నల్గొండ

ఉత్కంఠగా కొత్త జిల్లాల టిఆర్‌ఎస్, కాంగ్రెస్ సారధుల భర్తీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 2: కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజకీయ పార్టీలు నూతన జిల్లా కమిటీలను, జిల్లా పార్టీల సారధులను నియమించుకునే ప్రక్రియను పూర్తి చేసుకుంటుండగా అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు మాత్రం తాత్సర్యం చేస్తున్నాయి. ఇప్పటికే వామపక్షాలు, టిడిపి, బిజెపి, బిఎస్‌పి, వైకాపా పార్టీలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పార్టీ నూతన అధ్యక్ష, కార్యదర్శుల నియామకాలను, కమిటీల భర్తీని పూర్తి చేసుకుని ఆ జిల్లాల్లో రాజకీయంగా బలం పుంజుకునే దిశగా పక్కా కార్యాచరణతో ముందడుగు వేస్తున్నాయి. టి.టిడిపి ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటలలో రైతు పోరుయాత్ర సభలు, ఫీజురీయంబర్స్‌మెంట్‌పై కలెక్టరేట్ల ముట్టడితో చలికాలంలో రాజకీయ సెగ రగిలించింది. మూడు జిల్లాల్లో టిడిపి సభ్యత్వ నమోదు సైతం సాగుతుంది. వామపక్షాలు తమదైన శైలిలో ఎదురైనా ప్రజా సమస్యలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలపై పోరాటాలతో ప్రజాదరణకు తంటాలు పడుతున్నాయి. బిజెపి సైతం సంస్థాగత సమావేశాలతో కొత్త జిల్లాల్లో పార్టీ బలోపేతం దిశగా కసరత్తు చేస్తుంది. అయితే టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మాత్రం కొత్త జిల్లాల్లో పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా ఇంతవరకు ప్రత్యేకంగా ఏలాంటి కార్యకలాపాలు, సంస్థాగత సమావేశాలు చేపట్టలేదు. కొత్త జిల్లాలను అనుసరించి ఆయా జిల్లాలకు నూతన కమిటీలను, అధ్యక్షులను ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాలు చేస్తున్న కసరత్తులో జాప్యం కొనసాగుతుంది. ఎదుటి పార్టీ వారు కొత్త జిల్లాల్లో ఎవరిని అధ్యక్షుడిగా చేస్తారో చూశాకే తమ పార్టీ జిల్లాల కమిటీలను ప్రకటిద్ధామన్న చందంగా రెండు పార్టీలు ఎత్తుగడలతో వ్యూహాప్రతివ్యూహాలతో సాగుతున్నాయి.
ఆశావాహుల్లో పోటాపోటీ !
యాదాద్రి జిల్లా పరిధిలోని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో నల్లగొండకు కొత్త డిసిసి అధ్యక్షుడితో పాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సైతం డిసిసి అధ్యక్షులను నియమించాల్సివుంది. నల్లగొండ డిసిసి రేసులో చిరుమర్తి లింగయ్య, హఫీజ్‌ఖాన్, జడ్పీటీసి శంకర్‌నాయక్‌లతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సూర్యాపేట డిసిసి రేసులో వేదాసు వెంకయ్య, చెవిటివెంకన్న, తండు శ్రీనివాస్‌యాదవ్, చకిలం రాజేశ్వర్‌రావులతో పాటు హుజూర్‌నగర్‌కు చెందిన నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. యాదాద్రి డిసిసి రేసులో బూడిద పేరుతో పాటు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బర్రె జహంగీర్, పోత్నాక్ ప్రమోద్‌కుమార్, పొతంశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు. రాహుల్‌గాంధీ నియమావళిని అనుసరించి డిసిసి అధ్యక్షుల ఎంపిక చేపట్టాల్సివుండటంతో చివరకు డిసిసి పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక టిఆర్‌ఎస్ మూడు జిల్లాల అధ్యక్షుల నియమాక ప్రక్రియను సీఎం కెసిఆర్ ఫైనల్ చేశారని త్వరలోనే పేర్లను ప్రకటిస్తారన్న సమాచారం వినిపిస్తుంది. నల్లగొండ అధ్యక్ష పదవి రేసులో బడుగుల లింగయ్య యాదవ్, చాడ కిషన్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. యాదాద్రిలో జడల అమరేందర్, పైళ్ల రాజవర్ధన్‌రెడ్డితో మరో ఇద్దరి పేర్లు, సూర్యాపేట నుండి యర్నేని బాబుతో పాటు మరో ముగ్గురు పరిశీలిస్తున్నారు. రేసులో ఉన్న పేర్లతో పాటు కెసిఆర్ స్వయంగా సర్వే, ఇంటలిజెన్స్ నివేదికల అధారంగా కొత్త జిల్లాల పార్టీ అధ్యక్షుల నియామకాన్ని చేపట్టనుండటంతో కొత్త జిల్లాల కారు సారధులు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది.