నల్గొండ

కేబుల్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: కేబుల్ టీవి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం జరిగిన కేబుల్ ఆపరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాల్గవ విడత కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎం ఎం ఒలు విధిగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి కేంద్ర ఆదేశాలు పాటించాలన్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్ దారుడినిక సెటప్ బాక్స్ బిగించాలన్నారు. లేనియోడల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రోడ్డు విస్తరణలో అన్యాయం
విచారణ చేపట్టాలి
మునుగోడు, డిసెంబర్ 2: మండల కేంద్రంలోని మునుగోడు-చిట్యాల రోడ్డు విస్తరణలో జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని రోడ్డుకు పడమర వైపు ఉన్న ఇంటి యాజమాన్యులు చౌరస్తాలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో ఇరువైపులా సమన్యాయం పాటించాల్సిన పాలకులు, అధికారులు ఎకపక్ష నిర్ణయంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. 2014 సంవత్సరంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మాణాలు తొలగించిన గ్రామ పాలకులు నేడు వారి వద్ద డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా నిర్మాణం చేయడంతో ఒక పక్క వారికి పూర్తి వాటిల్లుంతుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూసి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో గంజి వాసుదేవులు, ఒడ్డేరి రాములు, వేముల యల్లయ్య, వేముల రమేష్, వేముల వెంకన్న, కృష్ణమూర్తి, కొంగరి చంద్రయ్య, నేలపట్ల వెంకన్న, కిషన్, తోట కృష్ణయ్య, తదితరులు పాల్గోన్నారు.
ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి
రాజాపేట, డిసెంబర్ 2: ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా కలిగి ఉండాలని మండల ప్రత్యేక అధికారి హరినాధ్‌బాబు కోరారు. మండలంలోని చల్లూరు సిబిఐ బ్యాంకు పరిధిలోని రఘునాధపురం, చల్లూరు, కాల్వాపల్లి, బసంతపురం గ్రామాల్లోని ఖాతా లేని ప్రతి ఒక్కరు శనివారం నిర్వహించే బ్యాంకు ఖాతా కార్యక్రమంలో పాల్గొని ఖాతాలు పొందాలని కోరారు. ఖాతా పొందేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, జీరాక్స్ ప్రతులు, ఒరిజినల్ కాపీలతో పాటు రెండు ఫోటోలు ఇవ్వాలని కోరారు.