నల్గొండ

డబుల్ బెడ్‌రూం పథకానికి నిధుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 9: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర హౌజింగ్ ముఖ్య కార్యదర్శి చిత్రరామచంద్రన్ స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయా జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం పథకం పురోగతిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం 213 కోట్ల ప్లాన్ బడ్జెట్ మంజూరు చేసినందున హడ్కో నుండి 282 కోట్ల రుణం పొందామని ఈ మొత్తం ఖర్చు చేస్తే మరో 900 కోట్ల రుణం మంజూరు కానుందన్నారు. డబుల్ బెడ్‌రూంల నిర్మాణ ప్రగతి నివేదిక అందించిన వెంటనే జిల్లా కలెక్టర్లు నిధులను బదిలీ చేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని నిధుల మంజూరుకు ప్రతిపాదనలతో యుసి అందజేయాలని తెలిపారు. స్ధల సేకరణ పూర్తి చేసి ఈ నెలాఖరులోగా లే అవుట్లు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆరు నెలల్లో డిసెంబర్ 2017 నాటికి నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్లకు సూచించారు. టెండర్ ప్రక్రియలో ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు నమ్మకం కుదిరేలా చొరవ తీసుకోవాలన్నారు. టెండర్‌లో ఎంపికైన కాంట్రాక్టర్లకు ఇండ్ల నిర్మాణానికి సిమెంట్ బస్తా 230 రూపాయలు, 100 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా ఇసుకను అందిస్తామన్నారు. వాహన రవాణా చార్జీలు ఉంటాయన్నారు. 100 కిలోమీటర్లపైబడిన దూరం ఇసుకకు 50శాతం ధరతో అందిస్తామన్నారు. డబుల్ బెడ్‌రూంల పధకం అమలుకు జిల్లాస్ధాయి కమిటీ ఏర్పాటు చేసి గ్రామ సభ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని, నిబంధనల మేరకు ఎస్సీ , ఎస్టీలకు అవకాశం కల్పించాలని కోరారు. నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ తమ జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలో పనులు యాదాద్రి జిల్లా పరిధిలో ఉన్నాయన్నారు.