నల్గొండ

టోల్ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, డిసెంబర్ 3: మండలంలోని కొర్లపహాడ్ గ్రామశివారులో గల టోల్‌ఫ్లాజా వద్ద గత అర్దరాత్రి నుంచి టోల్ రుసుము వసూళ్లు చేస్తుండడం వల్ల వాహనదారుల సందడి వాతావరణంతో పాటు సరిఫడా లభించకపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గత 11వ తేదీ నుండి ఈనెల 1వ తేదీ వరకు రద్దు అయిన పెద్దనోట్ల వల్ల చిల్లర కష్టాలు తీర్చే క్రమంలో టోల్ వసూళ్లు రద్దు జరిగింది. కాగా గత అర్దరాత్రి నుంచి టోల్ వసూళ్లు చేస్తుండడంతో కొత్త రూ.500ల నోట్లు అందుబాటులో లేకపోవడం, రూ.2వేల నోటుకు సరఫడ చిల్లర లేకపోవడం, పాత రూ.500లు చెల్లకపోవడం వల్ల టోల్ ఫ్లాజాకు 100మీటర్ల దూరం నుండే వాహనదారులకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏటి ఎం సేవల కోసం స్వైప్ మిషన్ ద్వారా వాహనాల దగ్గరకు వచ్చి టోల్ వసూళ్లు చేయడంతో పాటు వాహనదారులు ఇచ్చే రూ.2వేల నోటుకు చిల్లర ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టడం ద్వార టోల్ ఫ్లాజాలో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే అన్ని తెరిచ ఉన్నప్పటికి వాహనాలు భారీగా నిలిచిపోవడం జరిగింది. ఈ క్రమంలో స్థానిక ఎస్ ఐ మద్దెల కిష్ణయ్య పోలీస్ సిబ్బందితో పాటు జి ఎం ఆర్ సిబ్బందితో కలిసి వాహనదారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానం మీద అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దిశ నిర్దేశం చేశారు.
చౌటుప్పల్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రహదారులపై ఇప్పటి వరకు మూసిన టోల్‌గేట్లను అర్థరాత్రి నుంచి తీసి టోల్ వసూళ్లు ప్రారంభించారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై పంతంగి శివారులో ఉన్న టోల్‌ప్లాజా వద్ద టోల్ వసూళ్లు ప్రారంభించడంతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున స్వైప్ యంత్రాలు కొంత సేపు మొరాయించాయి. ఐదు వందల నోట్లు కొత్త కరెన్సీ రాకపోవడంతో చిల్లర అందుబాటులో లేక వాహనదారులు అనేక ఇబ్బందులుపడ్డారు. రూ.2వేల నోటుకు చిల్లర ఇవ్వలేక టోల్ నిర్వహకులకు కష్టాలు వచ్చాయి. వంద రూపాయల టోల్‌కు రెండు వేల నోటు ఇస్తే 19 వంద నోట్లు ఇవ్వడం సాధ్యం కావడంలేదు. స్వైప్ మిషన్‌లను ఏర్పాటు చేశారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టోల్ వసూళ్లు చేయడంతో ఆలస్యమవుతుంది. దీంతో వాహనాల రద్దీ పెరిగిపోయి బారులుతీరుతున్నాయి. చౌటుప్పల్ ఆర్డీవో మహేందర్‌రెడ్డి, తహశీల్దార్ షేక్‌అహ్మద్, జిఎంఆర్ ప్రతినిధి శ్రీ్ధర్‌రెడ్డిలు టోల్ వసూళ్లను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దారు. అధికారులు టోల్‌ప్లాజా వద్దే ఉండి ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనదారులు చిల్లర ఇవ్వాలని లేదా నగదురహిత చెల్లింపులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి
* డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం
* సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, డిసెంబర్ 3: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలుచేస్తుందని జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. దివ్యాంగుల అభ్యున్నతికి దోహదపడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 20వేల మంది దివ్యాంగులకు నెలకు రూ. 1500చొప్పున రూ. 30కోట్లను ప్రభుత్వం పెన్షన్‌గా అందజేయడం జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులందరికి పెన్షన్ మంజూరీ చేసేందుకు 10రోజుల్లో స్థానిక ఏరియా ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో దివ్యాంగులందరికి ట్రైసైకిల్స్ అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 716 దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఉన్నాయని వారి సమస్యలను చర్చించి ఆర్ధికాభివృద్దికి దోహదపడేలా మహిళా సమాఖ్యలో తోడు కల్పించనున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులకు బ్యాంక్ లింకేజి కింద రూ. 4కోట్ల రుణాలను అందిస్తామని అంతే కాకుండా రెండు పడకల ఇండ్ల నిర్మాణంలో రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖలో ఏపి ఎంను నియమించనున్నట్లు తెలిపారు. శ్రీనిధి కింద జిల్లాకు కేటాయించిన రూ. 49కోట్లల్లో రూ. 5కోట్లను దివ్యాంగులకు కేటాయించనున్నట్లు చెప్పారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
* దివ్యాంగులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత
* నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ టౌన్, డిసెంబర్ 3: అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో దివ్యాంగులు ముందకు వెళ్లాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొని స్ధానిక టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మనూన్యత భావాన్ని వీడి సామార్ధాన్ని వెలికి తీసే దిశగా పైకి ఎదిగేందుకు తమవంతు బాధ్యతగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ప్రాధాన్యతనిస్తుందని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో మూడుశాతం రిజర్వేషన్ అమలుకు వారి కోసం కృషి చేస్తామన్నారు. ఉపాధి హామీ దివ్యాంగుల శ్రమశక్తి సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించామని వారికోసం 171 స్వయం సహాయక సంఘాలకు 1.38 కోట్లు, స్వయం సహాయ సంఘాలకు 93.35 లక్షలు, స్ర్తినిధి నుండి 27 సంఘాలకు 19.21 లక్షలు ఆర్ధిక సహాయం అందించామన్నారు.
ఉపాధి హామీ పథకంలో దివ్యాంగులకు 71,693 పనిదినాలను కల్పించి 1.02 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. అంతేగాకుండా షార్ట్‌పుట్, రన్నింగ్, చెస్ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను, 5.10 లక్షల రూపాయలను వాహన సబ్సీడీని 17 మందికి, పది మందికి మూడు చక్రాల సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మానసిక వికలాంగులను, చిన్నారులకు పరామర్శించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ అంజయ్య, మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ వయో వృద్దుల శాఖ పిడి పుష్పలత, జిల్లా సాంఘీక సంక్షేమశాఖాధికారి ఈశ్వరయ్య, జెడ్పి డిప్యూటీ సి ఈ ఒ గోనె మోహన్‌రావు, టి ఆర్ వి ఎస్ జిల్లా అధ్యక్షులు చింతల సైదులు, మేడ యాదగిరి, వి హెచ్‌పి ఎస్ కన్వీనర్ వెంకట్‌సింగ్, పెరిక శ్రీను, కందుల లక్ష్మయ్య, కంచర్ల మల్లయ్య, ఎన్‌పి ఆర్‌డి వెంకట్‌రెడ్డి, పజ్జూరి సాయిలు, సీత వెంకన్న, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శిధిలావస్థ భవనంలో
బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు
* ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధానకార్యదర్శి మల్లం మహేష్
చిట్యాల, డిసెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు శిధిలావస్థలో ఉన్న భవనంలో మండలంలోని వెలిమినేడు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధానకార్యదర్శి మల్లం మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని వెలిమినేడు జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం మల్లం మహేష్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి సర్వే నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న నూతన భవనంను మద్యాహ్న భోజనంను పరిశీలించారు. ఈసందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వహిస్తుందనడానికి వెలిమినేడు జెడ్పీహెచ్‌ఎస్ నిదర్శనమని విద్యార్థుల కోసం నిర్మిస్తున్న నూతన భవనం నిధుల లేమితో అసంపూర్తిగా ఉన్నదన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో రెండేళ్ళుగా భవన నిర్మాణం కొనసా..గుతూనే ఉన్నదన్నారు. 50సంవత్సరాల చరిత్ర గల పాఠశాలలో శిధిలావస్థలో ఉన తరగతి గదుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని భయంతో విద్యాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనానికి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తిచేయాలని, పెండింగ్‌లో ఉన్న మద్యాహ్న భోజన బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షుడు కూనూరు గణేష్, బొంతల సాయిప్రసాద్‌రెడ్డి, ఎం. ప్రవీణ్, మేడబోయిన సురేష్, . సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
* నల్లగొండ జిల్లా కలెక్టర్
నల్లగొండ టౌన్, డిసెంబర్ 3: క్రిస్మస్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రిస్మస్ పండుగ ఏర్పాట్లపై నియోజకవర్గ నోడల్ అధికారులు, చర్జి కమ్యునిటీ ఫాదర్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. నిర్ధేశించిన ప్రకారంగా నిరుపేదలకు బట్టల పంపిణీలో అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికలో ఏయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వింతంతులు, దివ్యాంగులు, అనాధ వృద్దాశ్రమాలు, నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు లేనివారికి చర్చి ఫాదర్స్ దృవీకరణ పత్రం ద్వారా ఎంపిక చేయాలన్నారు. గత సంవత్సరం లబ్ది పొందిన వారు కాకుండా కొత్త వారిని వెయ్యి మందిని గుర్తించాలని కోరారు. ఫాదర్ల విజ్ఞాపన మేరకు కలెక్టర్ కేక్‌ను కట్‌చేశారు. ఈసమావేశంలో డి ఆర్ ఒ అంజయ్య, జిల్లా మైనార్టీ అధికారి వెంకటేశ్వర్లు, నల్లగొండ, దేవరకొండ ఆర్ డి ఒలు వెంకటాచారి, గంగాధర్‌లతో పాటు ఆయా చర్చిల ఫాదర్స్ పాల్గొన్నారు.
అతివేగం వద్దే వద్దు..
ప్రమాదానికి గురవ్వదు.్ద.
* 2కెరన్‌ను ప్రారంభించిన ఎస్పీ పరిమళ
కోదాడ, డిసెంబర్ 3: అతివేగంతో వాహనదారులు ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూర్యాపేట జిల్లా యస్‌పి పరిమళ హననూతన్ కోరారు. కోదాడ పట్టణ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు శనివారం పట్టణంలో నిర్వహించిన 2కెరన్‌ను యస్‌పి పరిమళ హననూతన్ ప్రారంభించారు. బాలుర హైస్కూల్‌నుండి నాగుబండి రామ్మూర్తినగర్ వరకు నిర్వహించిన 2కెరన్‌ను తొలుత బాలుర హైస్కూల్‌లో బెలూన్లను ఎగురవేసి యస్‌పి పరిమళ ప్రారంభించారు. తదుపరి నాగుబండి రామ్మూర్తినగర్‌లో నిర్వహించిన సమావేశంలో యస్‌పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా వుండాలంటే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. అప్పుడే వాహనచోధకుడితోపాటు ఇతరులు సురక్షితంగా గమ్యం చేరుతారని ఆమె వివరించారు. అతివేగం, అజాగ్రత్త ప్రమాదాలకు కారణమని ఆమె పేర్కొన్నారు. మనలను మనం నియంత్రించుకొనేందుకు 2కెరన్‌ను నిర్వహించినట్లు ఆమె వివరించారు. బయటకు వెళ్లిన కుటుంబపెద్ద ఇంటి వచ్చేవరకు కుటుంబసభ్యులు ఎదురుచూస్తారని గమనించి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఆమె కోరారు. భూమి మీదకు వచ్చిన ప్రతి వ్యక్తి మంచి లక్షణాలను అలవర్చుకొంటూ ఉత్తముడిగా ఎదగాలని, చట్టవిరుద్దంగా వ్యవహరించవద్దని యస్‌పి పరిమణ హననూతన్ కోరారు. కార్యక్రమంలో కోదాడ జూనియర్ సివిల్ జడ్జి వీరనాగేశ్వర్‌రావు, డియస్‌పి సునీతామోహన్, కోదాడ పట్టణ సిఐ రజితారెడ్డి, గ్రామీణ సిఐ మధుసూదన్‌రెడ్డి, తాహాశీల్దార్ శ్రీదేవి, మున్సిపల్ ఛైర్మన్ వంటిపులి అనితనాగరాజు, వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అద్యక్షులు ఈదుల కృష్ణయ్య, సురేష్, ఓరుగంటి కిట్టు తదితరులు పాల్గొన్నారు. తదుపరి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని ప్రజలతో యస్‌పి పరిమళ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బ్లూ కార్ట్స్ ద్విచక్ర వాహానాలను ఎస్‌పి ప్రారంభించారు.
రైతులకు ఎరువులు అరువు
* పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో కంపెనీల ఉదారత
* వెల్లడించిన జెడి నర్సింగరావు
చిట్యాల, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రూ.1000, 500లు రద్దుచేయడంతో విత్తనాలు ఎరువులు మందులను కొనుగోలు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకుగాను ఎరువులను అరువుగా ఇచ్చేందుకు త్వరలో ఎరువుల కంపెనీలు, డీలర్లతో సమావేశాన్ని నిర్వహించనున్నామని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు నర్సింగరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని శనివారం జెడిఎ నర్సింగరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడే ఉన్న రైతులతో చర్చించారు. కొనుగోళ్ళలో ఇబ్బందులు కలుగుతున్నాయా అని రైతులను జెడి ప్రశ్నించడంతో నోట్ల రద్దుపై రైతులు ఏకరువుపెట్టారు. నోట్ల రద్దువల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎరువులు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు రావడంతో యజమానులు రద్దయిన నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని తాము ఎక్కడికెళ్ళాలని ఆవేధన వ్యక్తం చేశారు. సాగుచేసే పంటలకు సకాలంలో ఎరువులు మందులు వినియోగించాలని నోట్ల రద్దుతో వాటి కొనుగోలుకు పడరాని పాట్లు పడుతున్నా దుకాణదారుల నోట్లను తీసుకోవడంలేదని వాపోయారు. ఎరువులను మందులను రైతులకు అరువుపై ఇచ్చేందుకు కంపెనీలు, డీలర్లతో చర్చలు జరుపుతామని రైతులకు తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సందర్శించి ఎవో సుంకోజు శ్రీనివాస్‌ను పంటల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పంటల సాగులో సకాలంలో ఎరువులు మందులను పంటలపై వినియోగించేందుకు ఎరువుల దుకాణాల్లో కొనుగోలుకు వెళితే యజమానులు రద్దయిన నోట్లను తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారి త్వరలో రైతుల ఇబ్బందులు తొలగించనున్నామని అరువులో విత్తనాలు ఎరువులు మందులు ఇచ్చేందుకు కంపెనీలు డీలర్లతో సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. రెండేళ్ళకోసారి భూసార పరీక్షలను నిర్వహించి పంటల దిగుబడిని పేంచేందుకు ఉపయోగపడతాయన్నారు.
60 ఏళ్ల పాపాన్ని ఆరేళ్లలో కడిగేస్తాం
* నూతన స్ర్తిశక్తి, ఉపాధి హామీ
భవనాలను ప్రారంభించిన ఎంపి బూర
నాంపల్లి, డిసెంబర్ 3 : గత పాలకులు, ప్రభుత్వాలు 60 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి అభివృద్ది చేయలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిత తరువాత అట్టి పాలకుల పాపాన్ని ఆరు సంవత్సరాల్లో కడిగేస్తామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన స్ర్తిశక్తి భవనం, జాతీయ ఉపాధి హామీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆవరణ ముంగిట చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ముఖ్యమంత్రి కేసి ఆర్ తన ప్రాణాలను ఫనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారన్నారు. రెండున్నరేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆర్ధికంగా ఎదుగుతుందన్నారు. కేంద్రంలో 50వేల కోట్ల ఆదాయం ఉండగా మన తెలంగాణలో 31వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగానే వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు వెయ్యి రూపాయల ఫెన్షన్‌ను అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యంతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని, కుటుంబంలో మహిళలు ఆర్ధికంగా ఎదిగినప్పుడే దేశం బాగుంటుందన్నారు. సమభావన సంఘాల ద్వారా మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆర్ధికంగా, సామాజికంగా బాగుపడుతారన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండలంపై ప్రత్యేక శ్రద్ద పెట్టానని, మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని మిషన్ భగీరథ పనులతో పైప్‌లైన్లు వేగవంతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడవ విడత మిషన్ కాకతీయ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు. డిండి శివన్నగూడెం ప్రాజెక్టుకు టెండర్లు పూర్తి అయ్యాయని, పనులు కూడా మొదలయ్యాయన్ని దీంతో 55వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. అనంతరం మహిళా సంఘాల గ్రూపులకు 4 కోట్ల 85 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజశ్యాంసుందర్, ఎంపిటిసి కోరే ప్రమీళమురళీ, జెడ్పిటిసి శే్వతారవీందర్‌రెడ్డి, ఎంపిడి ఒ హనుమాన్ ప్రసాద్, తహశీల్ధార్ ఖలీల్, వైస్ ఎంపీపీ కవిత వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ గణేష్, మోహన్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.