నల్గొండ

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తోటల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, డిసెంబర్ 2: పండ్లు, కూరగాయల సాగు కోసం అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తోటల పెంపకానికి ప్రోత్సహిస్తున్నామని ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ జిల్లా అధికారి సంగీతలక్ష్మి అన్నారు. ఉద్యానవన-పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రం శివారులో ఆకిటి సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రంలో నూతన, సాంకేతిక అంశాలు, పథకాల అమలుపై జిల్లాలోని అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, శాస్తవ్రేత్తలు, సిబ్బంది హాజరైనారు. ఈసందర్భంగా అధికారిణి సంగీతలక్ష్మి మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకంలో అధునాతన పద్ధతులను పాటిస్తూ సాగు చేసుకోవాలని సూక్ష్మసేధ్యంతో పంటల సాగుకు నీటి వనరులు తక్కువగా వినియోగపడతాయన్నారు. పండ్లు, కూరగాయల సాగుకు అవసరమైనటువంటి సదుపాయాల్లో రోజురోజుకు నూతన పద్ధతులు వస్తున్నాయని శాస్తస్రాంకేతిక పరిజ్ఞానం అధునాతనతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయ్నారు. సాగు సమయంలో మొక్కల పెంపకంలో సూక్ష్మ జాగ్రత్తలను పాటించినట్లయితే చెట్లుగా పెరుగుతాయని వాటికి పూత కాత దశల్లో అవసరమైన మేరకు మందులను వినియోగించాలన్నారు. తక్కువ సమయంలో అధిగ దిగుబడులనందించే పంటలపై రైతులు మక్కువను చూపాలని రైతులకు ప్రభుత్వం సబ్సిడీ పథకాలను అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకు ఆర్ధికంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. శాస్తవ్రేత్తలు టి. సురేష్‌రెడ్డి, ఎం. రంగారెడ్డి మాట్లాడుతూ తోటలను సాగుచేసుకునే ముందు రైతులు ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోవాలని ఆరోగ్యకరమైన మొక్కలతోనే చెట్లు పెరిగి ఆరోగ్యకరమైన పంట చేతికందివస్తుందన్నారు. మొక్కలకు సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన మందులను వినియోగించాలన్నారు. బత్తాయి, నిమ్మ చెట్లకు కాసిన కాయలను ఏడు మాసాలకే విక్రయించాలని ఎక్కువ నెలలు చెట్లపై కాయలు అలానే ఉట్లయితే వచ్చే ఏడాది దిగుబడి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో డిహెచ్ అండ్ ఎస్‌వోలు అరుణ, శ్రీ్ధర్, అశోక్‌కుమార్, అనంతరెడ్డి, మండల అధికారి స రేష్, వెంకటేశం, నాగయ్య, గోరఖ్‌నాథ్, రైతులు ఆకిటి సత్తిరెడ్డి, కొణతం సత్తిరెడ్డి, రామారావు పాల్గొన్నారు.