నల్గొండ

నగదు రహిత విధానానికి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 9: గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన నగదు రహిత కార్యక్రమం నోడల్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీల విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. ప్రణాళిక అంశాల మేరకు బ్యాంకర్లు, అధికారులు గ్రామాలను సందర్శించి ఖాతాలు లేనివారితో బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. ప్రతి ఖాతాదారునికి ఏటిఎం, డెబిట్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతీ, యువకులకు మొబైల్ లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామీణ దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. ఉపాధి హామీ చెల్లింపులు నగదు రహితంగా జరుపాలన్నారు. కిరాణం దుకాణాలు, జనరల్ స్టోర్స్, మెడికల్ షాపు, ఎరువులు, విత్తనాల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు అమలు అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జేసి నారాయణరెడ్డి, జెడిఏ నర్సింహ్మారావు, హౌజింగ్ పిడి పాల్గొన్నారు.