క్రీడాభూమి

ప్రో కబడ్డీ బెంగళూరుపై వారియర్స్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళ వారం జరిగిన మ్యాజ్‌లో బెంగళూ రు బుల్స్‌ను బెంగాల్ వారియర్స్ జట్టు 26-22 తేడాతో ఓడించింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాళ్లు నీలేష్ షిండే 7 పాయంట్లతో రాణించగా, జాన్ కున్ లీ 6 పాయంట్లు సాధించి, జట్టు విజయంలో తన పాత్ర పోషించాడు. మహేష్ గౌడ్ 5 పాయంట్లు చేశాడు. కాగా, బెంగళూరు తరఫున దీపక్ కుమార్ దహియా ఒక్కడే మెరుగైన ప్రదర్శనతో 6 పాయంట్లు చేశాడు.
టైటాన్స్ పరాజయం
మరో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో యుముంబా చేతిలో తెలుగు టైటాన్స్ జట్టు కేవలం రెండు పాయంట్ల తేడాతో ఓడింది. యుముంబా 27 పాయంట్లు సాధించగా, తీవ్రంగా పోరాడిన టైటాన్స్‌కు 25 పాయంట్లు లభించాయ. ఈ జట్టులో సుకేష్ హెగ్డే 9 పాయంట్లు, రాహుల్ చౌదరీ 6 పాయంట్లు చేశారు.

పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ భయం!
మీర్పూర్, మార్చి 1: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముద్రపడిన పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ భయం మొదలైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు నుంచి ఏ స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుందోనన్న ఆందోళన పాక్ క్రికెటర్లను వెంటాడుతున్నది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొని 45 పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని 51 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ, మూడో మ్యాచ్‌లో పటిష్టమైన శ్రీలంకపై 23 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. కాగా, పాకిస్తాన్ మొదటి మ్యాచ్‌లో భారత్‌తో తలపడి 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. రెండో మ్యాచ్‌లో యుఎఇని మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగా, ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. బలమైన లంకను కూడా ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్‌పై నెగ్గడం అసాధ్యం కాదుగానీ సులభం కాదన్న విషయం పాకిస్తాన్‌కు స్పష్టమైంది. యుఎఇ వంటి ‘పసికూన’ జట్టుతోనూ దాదాపుగా చివరి వరకూ పోరాడాల్సి రావడం పాక్ క్రికెటర్ల నిలకడలేమికి అద్దం పడుతుంది. బ్యాటింగ్‌లో షోయబ్ మాలిక్, బౌలింగ్‌లో మహమ్మద్ అమీర్ సామర్థ్యంపై పాక్ భారం వేసింది. యుఎఇతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 63 పరుగులతో రాణిస్తే, అమీర్ నాలుగు ఓవర్లలో కేవలం ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, బంగ్లాదేశ్ సూపర్ పేసర్ మస్త్ఫాజుల్ రహ్మాన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరం కావడం పాక్ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే, ముస్త్ఫాజుర్ లేకపోయినా బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఆడకపోతే, పాకిస్తాన్‌కు ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.