నల్గొండ

మెరుగైన ఫలితాలకు ప్రత్యేక తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలకు సిద్దం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9,10 తరగతులకు పరీక్షల సన్నధ్దం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. స్లిప్‌టెస్టుల ద్వారా వెనుకబడిన విద్యార్ధులను ప్రోత్సహించాలన్నారు. బడి మానేసిన బాలికలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగాంచాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. డిసెంబర్ 31 వరకు 9,10 తరగతుల సెలబస్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మత్తులకు గురైన పాఠశాల భవనాలను మంజూరైన నిధులతో పనులు జరిపించాలని, మధ్యాహ్నా భోజనం సక్రమంగా అందించాలని సూచించారు. సర్వశిక్ష అభియాన్, ఆర్ ఎం ఎస్ ఏ నిదులతో చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను జీయోట్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డి ఈ ఒ చంద్రమోహన్, ఎస్ ఎస్ ఏ ఈ ఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అనుమానంతో భార్య తలపై..
సుత్తితో కొట్టి హత్య చేసిన భర్త
నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: అనుమానంతో భర్త తన భార్యను నడిరోడ్డులోనే అడ్డగించి సుత్తెతో తలపై మోదీ హత్య చేసిన సంఘటన పట్టణంలోని పాతబస్తీ ఘడీ మసీదు వెనుక ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీకి చెందిన ఎండి.బషీర్ వృత్తిరీత్య వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన ఇద్దరు కూతుళ్లతో భార్య జోహీ తహరిన్(22)తో కలసి జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆమెను అనుమానిస్తూ గొడవ పడుతుండేవాడు. ఇందులో భాగంగా శుక్రవారం సైతం గొడవ పడి భార్య తన నాలుగు సంవత్సరాల కూతురుకు అన్నం తినిపించేందుకు మధ్యాహ్నం పాఠశాల వద్దకు వెళ్తుండగా మధ్యలోనే అడ్డగించి తన వెంట తెచ్చుకున్న సుత్తెతో ఆమె తలపై మోదాడు. తలకు తీవ్ర గాయాలపాలైన తహరీన్ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.