నల్గొండ

24 వేల లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంతో.. గోదాముల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 24వేల లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామియేలు తెలిపారు. ఆయన శుక్రవారం నేరేడుచర్లలో నిర్వహించిన మాదిగల అలాయ్‌బలాయ్ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, పాల్వంచ, జగిత్యాల, కొత్తగూడెంలలో నూతన గోదాములు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పదిలక్షల మెట్రిక్ టన్నుల నిల్వ గోదాములు ఉండగా తెలంగాణలో కేవలం 2.40లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ గోదాములు మాత్రమే ఉన్నాయని, అంతేకాకుండా ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా 120ప్రైవేట్ గోదాములు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంలో 45వేల చెరువుల్లో పూడికతీయడం ద్వారా చెరువులు జలకలతో నిండి ఖరీఫ్‌లో సమృద్ధిగా పంటలు పండి గోదాములన్ని ధాన్యంతో నిండిపోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం 36లక్షల నిరుపేదలకు పెన్షన్లు, ఎస్‌సి, ఎస్‌టిలకు కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందుతున్నాయన్నారు. సమాజంలో సమతూల్యత సాధించాలంటే అందరు విద్యనభ్యసించాలని, మాదిగలు ఇంటర్ విద్యతోనే నిలిపివేస్తున్నారని, రాజకీయాలను నమ్ముకోకుండా విద్యనభ్యసించి ఉద్యోగాలు పొంది అభివృద్ధిచెందాలన్నారు. ప్రభుత్వం 270గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎబిసిడి రిజర్వేషన్ల వర్గీకరణకు ముఖ్యమంత్రి గతంలోనే లేఖ ఇచ్చారని తెలిపారు. అనంతరం ఆయనను పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపిపి గీతారామచందర్‌నాయక్, సర్పంచ్ ననె్నపంగ వెంకటలక్ష్మీ, ఎంపిటిసి ప్రకాశ్, నాయకులు రాపోలు నవీన్, ఇంజమూరి రాజేశ్, పల్లెపంగు నాగరాజు, భరత్, నాగార్జున, ఇంజమూరి మల్లయ్య, ఇంజమూరి వెంకటయ్య, యడవెల్లి చంద్రయ్య, పిడమర్తి రాజు, మధు, కొణతం లచ్చిరెడ్డి, గౌస్, సుందర్‌రావులు పాల్గొన్నారు.