నల్గొండ

రైతు పోరు యాత్రను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి నుండి మొదలు చేసిన రైతుపోరుయాత్రను విజయవంతం చేయాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి అన్నారు. ఆదివారం స్ధానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టిడిపి రైతులను చైతన్యపరిచేందుకు రైతుపోరుయాత్రను తలపెట్టిందని, ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన రెండున్నర ఏళ్ల పాలనలో రైతులను, ప్రజలను, విద్యార్ధులను పూర్తిగా విస్మరించిందన్నారు. బ్యాంకుల్లో రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పి నేటికి బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను దృష్టిలో ఉంచుకొని టిడిపి ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ రైతుపోరుయాత్రకు మండల వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భరతయ్య, భిక్షమయ్య, చందు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం
మోత్కూరు, నవంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని టిడిపి జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి సందీప్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలోని పొడిచేడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆయన స్వగ్రామమైన పొడిచేడులో ఏదో మొక్కుబడిగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం కనీసం డబుల్ బెడ్‌రూం ఇండ్లనైనా పొడిచేడు గ్రామం నుండి ప్రారంభించాలని, అప్పుడే శ్రీకాంతాచారికి నిజమైన నివాళీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్వాయి రజనీకుమారి, సత్యనారాయణచారి కార్యకర్తలు పాల్గొన్నారు.