నల్గొండ

మత్స్యకార్మికుల అభ్యున్నతికై ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, నవంబర్ 3: మత్స్యకార్మికుల అభ్యున్న తి కోసం తెరాస ప్రభుత్వం గ్రామాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికై తోడ్పాటునందిస్తుందని మత్స్యకార్మికులకు ఉచితంగా చేపలను పంపిణీ చేస్తుందని చిట్యాల ఎంపిపి బట్టు అరుణఅయిలేష్, జెడ్పీటీసి శేపూరి రవీందర్ అన్నారు. మత్స్యశాఖ సరఫరా చేసిన సమారు లక్ష చేపపిల్లలను మండలంలోని శివనేనిగూడెం, వట్టిమర్తి, ఉరుమడ్ల, తాళ్ళవెల్లంల గ్రామాల్లోని చెరువుల్లో ప్రజాప్రతినిధులు మత్స్యకార్మికులతో కలిసి వదిలారు. ఈసందర్భం గా ఎంపిపి, జెడ్పీటీసి మాట్లాడుతూ చేపల పెంపకంతో జీవనాన్ని గడిపే మత్స్యకార్మికులు ఆర్ధిక ఇబ్బందులు పడకుండా ఉం డేందుకుగాను తెరాస ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేస్తుందన్నారు. కులవృత్తులపై ఆధారడిన కుటుంబాలకు చేయూతనిందించాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మత్స్యకార్మికులకు ప్రోత్సాహాన్నందిస్తున్నారన్నారు. మత్స్యకార్మికులకు చేపపిల్లలను ఉచితంగా సరఫరా చేసి చేపల పెం పకాన్ని ప్రోత్సహించడం ప్రభు త్వం బాద్యతగా తీసుకుందని గ్రామాల్లోని చెరువుల్లో మత్స్యకార్మికులు చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి ఆర్ధికంగా ఎదగాలన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకార్మికుల సం క్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిని సారించారని మత్స్యకార్మికుల అభ్యున్నత్యే ధ్యేయంగా కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, మత్స్యకార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.