నల్గొండ

రుణమాఫీని ఏకకాలంలో చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, అక్టోబర్ 20 : కష్టాల్లో రైతుల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రైతు గర్జన సభకు కాంగ్రెస్ నాయకులతో కలసి వెళ్తు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతులు, విద్యార్ధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి మొత్తం రుణం మాఫీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు టి ఆర్ ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయారని, కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేసి 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్ధులు, రైతులు తమ అభ్యర్ధనలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డిలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశీలకులు కుంతియా, మాజీ ఎంపీ మల్లు రవి, వేణుగోపాల్, డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకులు పల్లె సంతోష్, అజయ్, రమేష్, నవీన్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.