కృష్ణ

ఎసిబి అధికారులకు చిక్కిన అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ ఎఓ
మచిలీపట్నం, నవంబర్ 20: మచిలీపట్నం పురపాలక సంఘంలో అవినీతి చేపను అవినీతి నిరోధక శాఖాధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎకౌంటెంట్ ఆఫీసర్ పి యర్రయ్య రూ.5వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హౌసింగ్ బోర్డుకు చెందిన ఎలక్ట్రిషియన్ సుబ్రహ్మణ్యం ఇటీవల దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక కోనేరుసెంటరులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఇందుకు గాను రూ.30వేలు బిల్లు అవ్వగా బిల్లును ఎకౌంట్ ఆఫీసర్ యర్రయ్యకు సమర్పించాడు. అయితే బిల్లు ఇచ్చే విషయంలో ఎఓ ఇబ్బందులకు గురి చేశాడు. రెండు మూడు వారాల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుకున్నాడు. చివరకు రూ.5వేలు ఇస్తే బిల్లు ఇస్తానని డిమాండ్ చేశాడు. దీంతో ఎలక్ట్రిషన్ సుబ్రహ్మణ్యం సరే అని చెప్పి విజయవాడలోని ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో సుబ్రహ్మణ్యం రూ.5వేలు సొమ్మును ఎఓ యర్రయ్యకు ఇచ్చాడు. అదే సమయంలో మాటు వేసి ఉన్న ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఎఓను పట్టుకున్నారు. ఎసిబి డియస్‌పి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడి జరగ్గా సిఐలు శ్రీనివాసులు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.