నల్గొండ

బ్యాంకులకు చేరని నగదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 2: ఆర్‌బిఐ చెప్పినట్లుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల బ్యాంకులకు శుక్రవారం కూడా 150కోట్ల కరెన్సీ అందలేదు. దీంతో తమ వద్ధ ఉన్న 20కోట్ల మేరకు డబ్బులను వేతనాలకు, పింఛన్లకు, ఇతర ఖాతాదారులకు బ్యాంకర్ల సర్ధుబాటు చేశారు. ఉద్యోగులకు, పింఛన్‌దారులైన రిటైర్డ్ ఉద్యోగులకు 10వేల చొప్పున కొందరికి చెల్లించగానే డబ్బులు అయిపోవడంతో మరికొందరికి నాలుగైదు వేల చొప్పున అందించి చేతులు దులిపేసుకున్నారు. తమకు ఆర్‌బిఐ నుండి డబ్బులు అందనప్పుడు తాము ఎలా ఇవ్వగలమంటు బ్యాంకర్లు, పోస్ట్ఫాస్ సిబ్బంది ఉద్యోగులకు, పింఛన్‌దారులతో చెల్లింపుల్లో తమ నిస్సాహాయతను వ్యక్తం చేశారు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్ బ్యాంకులకే ఆర్‌బిఐ నుండి డబ్బు అందకపోవడంతో ఇతర బ్యాంకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జీతాలు, పింఛన్లు ఇచ్చే బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు కొన్ని బ్యాంకుల్లో ఏర్పాటు చేయగా మరికొన్నింటిలో చేయలేదు. తగిన కరెన్సీ ప్రింట్ చేసి సకాలంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటు పలువురు ఉద్యోగులు, పింఛన్‌దారులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆన్‌లైన్‌లో తమకు వేతనాలు, ఫించన్ డబ్బులు తమ ఖాతాల్లో జమైనందునా నిబంధనలను అనుసరించి అవసరాల మేరకు వారం పిదపనైనా మరికొంత నగదు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండటం ఊరటగా ఉందన్నారు. మరోవైపు జీతాలు, పింఛన్ల చెల్లింపు సమయం కావడం, శుక్రవారంతో పన్నులు, చార్జీల వసూళ్లలో సైతం రద్ధయిన పెద్దనోట్లను తీసుకునే వసతి ఆగిపోయిన నేపధ్యంలో వివిధ వర్గాల ప్రజల నుండి బ్యాంకుల్లో, ఏటిఎంల వద్ధ ప్రజల రద్ధీ పెరిగింది. అయితే కనీసం 25శాతం ఏటిఏంలలో కూడా నగదు పెట్టకపోవడంతో నగదు ఉన్న ఏటిఎంలలో పెద్ద ఎత్తున బారులు తీరిన జనంలో కొద్ధిమందికే నగదు లభించగా మిగతావారంతా క్యూలో నిలబడి నగదు లభించక నిరాశతో తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. పెద్ధనోట్ల రద్ధుతో నెలకొన్న కష్టాలు ఎప్పటికి తీరేనో అంటు ప్రజలు అసహనం వెళ్లగక్కారు.