రంగారెడ్డి

నాణ్యమైన విద్యతో మెరుగైన సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 14: నాణ్యమైన విద్యాబోధన జరిగినప్పుడే మెరుగైన సమాజాన్ని నిర్మించగల్గుతామని ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి అన్నారు. పయనీర్ కానె్సప్ట్ స్కూల్ 10వ వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకున్నప్పుడే ఉన్నత శిఖరాలకు అవరోధిస్తారని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేషించుకొని విద్యను అభ్యసించినప్పుడే విద్యార్థులు జీవితంలో రాణించగల్గుతారని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యా సంస్థలు విద్యార్థులను మేధావులుగా తయారు చేసి దేశానికి అందించాలని కోరారు. వివిధ సాంస్కృతిక అంశాలు ఆహుతులను మంత్రముగ్దులను చేశాయి. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి ఎస్.్భపతిరావు, పయనీర్ స్కూల్ కరస్పాండెంట్ సంరెడ్డి ప్రమోద్‌రెడ్డి, డైరెక్టర్‌లు బొల్ల శ్రీనివాస్, వైద్యం విఠల్ పాల్గొన్నారు.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు హాని జరిగితే యూనివర్శిటీల్లో యుద్ధ వాతావరణం
ముషీరాబాద్, ఫిబ్రవరి 14: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పలు అంశాలపై పెద్ద ఎత్తున వాదోపవాదనలు జరుగుతున్న సందర్భంలో వివిధ సామాజిక వర్గాల విద్యార్ధుల నుండి వ్యక్తమవుతున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హిందూ మతోన్మాద శక్తులు అడ్డు తగలటంవల్ల యూనివర్శిటీలు యుద్ధ భూమిగా మారే ప్రమాదం ఉందని దళిత బహుజన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్ళి షేక్‌బాషా, కార్యదర్శి చేపూరి రాజు మాట్లాడారు. ఢిల్లీలోని జెఎన్‌యులో జరుగుతున్న పరిణామాలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చైశారు. సంఘపరివార్‌లకు వ్యతిరేకంగా వచ్చిన భావ వ్యక్తీకరణ వాదులపై జాతివ్యతిరేకులు, దేశద్రోహులంటూ విద్యార్ధుల గొంతు నొక్కేసే చర్యలకు మోదీ ప్రభుత్వం పాల్పడుతుందని దుయ్యబట్టారు.
పాకిస్తాన్ టెర్రరిస్టులు, ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు భారతదేశంపై పెద్ద ఎత్తున దాడులు చేస్తుంటే దాన్ని నిరోధించలేని చేతకాని బిజెపి ప్రభుత్వం యూనివర్శిటీ విద్యార్ధులపై దేశ ద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేయటం అత్యంత పాశవికమైన చర్య అని విమర్శించారు. అఫ్జల్‌గురు అనుకూల, వ్యతిరేక సభలలో జరిగిన ఘటనలపై సముదాయించటానికి వెళ్లిన జెఎన్‌యు అధికార విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను అక్రమంగా నిర్భందంలోకి తీసుకుని దేశ ద్రోహం క్రింద నేరం మోపటం సరైంది కాదనీ, తక్షణం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.