నల్గొండ

ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1000నోట్లను రద్దుచేసిన నేపథ్యంలో తమ ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రజలు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. మండలపరిధిలోని బాలెంల గ్రామంలో గ్రామపంచాయితీ ఆవరణలో డిజిటల్ పైనాన్సియల్ లిటరసి ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలకు నగదు ఇబ్బందులను తొలగించేందుకు ఆన్‌లైన్ సేవలను విస్తృతపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాంకులో నగదు ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు జరపాలన్నారు. మొదట్లో కొంత ఇబ్బంది కలిగిన రాబోయే కాలంలో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. జన్‌దన్ యోజన సందర్భంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించని వారు బ్యాంకు ఖాతాను ప్రారంభించి ఆధార్‌తో బ్యాంకు నెంబర్‌ను అనుసంధానం చేసుకుంటే రూపే కార్డులు బ్యాంకు వారు జారీచేస్తారని వాటిని ఆన్‌లైన్ సేవల కోసం వినియోగించుకోవచ్చునన్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు మీసేవా నిర్వాహకులు సహకరించాలని సూచించారు. రేషన్ డీలర్లు కూడా సరుకులను ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని ఇందుకోసం స్వైప్ యంత్రాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామంలో బహిరంగ మలవిసర్జన లేకుండా చేసి ఇతర గ్రామాలకు ఆదర్శ గ్రామంలో నిలవాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన వలన గ్రామంలో పరిశుభ్రత ఉండదని దీని వలన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మహామూద్ అలీ, సర్పంచ్ ప్రభాకర్, ఎంపిటిసి బిక్కుసింగ్, ఐసి ఐసి ఐ క్లస్టర్ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ సుమన్, కెనరా బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.