నల్గొండ

తహసీల్దార్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, నవంబర్ 22: అక్రమ ఇసుక రవాణా కేసులో వేములపల్లి తహసీల్దార్ సరస్వతిని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సస్పెండ్ చేశారని స్థానిక ఆర్డీఓ బి.కిషన్‌రావు తెలిపారు. మంగళవారం స్థానిక రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 14న వనస్థలిపురంకు చెందిన బి.యాదయ్య ఇసుక డంప్ నుండి 2 లారీల్లో ఇసుక తరలిస్తుండగా తహసీల్దార్ సరస్వతి స్వాధీనం చేసుకున్నారని, వాటికి సుమారు 50,000 రూపాయలు జరిమానా విధించాల్సి ఉండగా, కేవలం 10,000 రూపాయలు మాత్రమే జరిమానా విధించారని తెలిపారు. జరిమానా తక్కువ విధించి 70,000 రూపాయలు ముడుపులు స్వీకరించిన అనంతరం లారీలను విడుదల చేశారన్న విషయం తెలియడంతో విచారణ ప్రారంభించామని ఆయన తెలిపారు. తహసీల్దార్ సరస్వతిని ఈ నెల 20న తాను విచారణ జరిపానని అన్నారు.
విచారణలో తాను డబ్బులు తీసుకోలేదని ఆమె పేర్కొందని, డబ్బులు ఇచ్చిన వ్యక్తి యాదయ్య మిర్యాలగూడ పట్టణంలోని ఆమె బంధువు సైదులుకు ఇచ్చానని చెప్పడం, అది నిజమని తేలడంతో కలెక్టర్‌కు నివేదించానని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆమెను సస్పెన్షన్‌లో ఉంచారని తెలిపారు. విఆర్‌ఓ నుండి ఉన్నత అధికారి ఎవరైనా కూడ అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఆయన అన్నారు. ఆమె స్థానంలో ఇన్‌చార్జిగా త్రిపురారం తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌ను నియమించినట్టు తెలిపారు.