నల్గొండ

వర్గీకరణ సాధనకు ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 20: ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోని ముందుకు వెళ్తున్నట్లు ఎస్సీ కార్ఫొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ వర్గీకరణ ఉద్యమాన్ని 50 యేళ్ల వరకు కొనసాగించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే వర్గీకరణ ఉద్యమం రెండు దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. రానున్న ఎన్నికల లోపే వర్గీకరణ సాధించే దిశగా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు మాదిగ జాతి యావత్తును ఏకం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. శాసనసభలో సైతం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రధాని మోదీకి అందజేసినట్లు తెలిపారు.
కేసిఆర్ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు తాను పట్టుదలతో శ్రమిస్తుంటే కొంత మంది పనిగట్టుకోని అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ తీర్మానంలో వ్యతిరేకించని మాల ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసిఆర్ సారథ్యంలో వర్గీకరణ సాధించుకుంటామన్నారు. మాదిగలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అన్ని నియామకాలలో ప్రధాన్యత లభిస్తుందని గుర్తుచేశారు. వర్గీకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మాదిగ మహాశక్తి ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేసే వరకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, నాయకులు మండారి వీరబాబు, కె.సుదర్శన్, మంద సురేష్, బోయ రామచంద్రం, బోయ లింగస్వామి, బోయ ప్రవీణ్‌కుమార్, ఉప్పు కృష్ణ, చెక్క బాలకృష్ణ, బక్క నరసింహా, ఎర్ర శంకర్, కోడిగుడ్ల యాదగిరి, బండమీది మల్లేష్ తదితరులు ఉన్నారు.
మాదిగా జెఎసి జిల్లా యువజన అధ్యక్షుడుగా ప్రవీణ్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన బోయ ప్రవీణ్‌కుమార్‌ను మాదిగ జెఎసి యాదాద్రి భువనగిరి జిల్లా యువజన అధ్యక్షుడుగా నిమామకం చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. వర్గీకరణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. నియోజకవర్గాలు, మండలాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.