ 27: ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాలను లబ్ధిదారులకు అందకుండా జన్మభూమి కమిటీలు, అధికారులు, ఎంపిడిఓ ఈశ్వరపద్మసుధ కలిసి నిరాకరించటం సహించరాని విషయమని, ఒకవిధంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చింతలపూడి గవాస్కర్, ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండి ఇక్బాల్ బాషా, ఆరేపల్లి శ్రీనివాసరావు, వల్లూరు స్వర్ణకుమారి, మాజీ సర్పంచ్ బొడ్డు సుగుణాకరరావు ఆరోపించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో రుణాలు మంజూరు విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతో గత రెండేళ్లలో రూ.కోటీ 15లక్షలు మిగిలిపోయాయని తేలిందన్నారు. ఇందుకు జన్మభూమి కమిటీలు 73 పేర్లను నిరాకరించటమే కారణమని ఎంపిడిఓ ఈశ్వరపద్మసుధ తెలిపారన్నారు. 2014-15 సంవత్సరంలో 136 రుణాలకు 43 రుణాలను తిరస్కరించటంతో రూ.67 లక్షలు వెనక్కు వెళ్లిపోయాయయని, అలాగే 2015-16 సంవత్సరానికి సంబంధించి 99 రుణాలకు గాను 30 రుణాలను జన్మభూమి కమిటీ తిరస్కరించిందని వారు తెలిపారు. మండలంలో టిడిపి నాయకుల మధ్య విభేదాల వల్ల రుణాలు పొందాల్సిన నిరుద్యోగులు నష్టపోయారన్నారు. జిల్లా కలెక్టర్, సీఎంకు ఈ విషయాలను ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వైకాపా వారిని తిరస్కరించినా కనీసం టిడిపి వారికైనా ఇస్తే బాగుండేదన్నారు. ఈ పరిస్థితి మారకపోతే ఉద్యమం చేపడతామని రాజేంద్ర, శివశంకర్ తెలిపారు. అసలు ఈ మొత్తం పరిస్థితికి ఎంపిడిఓ పద్మసుధ కారణమని ఎంపిటిసి శివశంకర్ ఆరోపించారు. వారానికి ఒకరోజు, రెండు రోజులు మాత్రమే వస్తున్నారని, రుణాల విషయపై బ్యాంకర్లను, జన్మభూమి కమిటీ సభ్యులను సమన్వయం చేయటంలో విఫలమయ్యారని విమర్శించారు. సమావేశంలో సిపిఎం కార్యదర్శి సిహెచ్ సుబ్బారావు, వైకాపా నాయకులు ఎండి ఇంతియాజ్ పాషా, ఎంఎం దౌలా పాల్గొన్నారు.