తెలంగాణ

నాడు ఇందిరమ్మ.. నేడు శంకరన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 5: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా ఓటర్లు మరోమారు కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం హైదరాబాద్ నగర పాలక సంస్థలోని 150 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా నాచారం డివిజన్‌లో శాంతితో పాటు మెదక్ జిల్లా పరిధిలోని పటన్‌చెరు డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్‌ను గెలిపించి పార్టీ పరువు దక్కేందుకు దోహదపడ్డారు. యావత్ దేశంలోనే గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి అధికారాన్ని దక్కించుకోవడానికి అప్పటి మహా నాయకురాలు ఇందిరాగాంధీని సైతం మెదక్ జిల్లా ప్రజలు పూర్తిగా ఆదరించారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయగా 82 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లాలో అంతర్భాగమైన భారతీనగర్, రామచంద్రాపూర్, పటన్‌చెరు డివిజన్లలో రెండు డివిజన్లను టిఆర్‌ఎస్ ఖాతాలో వేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. కాగా, పటన్‌చెరులో కూడా టిఆర్‌ఎస్ గెలుస్తుందన్న ధీమా వ్యక్తమైనా సౌమ్యుడు, మృదుభాషిగా పటన్‌చెరు వాసుల్లో మంచి ముద్ర వేసుకున్న శంకర్ యాదవ్‌ను గెలిపించిన ఓటర్లు కాంగ్రెస్‌కు కనీసం గ్రేటర్ పాలకవర్గంలో తమ సభ్యుడు ఉన్నాడని పేరు చెప్పుకోవడానికి అవకాశం లభించింది.